S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/28/2018 - 23:45

మలహైడ్ (ఐర్లాండ్), జూన్ 28: ఐర్లాండ్ పర్యటనను విజయవంతంగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. తనకు స్వదేశ టూర్‌లో ఆడిన అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ-20 తొలి మ్యాచ్ విజయంలో కుల్దీప్‌యాదవ్ కీలక పాత్ర వహించాడు. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

06/28/2018 - 23:43

కౌలాలంపూర్, జూన్ 28: మలేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ గురువారం జరిగిన స్ట్రయిట్ గేమ్స్ గెలుపుతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేత సింధు మహిళల సింగిల్స్‌లో తన ప్రత్యర్థి, మలేషియాకు చెందిన ఇంగ్ ఇంగ్ లీని 21-8, 21-14 తేడాతో ఓడించింది.

06/28/2018 - 01:41

కజన్, జూన్ 27: గ్రూప్-ఎఫ్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడిన జర్మనీ ఒక్క గోల్ కూడా చేయలేక చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. తొలుత మెక్సికో చేతిలో దెబ్బతిన్న జర్మనీ, తరువాతి మ్యాచ్‌లో స్వీడన్‌ను మట్టికరిపించి అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది.

06/28/2018 - 01:26

న్యూఢిల్లీ, జూన్ 27: టీనేజ్ సంచలనం, ప్రఖ్యాత షూటర్ మనూభాకర్ మరోసారి వరల్డ్ రికార్డు సృష్టించింది. జర్మనీలోని సుహ్ల్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 16 ఏళ్ల మనూ మహిళల జూనియర్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 24 షాట్లతో 242.5 స్కోరుతో గోల్డ్ మెడల్ అందుకుంది.

06/28/2018 - 01:56

బ్రెడ (నెదర్లాండ్స్), జూన్ 27: అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత హాకీ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో బుధవారం ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో అలుపెరుగని పోరు సలిపిన భారత్, చివరకు 2-3తో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

06/28/2018 - 01:24

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 27: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సంచలనాలకు తెరలేపుతున్నాయి. ఫేవరేట్ జట్లను పసికూనలు ముప్పుతిప్పలు పెడుతుంటే, పెద్ద జట్లలో పిక్కలు పండిన ఆటగాళ్లు సైతం విలవిల్లాడుతున్నారు. గ్రూప్-డిలో అర్జెంటీనా అలాంటి పరిస్థితినే ఎదుర్కొని, కనాకష్టంగా నాకౌట్‌కు గట్టెక్కింది.

06/28/2018 - 01:43

డబ్లిన్, జూన్ 27: ఐర్లాండ్‌తో ప్రారంభమైన రెండు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 76 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అందుకు ధీటుగా ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు.

06/27/2018 - 03:41

మాస్కో/ సోచి, జూన్ 26: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-సిలో ఫైనల్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా ముగిశాయి.
గ్రూప్‌లో అగ్రస్థానం కోసం సెయంట్ పీటర్స్‌బర్గ్ మైదానంలో ఉత్కంఠ పోరుకు ఫ్రాన్స్- డెన్మార్క్‌లు తెరలేపాయ. పట్టుకోసం పరస్పరం చేసిన విశ్వప్రయత్నాలు ఫలించకపోవడంతో సున్నా గోల్స్‌తో మ్యాచ్ ముగించాయి.
ఈ ప్రపంచకప్‌లో ఒక్క గోల్ లేకుండా (0-0) మ్యాచ్ ముగియడం ఇదే తొలిసారి.

06/27/2018 - 03:43

లండన్, జూన్ 26: టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్ర్తీని అర్జున్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో కలుసుకున్నాడు. వచ్చే నెలలో భారత్-ఏ టీమ్ తరఫున శ్రీలంకలో నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు, ఐదు వనే్డ మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో ఆటలో మరిన్ని మెళకువలు నేర్చుకోడానికి రవిశాస్ర్తీని కలిసినట్టు బీసీసీఐ వెల్లడించింది. అర్జున్ తన ఆట మరింత పదునుదేరేందుకు అవసరమైన కీలక విషయాలను రవిశాస్ర్తీ నుంచి తెలుకునేందుకు ఉత్సాహం చూపాడట.

06/27/2018 - 03:24

కిలినిన్‌గ్రాడ్, జూన్ 26: ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో వివిధ దేశాల జట్లు హోరాహోరీ తలపడుతున్నాయి. తుది 16 జట్లలో స్థానం కోసం చెమడోడ్చి పోరాడుతున్నాయి. సోమవారం అర్థరాత్రి జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌ల్లో ఇరాన్- పోర్చుగల్, స్పెయిన్- మొరాకో జట్లు తుది 16 జట్లలో స్థానం కోసం పోటీపడ్డాయి. ఇరాన్ -పోర్చుగల్ (1-1), స్పెయిన్ -మొరాకో (2-2) మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Pages