S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/17/2018 - 01:58

న్యూఢిల్లీ, జూన్ 16: బెంగళూరులో భారత్-అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక చారిత్రాత్మాక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే క్రీడాస్ఫూర్తిపై అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. టెస్టు క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ‘పసికూన’ అఫ్గాన్ రెండో రోజునే ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

06/17/2018 - 01:57

బెంగళూరు, జూన్ 16: వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఇంగ్లాండ్‌తో త్వరలో జరిగే వనే్డ మ్యాచ్‌లో ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ సురేష్ రైనాను చోటు కల్పించింది. అంబటి రాయుడు యో-యో ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన నేపథ్యంలో అతని స్థానే రైనాను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. 31 ఏళ్ల రైనా 223 వనే్డలలో 5,568 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీ-20లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

06/16/2018 - 02:39

బెంగళూరు: గత ఏడాది టెస్టు హోదాను సంపాదించిన అఫ్గానిస్తాన్ మొదటి మ్యాచ్‌లో చిత్తయింది. భారత్‌తో ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో గురువారం టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ‘పసికూన’ అఫ్గాన్ రెండో రోజునే ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఒకే రోజు అఫ్గాన్ రెండు ఇన్నింగ్స్ ముగియడం ఈమ్యాచ్ ఏకపక్షంగా సాగిందనడానికి నిదర్శనం.

06/16/2018 - 01:57

భారత స్పీడ్ స్టార్ ఉమేష్ యాదవ్ టెస్టు క్రికెట్‌లో వంద వికెట్ల మైలురాయని అధిగమించాడు. భారత్ తరఫున టెస్టులో వంద లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న భారత ఫాస్ట్ బౌలర్లలో ఎనిమిదో వాడిగా అతను రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. అఫ్గానిస్తాన్ అరంగేట్రం చేసిన టెస్టు రెండో రోజు ఆటలో అతను రహ్మత్ షా వికెట్‌ను తీసుకోవడం ద్వారా లాంగర్ ఫార్మాట్‌లో వంద వికెట్లను పూర్తి చేశాడు.

06/16/2018 - 01:55

ఎకతెరినబర్గ్, జూన్ 15: ఈసారి ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో మొదటి మ్యాచ్ హుషారుగా సాగితే, రెండో మ్యాచ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. గురువారం సౌదీ అరేబియాను రష్యా 5-0 తేడాతో చిత్తు చేస్తే, శుక్రవారం నాటి మొదటి మ్యాచ్‌లో ఉరుగ్వే అతి కష్టం మీద ఈజిప్టుపై 1-0 తేడాతో గెలిచింది. జొస్ గిమెనెజ్ చివరి క్షణాల్లో సాధించిన గోల్‌తో మాజీ చాంపియన్ ఉరుగ్వే ఈసారి పోటీల్లో బోణీ చేసింది.

06/16/2018 - 01:53

బెంగళూరు, జూన్ 15: సంక్లిష్టమైన ఇంగ్లాండ్ టూర్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొంటాడా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ సిరీస్‌లో పాల్గొనే ముందు ఆటగాళ్ల ఫిట్నెస్‌పై స్పష్టత కోసం బీసీసీఐ చాలాకాలంగా యో-యో టెస్టు నిర్వహిస్తోంది.

06/16/2018 - 01:52

మాస్కో, జూన్ 15: వరల్డ్ కప్ సాకర్‌ను చూసేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అభిమానులను రష్యాలో ఆకాశాన్నంటుతున్న ధరలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయ. ప్రత్యేకించి బస కోసం కష్టాలు తమ్మడం లేదు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది ఇళ్ల యజమానులు అద్దెను విపరీతంగా పెంచేశారు. ఈ పోటీలు జరుగుతున్న 11 నగరాల్లో హోటళ్లు ఇప్పటికే దాదాపుగా నిండిపోయాయి.

06/16/2018 - 01:51

బెర్లిన్, జూన్ 15: రష్యా డోపింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన జర్మనీ జర్నలిస్టు హజో సెపెల్ట్ ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాకర్ టోర్నమెంట్‌కు హాజరుకావడం లేదు. భద్రతా కారణలే అందుకు కారణం. రష్యా ప్రభుత్వం వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదని, ఉద్దేశపూర్వకంగా క్రీడాకారులకు ఉత్ప్రేరకాలను అలవాటు చేసిందని హజో సాక్ష్యాధారాలతోసహా బయటపెట్టడంతో యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.

06/16/2018 - 01:50

సెయంట్‌పీటర్స్‌బర్గ్, జూన్ 15: మొరాకోతో జరిగిన మ్యాచ్‌ని ఇరాన్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. అయతే, అది ఇరాన్ గొప్పతనంకాదు. మొరాకో ఆటగాడు అజీజ్ బౌహాడొన్జ్ ఓన్‌గోల్ చేసి, ప్రత్యర్థిని గెలిపించాడు. శుక్రవారం నాటి మొదటి మ్యాచ్ మాదిరిగానే రెండో మ్యాచ్ కూడా చప్పగా సాగింది. ఇరు జట్లు అంతులేని డిఫెన్స్‌ను అనుసరించి, మ్యాచ్‌లో జీవాన్ని చంపేశాయ. ప్రథ మార్ధంతోపాటు, ద్వితీయార్ధంలోనూ గోల్స్ నమోదుకాలేదు.

06/16/2018 - 01:47

బ్రోనిట్నీ, జూన్ 15: అర్జెంటీనా ఫుట్‌బాల్ వీరుడు లియోనెల్ మెస్సీకి బ్రోనిట్నీ నగరంలో ఎవరూ ఊహించనంత భారీ స్వాగతం లభించింది. మాస్కోకు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోని ఈ నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. వరల్డ్ కప్ సాకర్‌లో భాగంగా శనివారం ఐస్‌లాండ్‌తో అర్జెంటీనా తలపడనుంది.

Pages