S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/13/2020 - 04:32

ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ కోసం ఆదివారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న భారత్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు. సిరీస్‌లో భాగంగా మొదటి వనే్డ ముంబయి వేదికగా వాంఖడే స్టేడియంలో జరగనుంది.

01/13/2020 - 04:27

ముంబయి, జనవరి 12: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీలా మ్యాచ్‌లను ఫినిష్ చేయాలని అనుకుంటున్నానని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా క్యారీ మాట్లాడుతూ ధోనీ అద్భుతమైన మ్యాచ్ ఫినీషరని, చివరి వరకు క్రీజు లో ఉండి, జట్టును గెలిపిస్తాడన్నాడు. తాను కూడా అలాగే ఆడాలనుకుంటు న్నానని, అందుకు తన బ్యాటింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉం టుందన్నాడు.

01/13/2020 - 04:26

మెల్‌బోర్న్, జనవరి 12: బిగ్ భాష్ లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ మార్కస్ స్టొయనిస్ (79 బంతుల్లో 147, నాటౌట్) సెంచరీకి తోడు హిల్టన్ కార్ట్‌వైట్ (59) అర్ధ సెంచరీ సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది.

01/13/2020 - 04:24

ముంబయ, జనవరి 12: ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా ఆదివారం తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, మేనేజ్‌మెంట్ మరో 14 మందితో కూడిన జట్టును ప్రకటించిం ది. జట్టులో అంతా దాదాపు ఆడినవారే ఉండగా, రిచా ఘోష్ కొత్తముఖం. ఇటీవల జరిగిన వుమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో రిచా అద్భుతంగా రాణించడంతో ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కింది.

01/13/2020 - 04:22

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ఏఎస్‌బీ క్లాస్‌క్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో అమెరికాకే చెందిన జెస్సికా పెగులాపై విజయం సాధించిన అమెరికా క్రీడాకారిణి సెరీనా విలియమ్స్. అనంతరం ట్రోఫీతో పాటు తన కూతురు అలెక్సిక్ ఒలింపియా ఓహానియన్ జూనియర్‌తో సెరీనా ఇలా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

01/13/2020 - 04:20

ఒంగోలు, జనవరి 12: రంజీట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఆర్ జ్ఞానేశ్వర్ అర్ధ సెంచరీ, ప్రశాంత్ కుమార్ సెంచరీ సాధించడంతో ఆంధ్రా జట్టుకు 12 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్ నైట్ స్కోర్ 13 పరుగులతో రెండో రోజు ఆదివారం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా ఓపెనర్లు చూడచక్కని షాట్లతో రాణించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు.

01/13/2020 - 04:16

'చిత్రం... బ్రిస్బేన్స్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో అమెరికాకు చెందిన మెడిసన్ కీస్‌పై 6-4, 4-6, 7-5 తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా.

01/12/2020 - 06:01

పుణె: ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాను సరికొత్త సమస్య వెంటాడుతోంది. అవకాశం వచ్చిన ఆటగాళ్లంతా తమను తాము నిరూపిం చుకోవడంతో జట్టు కూర్పు కష్టతంగా మా రింది. దీంతో ప్రపంచకప్‌కు ఎవరినీ ఎంపిక చేయాలో తెలియక జట్టు మేనేజ్‌మెంట్ సత మతమవుతోంది.

01/12/2020 - 05:57

ముంబయి వాంఖడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా కసరత్తులు చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్లు. ఈ నెల 14 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వనే్డల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే.

01/12/2020 - 05:56

దుబాయ, జనవరి 11: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకు లను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 760 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగు పరుచుకొని 683 పాయింట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Pages