S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/23/2018 - 05:37

ముంబయి: మహిళా క్రికెట్‌లో ఐపీఎల్ తరహాలో నిర్వహించిన టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు మంచి స్పందన లభించింది. ఇక్కడి వాంఖడే స్టేడియంలో మంగళవారం ట్రయల్‌బ్లేజర్స్, సూపర్‌నోవాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్‌నోవాస్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

05/23/2018 - 01:20

పుణె, మే 22: దేశవ్యాప్తంగా మేటి యువ షూటర్‌లను ఎంపిక చేసి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణనిచ్చి అన్నివిధాల తీర్చిదిద్దేందుకు గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (జీఎన్‌ఎస్‌పీఎఫ్) కృషి చేస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా యువ షూటర్‌లకు మెరుగైన శిక్షణనిచ్చి 2024 ఒలింపిక్స్‌లో కనీసం పది మంది షూటర్‌లు పతకాలు సాధించే దిశగా భారత షూటర్ గగన్ నారంగ్ నడుంబిగించాడు.

05/23/2018 - 01:18

కోల్‌కతా, మే 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) దశ చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ జట్ల మధ్య జరిగే భీకర పోరు ఉత్కంఠను కలిగించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబయి వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఇందులో చె న్నై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

05/23/2018 - 01:16

ముంబయి, మే 22: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం నమోదు చేసింది. ఆఖరి ఓవర్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఫప్ డుప్లెసిస్ చివరి వరకూ నాటౌట్‌గా నిలిచి తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. చెన్నై 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేయగా, హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్‌ను ఎంచుకుంది.

05/22/2018 - 01:59

ముంబయి: ముంబయి వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగే మొదటి క్వాలిఫయర్‌లో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల వివరాలు...
సన్‌రైజర్స్ హైదరాబాద్
1. రాజస్థాన్ రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం (రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125, సన్‌రైజర్స్ హైదరాబాద్ 15.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు).

05/22/2018 - 01:35

ముంబయి, మే 21: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్యాటింగ్ విభాగంలో రిషభ్ పంత్, బౌలింగ్ విభాగంలో ఆండ్రూ టై నంబర్ వన్ స్థానాల్లో ఉన్నారు.

05/22/2018 - 01:36

ముంబయి, మే 21: ప్రస్తుత సీజన్‌లోని ఐపీఎల్‌లో అతి కీలకమైన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ పోరాడనున్నారు. మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌కు ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది. మొత్తం జట్లలో తొలిస్థానంలో ఉన్న హైదరాబాద్, రెండో స్థానంలో ఉన్న చెన్నై ఆడిన 14 మ్యాచ్‌లలో తొమ్మిదింట్లో విజయం సాధించి, మరో ఐదింట్లో పరాజయాన్ని ఎదుర్కొన్నాయి.

05/22/2018 - 01:09

ముంబయి, మే 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో మహిళా క్రికెట్‌లోనూ మార్గం సుగమం చేసుకునేందుకు వీలుగా మంగళవారం మహిళల టీ-20 మ్యాచ్‌ను మంగళవారం ముంబయి వాంఖడే స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇదే స్టేడియంలో ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి ఏడు గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కంటే ముందుగానే మహిళల టీ-20 లీగ్‌ను నిర్వహించనున్నారు.

05/22/2018 - 01:08

న్యూఢిల్లీ, మే 21: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సమావేశాల్లో ఓటింగ్ అధికారం ఇకపై అంతర్జాతీయ క్రికెటర్లకు దక్కనుంది. బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఓఏ) సభ్య సంఘాలకు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అన్ని రకాల అనుబంధ సంఘాలకూ ఈ నిబంధన వర్తిస్తుందని సీఓఏ స్పష్టం చేసింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒకటికి మించిన క్రికెట్ సంఘాలు ఉన్నాయి.

05/22/2018 - 01:07

లండన్, మే 21: లండన్‌లోని లార్డ్స్ మైదానంలో పాకిస్తాన్‌తో గురువారం నుంచి జరిగే తొలి టెస్టుమ్యాచ్‌లో మళ్లీ చోటు దక్కడం మరో అనుభవం వంటిదని ఇంగ్లాండ్ క్రికెటర్ జోష్ బట్లర్ అన్నాడు. 2016 డిసెంబర్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడిన తర్వాత మళ్లీ ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించాడు.

Pages