S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/27/2018 - 03:22

బ్రెడా (నెదర్లాండ్స్), జూన్ 26: ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయంచేందుకు భారత హాకీ జట్టు తహతహలాడుతోంది. ఇప్పటికే ఈ పోటీల్లో భాగంగా భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 4-0తో ఓడించి ఘన విజయం సాధించింది.

06/27/2018 - 03:21

డబ్లిన్, జూన్ 26: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు బుధవారం నుంచి ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ-20 మ్యాచ్‌లలో తలపడనుంది. ఇందులో గెలుపు ద్వారా వచ్చేనెల 12 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ విజయగర్వంతో స్వదేశానికి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా శనివారంనాడే టీమిండియా జట్టు ఇంగ్లాండ్ చేరుకుని మంగళవారం వరకు ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేసింది.

06/27/2018 - 03:20

హోచిమిన్ సిటీ, జూన్ 26: ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్‌కప్ ఫీవర్ నడుస్తోంది. వివిధ దేశాల నుంచి మైదానంలోకి దిగిన ఆటగాళ్లు తమ ఆటలో కళాత్మక రీతిని ప్రదర్శిస్తుంటే.. మైదానం వెలుపలున్న అభిమానులు తమ సృజనాత్మక కళలో ఆటను ప్రదర్శిస్తున్నారు. అలా, సృజనాత్మక కళలో ఆరితేరిన 67ఏళ్ల న్గుయెన్ తన్హ్ టామ్ ప్రదర్శిస్తోన్న కళాత్మక ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

06/27/2018 - 03:17

గౌహతి, జూన్ 26: జకార్తాలో త్వరలో నిర్వహించే ఆసియా గేమ్స్‌లో మరిన్ని పతకాలు కైవసం చేసుకుంటామని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అడిల్లె సుమరివాల్లా తెలిపాడు. 2014 ఆసియా గేమ్స్‌లో సాధించిన పతకాల కంటే ఎక్కువ పతకాలు రానున్న ఆసియా గేమ్స్‌లో గెలుపొందుతామనే గట్టి నమ్మకం తమకు ఉందని ఆయన పేర్కొన్నాడు.

06/27/2018 - 03:17

న్యూఢిల్లీ, జూన్ 26: జర్మనీలోని సుహ్ల్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత్ షూటర్, 16 ఏళ్ల సౌరభ్ చౌదరి సరికొత్త రికార్డు సృష్టించాడు. మంగళవారం ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ టోర్నీలో భాగంగా 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 24 షాట్స్‌లో 243.7 స్కోరుతో సౌరభ్ గోల్డ్‌మెడల్ అందుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

06/26/2018 - 05:09

ప్రపంచకప్ మ్యాచుల్లో రాడమిల్ ఫాల్కో ప్రావీణ్యం మాటల్లో ఎంతచెప్పినా తక్కువే. పోలాండ్‌పై విజయంలో అతనే కీలకం. ఆ రాత్రి ఆనందంతో నిద్రపట్టలేదు. కొలంబియన్ ఫుట్‌బాల్ సింబల్ ఫాల్కో. వచ్చే మ్యాచుల్లో అతని ఆట పదునును మరింతగా చవిచూస్తాం.
కొలంబియన్ కోచ్ జోస్ పెకెర్‌మన్

06/26/2018 - 05:07

తొలి ప్రపంచకప్‌లో నా తొలి గోల్ వృధా అయిందన్న బాధ వెంటాడుతోంది. అద్భుతమైన గోల్‌గా పరిగణించినా, ఎక్కడో చిన్న అసంతృప్తి. నిజానికి ఆ మ్యాచ్ మేం గెలవాల్సింది. వైఫల్యం నుంచి తేరుకుని మ్యాచ్‌ను డ్రా చేశాం. గెలవలేకపోయామన్న నిరాశ వెంటాడుతోంది.
సెనెగల్ స్ట్రయికర్ సాడియో మనె

06/26/2018 - 05:05

అరెనా (రష్యా), జూన్ 25: రాడెమెల్ ఫాల్కో.. యెర్రీ మినా.. జాన్ కాడ్రాడో.. నాకౌట్‌లో చోటు దక్కించుకోవాలని ఉబలాటపడుతున్న కొలంబియా ఆశలను సజీవం చేశారు. ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ హెచ్‌లో భాగంగా ఆదివారం రాత్రి అరెనా స్టేడియంలో పోలాండ్‌తో తలపడిన కొలంబియన్లు అద్భుత ఆటతీరు ప్రదర్శించి 3-0 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. తుది 16 జట్లలో స్థానానికి మార్గం సజీవం చేసుకున్నారు.

06/26/2018 - 04:54

మాస్కో, జూన్ 25: ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం రాత్రి గ్రూప్-ఏలో సౌదీ అరేబియా- ఈజిప్టు జట్ల మధ్య ఉత్కంఠ పోరులో సౌదీ 2-1 తేడాతో విజయం సాధించింది. 22వ నిమిషంలో ఈజిప్టు సూపర్‌స్టార్ మహమ్మద్ సలా తొలి గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. సలా ఈ టోర్నీలో ఈజిప్టు తరఫున రెండు గోల్స్ చేసిన ఘనత సాధించాడు.

06/26/2018 - 04:51

సాల్ట్ లేక్ సిటీ (యూఎస్‌ఏ), జూన్ 25: మహిళల సింగిల్స్ రికర్వ్ ప్రపంచ కప్ ఈవెంట్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. సోమవారం వరల్డ్ కప్ స్టేజి-3 విభాగంలో ఇక్కడ జరిగిన పోటీలో తన ప్రత్యర్థి, జర్మనీకి చెందిన మిచెల్లీ క్రూపెన్‌ను ఆమె 7-3తో ఓడించింది. ఈ గెలుపుతో దీపిక ఈ ఏడాది అక్టోబర్‌లో టర్నీలోని శాంసన్‌లో నిర్వహించే ప్రపంచ కప్ ఫైనల్ పోటీలకు అర్హత సాధించింది.

Pages