S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/24/2018 - 06:39

మొనాకో, జూన్ 23: తనకు 50 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆడతానని ప్రముఖ టెన్నిస్ స్టార్, సెర్బియా ప్రొఫెషనల్ ఆటగాడు నవోక్ జొకోవిచ్ అన్నాడు. తాజాగా క్వీన్స్ క్లబ్ సెమీ ఫైనల్స్‌లో 8-5, 6-1తో ఆడ్రియన్ మన్నారినోపై గెలుపొందడం ద్వారా 800 మ్యాచ్‌లలో ఘనవిజయాలు సాధించిన 10వ ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

06/23/2018 - 01:46

సెయింట్ పీటర్స్‌బర్గ్: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ బ్రెజిల్ అత్యంత కష్టం మీద విజయం సాధించి, ముందంజ వేసింది. ఐదుసార్లు ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న బ్రెజిల్ నాకౌట్ దశకు చేరుకునే అవకాశాన్ని ఫిలిపె కౌటిన్హో, నేమార్ కల్పించారు. ఇంజురీ టైమ్‌లో వీరు చేసిన గోల్స్ బ్రెజిల్‌ను గట్టెక్కించాయి.

06/23/2018 - 00:50

చిత్రం: బ్రెజిల్ నెగ్గింది. కాదు, విజయం అనివార్యం కావడంతో కోస్టారికాను ఓడించింది. ఐదుసార్లు ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న బ్రెజిల్‌కు ఈ వరల్డ్ కప్‌లో ఆట నల్లేరుపై నడక కాలేదు. నాకౌట్ దశకు చేరుకోడానికే నానా యాతన పడిన జట్టును ఫిలిపె కౌటిన్హో, నేమార్‌లు ఆదుకున్నారు.

06/23/2018 - 00:51

నోవ్‌గోరోడ్, జూన్ 22: అర్జెంటీనా అసలు ప్రతాపాలు అడుగంటాయా? స్టార్ ఆటగాడు మెస్సీమీద ఆశలు మసకబారుతున్నాయా? ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న అర్జెంటీనా కలలకు నిజ్ని నోవ్‌గోరోడ్ మైదానంలో క్రొయేషియా ఆటగాళ్లు ఉరేసేశారా? చాంపియన్స్ కావాలన్న కోటి ఆశలతో ప్రపంచ కప్ యుద్ధ్భూమిలోకి అడుగుపెట్టిన అర్జెంటీనా, తుది 16లో చోటు దక్కించుకోవడమే గగనమన్న దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోందా?

06/23/2018 - 00:52

దుబాయ్, జూన్ 22: కబడ్డీ మాస్టర్స్ చాంపియన్‌షిప్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్ అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాక్ జట్టును మట్టిగరిపించి అప్రతిహతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. దుబాయి వేదికగా శుక్రవారం మొదలైన కబడ్డీ మాస్టర్స్ చాంపియన్‌షిప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ -పాక్ జట్లు తలపడ్డాయి.

06/23/2018 - 00:55

న్యూఢిల్లీ, జూన్ 22: తన ఫిట్‌నెస్ మీద ఎలాంటి సందేహాలు అక్కర్లేదని భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘నేను 90 శాతం మాత్రమే ఫిట్‌నెస్‌తో ఉండివుంటే, ఇంగ్లాండ్ సిరీస్‌కు వెళ్లేవాడినే కాదు. ఇప్పుడు 110 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు’ అని ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశాడు.

06/22/2018 - 23:59

న్యూఢిల్లీ, జూన్ 22: వనే్డ క్రికెట్‌లో రెండు కొత్త బంతులు వినియోగించడం క్రికెట్ వినాశనానికి దారి తీస్తుందని భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘రెండు బంతుల వినియోగం వల్ల బంతి పాతబడటానికి సమయం పడుతుంది. దీనివల్ల డెత్ ఓవర్లలో రివర్స్ స్వింగ్ అనేదే చూడలేకపోతున్నాం’ అంటూ సచిన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. దీనిపై కోహ్లి స్పందిస్తూ ‘్ఫచ్ ఫ్లాట్‌గా ఉంటే ఈ పరిణామం మరీ దారుణం.

06/22/2018 - 01:29

మాస్కో: ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరిట్‌గా బరిలోకి దిగిన డెన్మార్క్‌కు నిరాశ ఎదురైంది. గురువారం ఇక్కడి సమర స్టేడియంలో గ్రూప్-సీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ను డెన్మార్క్ 1-1తో డ్రా అయంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా నాకౌట్‌కు వెళ్లాలని భావించిన డెన్మార్క్‌కు ప్రత్యర్థి జట్టు తీవ్ర ప్రతిఘటన ఇచ్చింది.

06/22/2018 - 01:12

మాస్కో, జూన్ 21: మాస్కోలోని ఓ అందమైన పార్క్. ఆహ్లాదకరమైన మిట్టమధ్యాహ్నం. పార్కులో కూర్చున్న అర్జెంటీనా జట్టు అభిమాని అగస్టీన్ ఓటెలో మాత్రం ఓ బెంచ్‌మీద కూర్చుని ఉన్నాడు. వాస్తవ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఏవేవో లెక్కలు వేసుకుంటున్నాడు. సహజంగానే పార్కులో అటూ ఇటూ తిరుగుతున్న వాళ్లంతా వరల్డ్ కప్‌లో అభిమాన దేశం ఎన్ని గోల్స్ వేసిందో లెక్కలేసుకుంటున్నాడని అనుకుంటున్నారు.

06/22/2018 - 01:27

మాస్కో, జూన్ 21: సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం రాత్రి గ్రూప్-సీలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఫ్రాన్స్, పెరూ జట్లు తలపడగా ఫ్రాన్స్ 1-0తో గెలుపొంది నాకౌట్‌లో చోటుదక్కించుకుంది. ఆట ప్రారంభం నుంచే ఇరు జట్లు భీకరంగా తలపడినప్పటికీ అరగంట వరకూ ఎవరూ గోల్ చేయలేకపోయారు. ఇరు జట్లూ బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని విశ్వప్రయత్నం చేసినప్పటికీ వారి ఆశలు నెరవేరలేదు.

Pages