S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/26/2018 - 04:50

దుబాయ్, జూన్ 25: ఈ ఏడాది నవంబర్ 9వ తేదీ నుంచి 24 వరకు వెస్టిండీస్‌లో ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20 నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ఇక్కడ ప్రకటించింది. మొత్తం 10 జట్లు 23 మ్యాచ్‌లలో పోటీపడే ఈ టోర్నమెంట్‌లో భారత తొలి మ్యాచ్‌లో 9న న్యూజిలాండ్‌తో తలపడనుంది. రెండో మ్యాచ్‌లో 11 చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడుతుంది.

06/26/2018 - 04:48

కరాచీ, జూన్ 25: పాకిస్తాన్ క్రికెట్ జట్టు బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు నోటీసు జారీ చేసింది. 2015 వరల్డ్ కప్ సందర్భంగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్‌పై ఇంతవరకు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించింది. ఈమేరకు ఈనెల 27న ఏసీయూ ట్రిబ్యునల్ ఎదుట హాజరై తగిన వివరణ ఇవ్వాలని సూచించింది.

06/26/2018 - 04:47

దుబాయ్, జూన్ 25: వచ్చే ఏడాది కూడా దుబాయ్ కబడ్డీ వరల్డ్ కప్‌కు ఆతిధ్యమిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 29న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ సమావేశం కానుంది. ఫెడరేషన్ ప్రెసిడెంట్ జనార్దన్ సింగ్ గెహ్లాట్ పీటీఐతో మాట్లాడుతూ కబడ్డీ వరల్డ్ కప్ నాలుగో ఎడిషన్ దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటున్నామని, తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నాడు.

06/26/2018 - 05:04

మాస్కో, జూన్ 25: ఫిఫా ప్రపంచకప్ ఆతిధ్య దేశం రష్యాకు అదిరిపోయే షాక్ తగిలింది. అనూహ్య విజయాలతో అలుపెరుగని పరుగు తీస్తున్న రష్యా వేగానికి ఉరుగ్వే సడెన్ బ్రేక్ వేసింది. గ్రూప్ మ్యాచ్‌ల్లో రష్యా తొలిసారి ఘోర పరాజయం చవిచూడక తప్పలేదు. ప్రథమార్థం నుంచే ఉరుగ్వే ఆటగాళ్లు మైదానంలో చెలరేగిపోయారు.

06/25/2018 - 05:14

కెప్టెన్ హ్యారీ కేన్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిపోయాడు. ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటి వరకూ అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. అంతేకాదు, 1986 ప్రపంచకప్ పోరులో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన గ్యారీ లినేకర్ రికార్డును హ్యారీ కేన్ సమం చేశాడు.
*

06/25/2018 - 05:12

డొమెస్టిక్ లీగ్‌ల నుంచీ ఆటను ఎలా పదునెక్కించాలన్న విషయం మేం సీరియస్‌గానే ఆలోచించాలి. జట్టులో అంతా కుర్ర ఆటగాళ్లే. రాత్రికి రాత్రి వాళ్ల అనుభవాన్ని ఆకాశమంత పెంచలేం. ఇప్పుడు ఆడుతున్న మ్యాచ్‌లు
మా అనుభవాన్ని పెంచేవిగానే భావిస్తాం.
దక్షిణ కొరియా కోచ్ టో-యాంగ్

06/25/2018 - 05:11

ఆటలో పొరబాట్లు తప్పవు. నిగ్రహంతో వాటిని ఎదుర్కొని విజయం సాధించేవాడే నిజమైన ఆటగాడు. స్వీడన్‌తో మ్యాచ్‌లో జర్మనీ అదే నిరూపించింది. మా పొరబాటును ప్రత్యర్థి అవకాశంగా మలచుకున్నట్టే.. వాళ్లూ మాకు అవకాశమిచ్చారు. క్రూస్ దాన్ని గోల్ చేశాడు.
జర్మనీ కోచ్ జోచిమ్ ల్యూ

06/25/2018 - 05:09

బెర్లిన్, జూన్ 24: ఘోర పరాభవంతో ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి నుంచి జర్మనీ గట్టెక్కడంతో బెర్లిన్‌లో అభిమానులు వానానందం పొందారు. అదృష్టం క్రూస్ రూపంలో కలిసొచ్చి స్వీడన్‌పై విజయం సాధించటంతో అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వర్షంలో ఆనందతాండవం చేశారు. బ్రాండ్‌బెర్గ్ గేట్‌వద్ద ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్ చూస్తున్న అభిమానులు తొలుత నిరుత్సాహంలో ఉండిపోయాడు.

06/25/2018 - 05:07

సోచి, జూన్ 24: ‘జర్మనీ నిష్క్రమణను బలంగా కోరుకుంటున్న వారికి నేనిచ్చిన సమాధానమిది’ అంటూ టోని క్రూస్ వ్యాఖ్యానించాడు. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం ఏఆర్డీ బ్రాడ్‌కాస్టర్ వద్ద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ మాజీ ఆటగాళ్లు, ఫుట్‌బాల్ పండితులు చాలామందే జర్మనీ నిష్క్రమణను బలంగా కోరుకున్నారు.

06/25/2018 - 05:05

సోచి, జూన్ 24: ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్షేత్రంలోకి హాట్ ఫేవరేట్‌గా దిగిన జర్మనీ గ్రూప్ మ్యాచ్‌ల నుంచే ఇంటికెళ్లిపోయేదా? 1938 తరువాత ఏ ప్రపంచకప్‌లోనూ ఫస్ట్‌రౌండ్ నుంచే ఇంటికెళ్లే పరిస్థితి కొనితెచ్చుకోని జర్మనీ, ఈసారి వెళ్లిపోయి ఉండేదా? కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే క్రూస్‌లాంటి ఆటగాడు లేకపోయివుంటే, జర్మనీ అంతటి పరాభవాన్నీ చవిచూసేదేమో.

Pages