S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/12/2018 - 01:07

లండన్, జూలై 11: టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10వేల పరుగుల క్లబ్‌లో చోటు దక్కించుకోనున్నాడు. టీమిండియాలో సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఈ ఘనతను దక్కించుకున్నారు. ధోనీ మరో 33 పరుగులు చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పదివేల పరుగుల క్లబ్‌లో చేరిన 12వ క్రికెటర్‌గా ఘనత సాధిస్తాడు.

07/11/2018 - 02:40

రెపినో: సెమీస్ ఉత్కంఠ క్షణాల కోసం లండన్‌వాసులు లక్ష కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ పోరులో 28 ఏళ్ల క్రితంనాటి అద్భుత క్షణాలు అందిపుచ్చుకోడానికి జాతీయ జట్టు సైతం ఉర్రూతలూగుతోంది. సాకర్ పోరులో 28 ఏళ్ల తరువాత సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్, ప్రత్యర్థి జట్టు క్రొయేషియాను కేక పెట్టించేందుకు వ్యూహాలు పన్నుతోంది.

07/11/2018 - 00:26

లండన్, జూలై 10: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సెంటర్ కోర్టు, సెంటర్ కోర్టు-1లలో జరిగిన నాలుగు మ్యాచ్‌లలో అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సహా నలుగురు విజయం సాధించారు. సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి కామిలా జియోర్జీ ఆడిన తొలి రౌండ్‌లో (3-6) నిరాశపరిచినా, రెండు, మూడు రౌండ్లలో (6-3, 6-4) విజయం సాధించింది.

07/11/2018 - 00:25

సిడ్నీ, జూలై 10: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్, పరుగుల వీరుడు కోహ్లీ బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి, అతను ఎట్టి పరిస్థితుల్లో సెంచరీ కానివ్వమని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ పాట్ కుమిన్స్ జోస్యం చెప్పాడు. భారత్- ఆస్ట్రేలియల మధ్య జరుగనున్న టెస్టు మ్యాచ్ సిరీస్‌లో జరిగే మ్యాచ్‌లు ఎంతో కీలకమన్నాడు.

07/11/2018 - 00:24

నెరుల్లా నొట్టింగమ్, జూలై 10: ఇంగ్లాండ్‌తో జరగనున్న వనే్డ సీరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండాలంటే, జట్టు సారథి విరాట్ కోహ్లీ ఫోర్త్ ప్లేయర్‌గా దిగాలని మాజీ స్కిప్పర్ సౌరవ్ గంగూలీ సలహా ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి కోహ్లీ ఫోర్త్ ప్లేస్‌లో దిగడమే కారణమన్నాడు. 2017 జూలై- ఆగస్టుల్లో శ్రీలంక టూర్ మొదలైన దగ్గర్నుంచీ టీమిండియా ప్రయోగాలు చేస్తోంది.

07/11/2018 - 00:23

లండన్, జూలై 10: ఉత్తర ఇంగ్లాండ్ షెఫీల్డ్ ఇళ్లపై ఇంగ్లాండ్ జాతీయ జెండాలు వందలాదిగా రెపరెపలాడుతున్నాయ. క్రొయేషియాను ఎదుర్కోబోతున్న ఇంగ్లాండ్ జట్టులోని కిలె వాకర్, హ్యారీ మాగురీ, జామి వర్డీలు పుట్టిపెరిగింది ఇక్కడే. అందుకే ఇంగ్లాండ్ విజయం కోసం తహతహలాడుతూ అభిమానులు ఇలా ఇళ్లపై జెండాలను ఆవిష్కరింపచేశారు. అవునుమరి, లండన్‌వాసులు ఒక్క విజయం కోసం తహతహలాడుతున్నారు.

07/11/2018 - 00:21

దుబాయ్, జూలై 10: ఇంగ్లాండ్‌లో 70 రోజులపాటు పర్యటనకు దిగిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో టాప్ ర్యాంక్ చేజిక్కించుకునేందుకు తహతహలాడుతోంది. ఇప్పటికే ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ-20లను కైవసం చేసుకోడమే కాకుండా ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెల్చుకుని మంచి ఊపుమీద ఉంది.

07/11/2018 - 00:07

అమృత్‌సర్, జూలై 10: నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్లతో పంజాబ్ పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాను దక్కించుకున్న భారత టీ-20 మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఉద్యోగం కోల్పోయింది. మహిళా క్రికెట్‌లో ఆమె రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి 8.66 సరాసరిన 26 పరుగులు చేసింది. అయితే, 87 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 35.41 సరాసరిన 2196 పరుగులు చేసింది. వీటిలో మూడు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

07/10/2018 - 16:46

చండీగఢ్: టీమిండియా మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీతిని డిఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి తగ్గించారు. నకిలీ సర్ట్ఫికెట్లతో డీఎస్పీ ఉద్యోగాన్ని పొందినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. గత ప్రపంచ కప్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన హర్మన్‌కు పంజాబ్ ప్రభుత్వం డిఎస్పీ పదవి ఇచ్చిన విషయం విదితమే. ఉద్యోగం కోసం ఆమె సమర్పించిన సర్ట్ఫికెట్లు నకిలీవని తేలటంతో ఆమెను డిఎస్పీ పదవి నుంచి తప్పించారు.

07/10/2018 - 02:19

సెయింట్ పీటర్స్‌బర్గ్: కళ్లముందు గెలుపు కనిపిస్తున్నా, మనసు మూలల్లో తలత్తే చిన్న సందేహం చాలు కొంపముంచడానికి. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ను అప్రతిహతంగా నడిపిస్తున్న కోచ్ డిడెర్ డెస్‌చాంప్స్‌ను వెంటాడుతున్న చిరు సందేహమే -ఎడెన్. ప్రపంచకప్ కలకు సెమీస్ దూరంలో ఉంది ఫ్రాన్స్. సరిగ్గా ఇక్కడే పెద్ద ‘హజార్డ్’ను ఎదుర్కోబోతోంది. అతనే బెల్జియం ఫార్వార్డ్ ఎడెన్ హజార్డ్.

Pages