S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/11/2018 - 01:03

మాస్కో, జూన్ 10: వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జట్టుకు బహూకరించే ట్రోఫీని మొదట్లో ‘విక్టరీ’గా పిలిచేవారు. ఆ తర్వాత ఫిఫా అధ్యక్షుడు జూలెస్ రిమెట్ పేరును ఆ ట్రోఫీకి ఖరారు చేశారు. లండన్ స్టాంప్ ఎగ్జిబిషన్‌లో భారీ భద్రత మధ్య ప్రదర్శనకు ఉంచిన ఈ ట్రోఫీ 1966లో అనూహ్యంగా మాయమైంది. గుర్తుతెలియని వ్యక్తులు లోనికి చొరబడి ట్రోఫీని ఎత్తుకెళ్లారు.

06/11/2018 - 01:01

మాస్కో, జూన్ 10: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌ను ఈసారి ఎవరు కైవసం చేసుకుంటారన్న ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విభిన్నమైన విశే్లషణలు తెరపైకి వస్తున్నాయి. క్వాలిఫయింగ్ రౌండ్‌ను పూర్తి చేసుకొని, మెయిన్ డ్రాకు అర్హత సంపాదించడమే ఒక అద్భుతం. అందుకే, పోటీలో ఉన్న 32 జట్లలో దేనినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

06/11/2018 - 00:58

ముంబయి, జూన్ 10: అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ అరుదైన రికార్డును భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ సమం చేశాడు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో మెస్సీ సరసన రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫైనల్‌లో కెన్యాను ఢీకొట్టిన భారత్ తరఫున ఛెత్రీ 62 కెరీర్ గోల్స్‌లో బరిలోకి దిగాడు.

06/11/2018 - 00:57

కౌలాలంపూర్, జూన్ 10: మహిళల ఆసియా కప్ టీ-20 ట్రోఫీని బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు భారత్‌పై మూడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ వారంలో ఇదే జట్టుపై హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ సేన రెండుసార్లు ఓటమిని చవిచూసింది. భారత్ జట్టులో కెప్టెన్ మినహా మరే ఇతర క్రికెటర్ ఆశించిన స్కోరును సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు.

06/11/2018 - 00:33

స్పెయన్ స్టార్ ఆటగాడు రాఫెల్ నాదల్ తన సత్తా చాటుకున్నాడు. ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో 6-4, 6-3, 6-2తో ఆస్ట్రేలియా ఆటగాడు డొమెనిక్ థియేమ్‌పై ఘన విజయం సాధించాడు. టోర్నీని కైవసం చేసుకున్న అనంతరం మైదానంలో రాఫెల్ ఆనందం.

06/10/2018 - 05:25

లండన్: రష్యాలో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను చూసేందుకు వెళ్లే అభిమానులను జాగ్రత్తగా ఉండాలని, దాడు లు జరిగే ప్రమాదం ఉందని ఇంగ్లాండ్ అధికారులు హెచ్చరించారు. గతంలో జరిగిన పలు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని, ఇంగ్లాండ్ అభిమానులపై దాడులు జరగవచ్చని బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో అనుమానం వ్యక్తం చేసింది.

06/10/2018 - 01:49

మాస్కో సహా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అన్ని నగరాల్లోనూ అందమైన మస్కట్ ‘జబివకా’ అలరిస్తున్నది. రష్యా భాషలో ‘జబివకా’ అంటే స్కోరు చేసే వ్యక్తి. ఎంతో కసరత్తు జరిపిన తర్వాత, ఓటింగ్ ద్వారా ఫుట్‌బాల్ ఆడుతున్న తోడేలు రూపాన్ని మస్కట్‌గా ఎంపిక చేశారు. మస్కట్‌గా ఏది ఉండాలో నిర్ధారించడానికి తోడేలు, పులి, పిల్లి మధ్య ఓటింగ్‌కు నోటిఫికేషన్‌ను అధికారులు జారీ చేశారు.

06/10/2018 - 01:19

మాస్కో, జూన్ 9: రష్యా అధక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌కు వచ్చే 32 జట్ల ఆటగాళ్లు, అధికారులతోపాటు, లక్షలాది మంది అభిమానులకు సాదర స్వాగతం పలికాడు. ‘ప్రతి ఒక్కరూ తమతమ స్వదేశాల్లో ఉన్నట్టుగానే రష్యాలో సంతోషంగా ఉంవచ్చు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం’ అని తన వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

06/10/2018 - 01:51

పారిస్, జూన్ 9: ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న సిమోనా హాలెప్ కెరీర్‌లో మొదటి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవశం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో అమెరికా క్రీడాకారిణి స్లొయెన్ స్టెఫెన్స్‌ను 3-6, 6-4, 6-1 తేడాతో ఓడించింది. మొదటి సెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత రెండు సెట్లలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచింది.

06/10/2018 - 01:17

కౌలాలంపూర్, జూన్ 9: మహిళల ఆసియా కప్ టీ-20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్‌లో చోటుకోసం శనివారం జరిగిన పోరులో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ప్రత్యర్థిని 72 పరుగులకే కట్టడి చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.

Pages