S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/05/2018 - 01:58

అవి మైదానాల్లో ప్రదర్శనల ద్వారా రూపొందుతాయి. డ్రెస్సింగ్ రూంలో కబుర్లనుంచి కాదు. అత్యుత్తమ పర్యాటక జట్లు మాటలతో కాదు, బ్యాటులతో ఆడాలి.
-టీమిండియా ఓటమి తరువాత రవిశాస్ర్తీకి సెహ్వాగ్ కౌంటర్

09/05/2018 - 01:57

టీమిండియా ప్రపంచంలోనే
అత్యుత్తమ
పర్యాటక జట్టుగా
ఎదగాలన్నది నా ఆకాంక్ష

-ఇంగ్లాండ్ టూర్‌కు ముందు రవిశాస్ర్తీ వ్యాఖ్య

09/05/2018 - 01:49

న్యూయార్క్, సెప్టెంబర్ 4: సంచలనాల మరియా షరపోవా, స్విస్ సెనే్సషన్ చాంపియన్ రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. న్యూయార్క్ ఆర్థర్ అషె స్టేడియం లైట్ల వెలుగుల్లో ప్రపంచ ర్యాంకుల్లో ఎక్కడోవున్న ప్లేయర్లపై ఓటమి చవిచూసి సంచలనం రేకెత్తించారు.

09/05/2018 - 01:47

చాంఘ్వన్ (ద.కొరియా), సెప్టెంబర్ 4: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ షూటింగ్‌లో భారత షూటర్ ఓం ప్రకాష్ మిథర్వాల్ పసిడి పతకాన్ని సాధించాడు. గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌లో 50మీటర్లు, 10మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో రజతాలు సాధించిన ఓం ప్రకాష్ మంగళవారం 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 564 పాయింట్లు సాధించి తన సత్తా చాటుకున్నాడు.

09/05/2018 - 01:45

సౌతాంఫ్టన్, సెప్టెంబర్ 4: టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకోవడంలో టీమిండియా వైఫల్యాలపై దాదా గొంతువిప్పాడు. వరుస వైఫల్యాలకు ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ బాధ్యత వహించకుంటే.. విదేశీ పర్యటనల వైఫల్యాల వరుసలో ఎలాంటి మార్పూ ఉండదని హెచ్చరించాడు. ఒక్క నాటింగ్‌హామ్ తప్ప నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో మూడింటిని ఇంగ్లీష్ జట్టు కైవసం చేసుకుని సిరీస్‌ను సాధించడం తెలిసిందే.

09/05/2018 - 01:43

లండన్, సెప్టెంబర్ 4: సొంతగడ్డపై భారత్‌తో ఇంగ్లాండ్ ఆడబోయే చివరి టెస్ట్‌కు ఎలాంటి మార్పులులేని జట్టును ఈసీబీ ప్రకటించింది. శుక్రవారం ఒవల్‌లో సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్ట్ జరగనుంది. నిజానికి సిరీస్‌లో 3-1 స్కోరుతోవున్న ఇంగ్లాండ్‌కు చివరి టెస్ట్ లాంచనప్రాయమే. భారత్‌తో సీరీస్‌లో చివరి టెస్టే, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న అత్యధిక పరుగుల వీరుడు అలిస్టర్ కుక్‌కు ఫేర్‌వెల్ గేమ్ కానుంది.

09/05/2018 - 01:41

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: వెస్టిండీస్‌తో భారత్ ఆడనున్న ఏడువారాల హోం సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, డబ్ల్యుఐసిబిలు ప్రకటించాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లోవున్న టీమిండియా, సెప్టెంబర్ 15నుంచి ఆసియా కప్‌కు హాజరుకానుంది. సెప్టెంబర్ 28 వరకూ జరిగే ఆసియాకప్‌లో భారత్ సహా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ జట్లు పోటీ పడతాయి.

09/04/2018 - 03:33

సౌతాంఫ్టన్: పర్యాటక మ్యాచ్‌ల్లో ఎదురయ్యే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని విజయ శిఖరాన్ని ఎలా అధిరోహించాలో టీమిండియా మరింత నేర్చుకోవాల్సి ఉందని స్కిప్పర్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో నాల్గవ టెస్ట్ మలి ఇన్నింగ్స్‌లో 245 పరుగుల లక్ష్య ఛేదనకు 60 పరుగులు దూరంగా నిలిచిపోయిన టీమిండియా వైఫల్యాన్ని అన్యమనస్కంగా ప్రస్తావించాడు.

09/04/2018 - 01:32

చాంఘ్వాన్, సెప్టెంబర్ 3: టోక్యో 2020 ఒలింపిక్‌కు ఇద్దరు భారత షూటర్లు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రజతం, నాల్గవ స్థానాన్ని సాధించిన షూటర్లు అంజుమ్ వౌద్గిల్, అపూర్వీ చండేలాలు వచ్చే ఒలింపిక్‌కు అర్హత సాధించారు.

09/04/2018 - 01:35

టెస్ట్ క్రికెట్‌కు ఇది శుభశకునం. ఇంగ్లాండ్ -్భరత్ సిరీస్‌తో టెస్ట్ క్రికెట్ ఇంకా బతికే ఉందన్న భావన కలిగింది. అభిమానులకు ఇంకా అలరిస్తుందన్న నమ్మకం కలిగింది. ఈ ఘనత మొత్తం టీమిండియాదే. నాల్గవ టెస్ట్‌లోనే కాదు, సిరీస్ మొత్తంలో వాళ్లు అద్భుతమైన ఆట ప్రదర్శించారు. ఈ సిరీస్‌తో ఇంట్లో కూర్చుని ఆటను ఎంజాయ్ చేస్తున్న అభిమానుల సంఖ్య పెరిగిందనే అనుకుంటున్నా.

Pages