S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/19/2018 - 01:14

మాస్కో, జూన్ 18: డిగో మారడోనాకు కోపం వచ్చింది. ఐస్‌లాండ్‌తో ఆరంభ మ్యాచ్ ఆడిన అర్జెంటీనా ‘డ్రా’ స్థితిలో నిలవడంతో చిరాకు తన్నుకొచ్చింది. ఆ అసహనాన్ని కోచ్ జోర్జ్ శాంపోలి మీద చూపించాడు. ‘జట్టు వ్యూహాన్ని మార్చి అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రతాపాన్ని ప్రదర్శించు. లేదంటే దేశానికి నిన్ను ఆహ్వానించలేను’ అంటూ అర్జెంటీనా మాజీ స్టార్ ప్లేయర్ మారడోనా దాదాపు హెచ్చరిక చేశాడు.

06/19/2018 - 00:56

లీడ్స్, జూన్ 18: ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు యువకులు చెలరేగారు. సోమవారం ఇక్కడ జరిగిన ముక్కోణపు సిరీస్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎలెవెన్ జట్టుపై భారత్ 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

06/19/2018 - 00:55

బెర్లిన్, జూన్ 18: చేవ చచ్చిందా..? పౌరుషం నీరుగారిందా..? ఇంత అవమానమా?.. ఇవీ ఫిఫా వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్‌కు సొంతగడ్డపై ఎదురైన చీత్కారాలు. ఆరంభ మ్యాచ్‌లో ఓటమన్నదే ఎరుగని ఫుట్‌బాల్ వీరుల చరిత్రను తిరగరాస్తూ మెక్సికో బలమైన ఝలక్ ఇవ్వడంతో, జర్మనీ మీడియా పతాక శీర్షికల్లో చూపించిన రుసరుసలివి. మెక్సికో స్టార్ ఆటగాడు హిర్వింగ్ లొజానో గోల్ సాధించటంతోనే జర్మనీ మొత్తం నీరుగారిపోయింది.

06/18/2018 - 04:42

మాస్కో: ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన ఒక మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. లక్షలాదిమంది క్రీడాభిమానులు తమపై పెట్టుకున్న ఆశలను డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ నీరుగార్చింది. ఫలితంగా ప్రత్యర్థి మెక్సికోతో ఆడిన ప్రారంభ మ్యాచ్‌లోనే 1-0 తేడాతో పరాజయం పాలైంది. ఆదివారం ఇక్కడి లుజునికీ స్టేడియంలో జరిగ్ని రెండో మ్యాచ్‌లో గ్రూప్-ఎఫ్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, మెక్సికో జట్లు తలపడ్డాయి.

06/18/2018 - 00:44

క్రటోవో (రష్యా), జూన్ 17: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫుట్‌బాల్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలతో తనను పోల్చవద్దని పోర్చుగల్ స్టార్ ఆటగాడు ఆడ్రిన్ సిల్వా కోరాడు. ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన ప్రథమార్థంలో జరిగిన మ్యాచ్‌లలో మెస్సీ, రొనాల్డో తమ అద్భుత ఆటతీరుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారని అన్నాడు.

06/18/2018 - 00:42

మాస్కో, జూన్ 17: ఫిఫా వరల్డ్ కప్ 2018లో అర్జెంటీనా ఆటగాడు లయనెల్ మెస్సీపై ఆశలు పెట్టుకున్న అభిమానులంతా, ఐస్‌లాండ్‌పై అతని ఆట తీరుచూసి విలవిల్లాడుతున్నారు. నిర్ణయాత్మక పెనాల్టీతో అర్జెంటైనాకు అనితర సాధ్యమైన విజయాన్ని అందించే అవకాశం మెస్సీకి దక్కినా, దూకుడు ప్రదర్శించటంలో ఘోరంగా విఫలమయ్యాడని సోషల్ మీడియాలో అభిమానులు అప్పుడే అసంతృప్తులు వినిపిస్తున్నారు.

06/18/2018 - 00:40

స్టుట్‌గార్డ్(జర్మనీ), జూన్ 17: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఈ ఏడాది రెండోసారి ప్రంపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన మెర్సిడెస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెదరర్ 6-4, 7-6 (7/3) స్కోరు తేడాతో ప్రత్యర్థి కెనడాకు చెందిన మిలోస్ రావ్‌నిక్‌పై విజయం సాధించి ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

06/18/2018 - 00:39

సమర, జూన్ 17: ఫిఫా వరల్డ్ కప్ 2018 గ్రూప్ -ఇ క్యాటగిరీ కింద ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోస్టారికాపై సెర్బియా విజయం సాధించింది. ప్రథమార్థంలో రెండు జట్లూ హోరాహోరీ తలపడినా ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. ద్వితీయార్థంలో 52వ నిమిషంలో సెర్బియా స్టార్ స్ట్రయికర్ అలెగ్జాండర్ కోలరోవ్ సాధించిన గోల్‌తో 1-0 ఆధిక్యాన్ని సాధించి సెర్బియా ఆరంభ మ్యాచ్ విజయాన్ని నమోదు చేసింది.

06/18/2018 - 00:37

గ్రాస్-ఐలెట్ (సెయింట్ లూసియా), జూన్ 17: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు రావడంతో శ్రీలంక జట్టు తొలుత ఆడడానికి నిరాకరించినా, తర్వాత బరిలోకి దిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్లు అలీమ్ డర్, లాన్ గౌల్డ్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత బంతి ఆకారం దెబ్బతిన్నట్టు గమనించి, దానిని మార్చేందుకు నిర్ణయించారు.

06/18/2018 - 00:36

మార్సిల్లీ, జూన్ 17: ఇప్పటికే 11సార్లు వరల్డ్ చాంపియన్‌గా, ఆరుసార్లు ఒలింపిక్ గోల్డ్‌మెడల్స్ సాధించిన అలీసన్ ఫెలిక్స్ తాజాగా మార్సిల్లీలో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో పరుగుల యంత్రం ఉసేన్ బోల్ట్ రికార్డును తిరగరాసింది. అమెరికాకు చెందిన ఈ 32 ఏళ్ల ఫెలిక్స్ యూరోపియన్ చాంపియన్ అయిన ఇటలీకి చెందిన లిబియానా గ్రెనట్, బ్రిటన్‌కు చెందిన డ్రేటన్ షేక్స్‌లను వెనుకకు నెట్టి ఈ ఘనత సాధించింది.

Pages