S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/23/2018 - 00:30

నాటింగ్‌హామ్, ఆగస్టు 22: ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీమిండియా సాధించిన విజయాన్ని కెపెక్టన్ కోహ్లీ కేరళకు అంకితమిచ్చాడు. ‘అనూహ్య వరదలతో అతలాకుతలమైన కేరళ వరద బాధితులకు ఈ విజయాన్ని అంకితం ఇవ్వాలని టీమిండియా నిర్ణయించింది. భారత క్రికెట్ జట్టుగా మా వంతు మేం చేయగల సాయమిది. అక్కడి పరిస్థితులు విషమంగా ఉన్నాయి’ అని 203 పరుగుల ఆధిక్యంతో గెలిచిన తరువాత కోహ్లీ ప్రకటించాడు.

08/22/2018 - 17:13

జకర్తా: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో షూటర్ రహీ జీవన్ సర్నోబత్ స్వర్ణ పతకాన్ని చేజిక్కుంచుకుంది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠంగా సాగటం గమనార్హం.

08/23/2018 - 20:56

న్యూఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఫోర్బ్స్‌ ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తున్న క్రీడాకారిణుల జాబితాను ప్రకటించింది. ఇందులో పీవీ సింధు ఏడో స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధు కావడం విశేషం.

08/22/2018 - 00:19

నాటింగ్‌హామ్: వరుసగా ఇంగ్లీష్ కౌంటీలు ఆడటం ప్రస్తుత ఇంగ్లాండ్ టెస్ట్‌లో తనకెంతో ఉపకరించిందని భారత బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పూజారా అన్నాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో ఫాంలో లేకపోవడంతో వత్తిడికి గురైన మాట వాస్తవమని, అయితే ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి ఇంగ్లీష్ కౌంటీల్లోని అనుభవమే ఉపకరించిందన్నాడు.

08/22/2018 - 00:17

న్యూఢిల్లీ, ఆగస్టు 21: బీసీసీఐ తన కొత్త రాజ్యాంగాన్ని చెన్నైలోని తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం రిజిస్ట్రేషన్ చేయించింది. దీంతో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) బీసీసీఐ ఎన్నికల నిర్వహణకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన జస్టిస్ లోథా కమిటీ బీసీసీఐ పాత రాజ్యాంగంలో పలు సంస్కరణలు సూచించిన విషయం తెలిసిందే.

08/22/2018 - 00:16

ట్రెంట్ బ్రిడ్జి, ఆగస్టు 21: ట్రెంట్ బ్రిడ్జిలో గిరాటపర్వం దాదాపు ముగిసింది. థర్డ్ టెస్ట్‌లో చావో రేవో తేల్చుకోడానికి దిగిన టీమిండియా, జో సైన్యాన్ని రేవెట్టేసింది. విరాట సేన విజృంభణ ముందు ఇంగ్లీష్‌వీరులు తలొంచేశారు. 520 పరుగుల ఆధిక్యాన్ని అధిగమించలేని పోరాటంతో విజయాన్ని దాదాపు భారత్‌పరం చేశారు.

08/22/2018 - 00:14

పాలెంబాగ్/ జకార్తా, ఆగస్టు 21: 18వ ఆసియా గేమ్స్‌లో భారత షూటర్లు భళా అనిపిస్తున్నారు. మంగళవారం మరో మూడు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో పదహారేళ్ల కుర్ర షూటర్ సౌరబ్ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. మీరట్‌కు చెందిన రైతు కొడుకు సౌరబ్ దిగ్గజ షూటర్లను వెనక్కినెట్టి అత్యధిక పాయింట్లతో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

08/21/2018 - 23:53

జకార్తా, ఆగస్టు 21: దేశం కోసం ఆసియా క్రీడా వేదికనెక్కిన తరువాత రైతు కొడుకైనా, రౌతు బిడ్డయినా గురి పెట్టాల్సింది లక్ష్యానికే. సాధించాల్సింది పతకానే్న. అదే చేశాడు మీరట్ కుర్రాడు సౌరబ్ చౌదరి. రైతు కుటుంబంలో కష్టాలు సౌర బ్ ఇంట్లోనూ మామూలే అయినా, అవేమీ అతన్ని డిస్ట్రర్బ్ చేయలేదు. లక్ష్యానికి ఒక్కసారి గురిపెట్టాక మిగిలిన వేటినీ నీ కన్ను చూడకూడదన్న కోచ్ మాటలు చెవుల్లో రింగుమంటుంటే...

08/21/2018 - 02:56

పసిడి పట్టు ఫలించింది. ఆసియాస్థాయిలో మూడు రజతాలు సాధించాను కనుక, ఈసారి స్వర్ణానికే కట్టుబడివున్నా. అందుకనుగుణంగా శరీరమూ స్పందించింది. క్రమశిక్షణతో కూడిన తర్ఫీదుకు భగవంతుడి దయ కూడా తోడైంది. ఈ రోజు నాది. అందుకే స్వర్ణం దక్కింది. అథ్లెట్ కెరీర్‌లో గాయాలు మామూలే. మానసిక, శారీరక భావోద్వేగాలు ఒక్కోసారి మనల్ని ఇబ్బందిపెడుతుంటాయి. వాటిని జయించడం గత టోర్నీలతోనే నేర్చుకున్నా.

08/21/2018 - 02:55

ట్రెంట్‌బ్రిడ్జి, ఆగస్టు 20: ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో నన్ను కపిల్‌దేవ్‌తో పోలుస్తున్నారు. లెజెండ్స్‌తో పోలిక బావుంటుంది. కానీ, పొరబాటున ఎప్పుడైనా విఫలమైతే పోలికలు తెచ్చినోళ్లే పోట్లేసి చంపేస్తారు. ప్లీజ్.. ననె్నవరితోనూ పోల్చకండి. నేను కపిల్‌దేవ్ కావాలని అనుకోవట్లేదు. హార్దిక్ పాండ్యాలాగే ఉండాలనుకుంటున్నా. అలా ఉండటానికే ఇష్టపడతా.

Pages