S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/14/2018 - 00:01

న్యూఢిల్లీ, జూలై 13: సెర్బియాలో జరుగుతున్న 36వ గోల్డెన్ గ్లోవ్ ఆఫ్ వోజ్వోదినా యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ రెండు పతకాలు సాధించడం ఖాయమని భారత బాక్సర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 56 కేజీల విభాగంలో ఆకాష్ కుమార్, 69 కేజీల విభాగంలో లలిత ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

07/14/2018 - 00:00

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూలై 13: ‘మా వరకూ సాకర్ సమరం ముగిసింది. థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ ఆడాలని ఏ జట్టూ కోరుకోదు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో దిగుతున్నాం’ అన్నాడు ఇంగ్లాండ్ మేనేజర్ గెరెత్ సౌత్‌గేట్. సెమీ ఫైనల్స్‌లో క్రొయేషియా చేతిలో ఓడిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైన బెల్జియంతో శనివారం ప్లే-ఆఫ్ ఆడబోతోంది.

07/13/2018 - 23:57

న్యూఢిల్లీ, జూలై 13: ‘ఇది నా చిరకాల వాంఛ. దాన్ని సాకారం చేసుకున్నా’ అంటూ అథ్లెట్‌గా తాను సాధించిన విజయాన్ని హిమదాస్ అభివర్ణించింది. అసోంలోని మారుమూల గ్రామానికి చెందిన తాను ఫుట్‌బాలర్‌గా కెరీర్ ప్రారంభించటం, తొలి భారత మహిళగా ప్రపంచ చాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించటం అన్నది తన క్రీడా ప్రయాణంలో ఓ చిరస్మరణీయమైన అంశమని స్పష్టం చేసింది.

07/13/2018 - 23:55

జగ్రెట్, జూలై 13: పసికూనగా ప్రపంచకప్ బరిలోకి దిగి కసికూనగా ఫైనల్‌లో ఫ్రాన్స్‌తో కలపడబోతున్న జట్టును చూసి క్రొయేషియన్లు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని నుంచి సాధారణ పౌరుడి వరకూ ఆటగాళ్ల మాదిరి జర్సీలు ధరించి, తామే ఆటగాళ్లమన్నట్టు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

07/13/2018 - 23:53

మాస్కో, జూలై 13: ఇదే ‘బెస్ట్ వరల్డ్ కప్’ అంటూ ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటినో ఆనందం వ్యక్తం చేశాడు. ‘సాకర్ పోరుకు వేదికలిచ్చిన రష్యన్లకు కృతజ్ఞతలు. పోరు సాఫీగా సాగేందుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. మ్యాచ్‌లు చూడ్డానికి రావడమే కాదు, వచ్చి వాలంటీరిజం ప్రదర్శించిన ప్రపంచ అభిమానులకు నమస్కారాలు’ అంటూ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేశాడు.

07/13/2018 - 16:58

న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్ ప్రపంచ కప్ అండర్-20 విభాగంలో 400 మీటర్ల ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెటిక్ హిమాదాస్‌ను ప్రధాని మోదీ అభినందించారు. 400 మీటర్ల విభాగంలో అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన హిమాదాస్ ప్రపంచస్థాయి పోటీల్లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా రికార్డులకు ఎక్కింది.

07/13/2018 - 03:52

మాస్కో :వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఈసారి ఫైనల్ చేరే అవకాశం ఉన్న ఇంగ్లాండ్‌ను క్రొయేషియా సెమీ ఫైనల్‌లో ఓడించడం ఒక అద్భుతంగా కనిపించింది. చివరి క్షణాల్లో మారియో మాడ్జుకిక్ చేసిన గోల్ క్రొయేషియాను తుది పోరుకు చేర్చింది. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకూ ఇరు జట్లు గొప్పగా పోరాటం సాగించాయి. అయితే, ఇంగ్లాండ్ అవసరాన్ని మించిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, పరాజయాన్ని మూటగట్టుకుంది.

07/12/2018 - 23:33

లండన్, జూలై 12: ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్‌లో ఎవరూ ఊహించని విధంగా క్రొయేషియా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్రీడాకారులకు అభిమానులు జేజేలు పలుకుతున్నారు. వరల్డ్ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ, అసాధారణ ప్రతిభ కనబరచి సెమీ ఫైనల్ వరకూ చేరడమే అద్భుతమని ప్రశంసిస్తున్నారు.

07/12/2018 - 23:30

క్రొయేషియా చేతిలో ఓటమిపాలై, వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్ నుంచి వెనుదిరిగామన్న బాధలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు

07/12/2018 - 23:28

మాస్కో, జూలై 12: ఫిపా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఫార్వార్డ్ క్రొయేషియా ఆటగాడు మారియో మాడ్జుకిక్ రాత్రికి రాత్రే ఒక్కసారే హీరో అయిపోయాడు. ఇక క్రొయేషియా జట్టు విషయానికి వస్తే...నాలుగు మిలియన్లు (దాదాపు 40 లక్షలు) జనాభా కలిగిన ఈ చిన్నదేశం తొలిసారిగా ప్రపంచ కప్ చరిత్రలో ఫైనల్‌కు చేరుకుంది.

Pages