S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/13/2018 - 03:51

మాస్కో, జూన్ 12: ఫిఫా వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ మరోసారి సాకర్‌లో సత్తా చాటేందుకు, తద్వారా మళ్లీ మరోసారి చాంపియన్‌గా అవతరించేందుకు మంగళవారం రష్యా చేరుకుంది. కెప్టెన్ మాన్యుయెల్ న్యూయెర్‌తో కలసి వచ్చిన టీమ్‌కు ఇక్కడి రష్యావాసులు ఘన స్వాగతం పలికారు. ఆటగాళ్లంతా 26 సెట్ల జెర్సీలతోపాటు 12 టన్నుల వస్తు సామాగ్రితో చేరుకున్నారు.

06/12/2018 - 02:53

బ్రోనిట్సీ (రష్యా): ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌పై తుది నిర్ణయం తీసుకుంటానని అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ స్పష్టం చేశాడు. సోమవారం అతను ఒక స్పానిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా ఏ విధంగా ఆడుతుందనే అంశంపైనే తన నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నాడు.

06/12/2018 - 01:54

మాంటెవీడియో (ఉరుగ్వే), జూన్ 11: బ్రెజిల్‌లో జరిగిన 2014 సాకర్ వరల్డ్ కప్‌తో పోలిస్తే తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానని, గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకున్నానని ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ సొరెజ్ స్పష్టం చేశాడు. ఈసారి వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు రష్యాకు బయలుదేరే ముందు ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ బ్రెజిల్ సాకర్ వరల్డ్ కప్‌లో చోటు చేసుకున్న సంఘటనను దురదృష్టకరమైనదిగా అభివర్ణించాడు.

06/12/2018 - 01:53

మాస్కో, జూన్ 11: మొత్తం 32 జట్లకు చెందిన హేమాహేమీ ఆటగాళ్లంతా వరల్డ్ కప్ సాకర్‌లో తమను తాము నిరూపించుకునేందుకు బరిలోకి దిగనున్నారు. వీరిలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందరూ సమర్థులే. ప్రతిభాపాటవాలున్న వారే. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎక్కువ గోల్స్ చేసి లేదా అద్వితీయ ప్రజ్ఞను చూపిన వారే స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తారు.

06/12/2018 - 01:51

సోచీ, జూన్ 11: అత్యధికంగా ఐదు పర్యాయాలు టైటిల్ సాధించిన బ్రెజిల్ ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకుంది. టైటిల్ వేటుకు సిద్ధంగా ఉన్న ఈ జట్టు ఆటగాళ్లు వియన్నా నుంచి బయలుదేరి, స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు ఝామున మూడు గంటల సమయంలో విమానాశ్రయానికి చేరుకున్నారు.

06/12/2018 - 01:48

న్యూఢిల్లీ, జూన్ 11: ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న ఇద్దరు భారత క్రికెట్ బ్యాట్స్‌మెన్‌లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగే టెస్టు మ్యాచ్‌లకు దూరం కానున్నారు.

06/12/2018 - 01:48

న్యూఢిల్లీ, జూన్ 11: రానున్న ఆసియా కప్‌లో టాప్-10లో నిలుస్తామని భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ అన్నాడు. ఆదివారం కెన్యాతో ముంబయిలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో ఎనిమిది స్ట్రయిక్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన 33 ఏళ్ల ఛెత్రీ ప్రత్యర్థిని 2-0తో ఓడించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో రానున్న ఆసియా కప్‌లోనూ బలమైన జట్టుగా నిలిచేందుకు ఇదే ఆటతీరును కనబరుస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.

06/12/2018 - 01:47

మాడ్రిడ్, జూన్ 11: స్పెయిన్‌లో మంగళవారం నుంచి జరుగునున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటున్న భారత మహిళల హాకీ జట్టు ప్రత్యేకంగా డిఫెన్స్ ఆట తీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ జట్టు ప్రధాన కోచ్ జియోర్డ్ మరజినే సూచించాడు. 5వ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై 0-1 స్కోరు తేడాతో కొరియా గెలుపొందింది. హాకీ వరల్డ్ కప్ లండన్‌లో జూలై 21 నుంచి ఆగస్టు 5వరకు కొనసాగుతుంది.

06/12/2018 - 01:47

న్యూఢిల్లీ, జూన్ 11: రష్యాలో ఈనెల 14 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో భారత్‌లోని ఇద్దరు వ్యక్తులకు అఫీసియల్ బాల్ క్యారియర్స్‌గా అరుదైన అవకాశం దక్కింది. కర్నాటకకు చెందిన 10 ఏళ్ల రిషి తేజ్, తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల నథానియా జాన్ కే ఫిఫా వరల్డ్ కప్ అఫీసియల్ మ్యాచ్ బాల్ క్యారియర్స్ (ఓఎంబీసీ)గా ఎంపికయ్యారు.

06/11/2018 - 03:30

పారిస్: ‘క్లే కోర్టు’ స్పెషలిస్టు రాఫెల్ నాదల్ మరోసారి సత్తా చాటాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో డామినిక్ థియేమ్‌ను 6-4, 6-3, 6-2 తేడాతో ఓడించాడు. కెరీర్‌లో 17వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్న 32 ఏళ్ల ప్రపంచ నెంబర్ వన్ నాదల్‌కు ఇది 11వ ఫ్రెంచ్ ఓపెన్ కావడం విశేషం. ఒకే మేజర్ టోర్నీలో 11 టైటిళ్లు సాధించిన ఆటగాళ్లు ఎవరూ లేరు.

Pages