S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/20/2018 - 01:01

సర్నాస్క్: బ్లూ సమురాయ్ వీరులు కసితీర్చుకున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా కొలంబియాను వెంటాడి వెంటాడి మట్టికరిపించారు. దీంతో ఫిఫా ప్రపంచ కప్ 2018లో ఆసియా జట్టు జపాన్ శుభారంభం చేసినట్టయ్యింది. గ్రూప్-హెచ్‌లో దక్షిణ అమెరికా జట్టు కొలంబియాను ముప్పుతిప్పలు పెట్టి 2-1 స్కోరుతో జపాన్ ఆధిక్యతను నిలుపుకుంది.

06/20/2018 - 00:37

మాస్కో, జూన్ 19: ఫిఫా వరల్డ్ కప్ 2018 చరిత్రలో తొలిసారిగా గెలిచిన ఆఫ్రికా దేశంగా సెనెగెల్ ఘనత సాధించింది. మంగళవారం ఇక్కడి స్పార్టాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పోలాండ్‌ను 2-1 తేడాతో ఓడించింది. గ్రూప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలాండ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై గెలుపు కోసం దాడులకు తెగబడింది. అయితే సెనెగెల్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది.

06/20/2018 - 00:36

రోస్టోవ్-ఆన్-డాన్, జూన్ 19: రష్యాలో అట్టహాసంగా సాగుతోన్న సాకర్ సంరంభంలో సోమవారం అర్థరాత్రి చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. వరల్డ్ కప్‌కు ఆతిధ్యమిస్తున్న రష్యాలో మ్యాచ్‌ల కోసం సుదూర ప్రాంతాల్లో మైదానాలు ఏర్పాటు చేశారు. ఒకచోట మ్యాచ్ పూర్తి చేసుకున్న జట్టు మరో మ్యాచ్ కోసం మరో ప్రాంతానికి తరలి వెళ్లక తప్పదు.

06/20/2018 - 00:35

మాడ్రిడ్ (స్పెయిన్), జూన్ 19: మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, డిఫెండర్ గుర్జీత్ కౌర్ అద్భుత ఆటతీరుతో ఇక్కడ స్పెయిన్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో రాణీ సేన సమం చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ జట్టు సభ్యులు సమష్టిగా రాణించి జట్టును విజయపథంలో నిలిపారు.

06/20/2018 - 00:34

న్యూఢిల్లీ, జూన్ 19: క్రికెటర్లకు యో యో టెస్టుల తర్వాతే జట్టులోకి ఎంపిక చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పాలక కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒకసారి జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేసిన తర్వాత యో యో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులో విఫలమైనవారిని తప్పించడంపై ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

06/20/2018 - 00:56

చిత్రం: ఇంగ్లాండ్ నెగ్గింది. ట్సునీషియా ఓడింది. ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-జి క్యాటగిరీలో ట్సునీషియాపై 2-1 ఆధిక్యతతో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. గాయాలతోనే గేమ్‌లోకి ఎంటరైన కెప్టెన్ హ్యారీ కానే రెండు గోల్స్‌తో ఇంగ్లాండ్‌ను ముందుకు నడిపించాడు. ‘గర్వంతో పొంగిపోతున్నాం. మ్యాచ్ చివరి క్షణం వరకూ రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతూనే వచ్చాం.

06/19/2018 - 04:36

మాస్కో: డిఫెండర్ ఆండ్రియాన్ గ్రాన్‌క్విస్ట్ స్వీడన్ కష్టాన్ని సులువు చేశాడు. అలుపెరుగని పోరాటాన్ని ప్రదర్శించిన సౌత్ కొరియా 65వ నిమిషంలో స్వీడన్ ముందు తలొంచక తప్పలేదు. అందివచ్చిన పెనాల్టీ షాట్‌ను సమర్థంగా గోల్ చేసి స్వీడన్ డిఫెండర్ ఆండ్రియాన్ 1-0 ఆధిక్యత సాధించాడు. ప్రథమార్థంలో రెండు జట్లూ వ్యూహాత్మక రీతిలో ఆటను సాగించటంతో, ఎవరికీ గోల్ దక్కలేదు.

06/19/2018 - 01:13

సోచి, జూన్ 18: ఫిఫా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బెల్జియం బోణీ చేసింది. సోమవారం ఇక్కడి ఫిస్ట్ స్టేడియంలో గ్రూప్-జీ మ్యాచ్‌లో ప్రత్యర్థి పనామాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. బెల్జియం స్ట్రయికర్ రొమేలూ లుకాకు 69.75 నిమిషాల్లో రెండు గోల్స్ చేయడంతో బెల్జియం అలవోకగా గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభం నుంచి తొలి అర్ధ్భాగం వరకు ఇరు జట్లు గోల్ చేయడానికి ఎన్నివిధాలుగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి.

06/19/2018 - 01:15

తిరువనంతపురం, జూన్ 18: అభిమానం హద్దులు దాటింది. వీరాభిమానం రష్యాకు దారితీసింది. ఎందుకంటే, అక్కడ వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఉంది. ఆ బంతిని సమర్థంగా తన్నగల మెస్సీ ఉన్నాడు. ఫేవరిట్ స్టార్ ఆటగాడి కోసం సైకిల్‌పై రష్యాకు మహా ప్రయాణమయ్యాడు కేరళకు చెందిన 28ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్లిఫిన్ ఫ్రాన్సిస్. ఇతగాడు అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీకి వీరాభిమాని.

06/19/2018 - 01:17

కోల్‌కతా, జూన్ 18: ఫిఫా వరల్డ్ కప్ -2018లో లియోనాల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నేమర్‌కు ఉన్న క్రేజు తక్కువేంకాదు. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగావున్న పిచ్చి అభిమానుల సంఖ్య కోట్లలోనే ఉంటుందేమో. వివిధ క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు సైతం ఈ సీజన్‌లో సమయం దొరికితే వీళ్ల మ్యాచ్‌లను కళ్లప్పగించి చూడ్డానికే ఇష్టపడతారనడంలో సందేహం లేదు.

Pages