S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/20/2018 - 04:37

సన్‌రైజర్స్ హైదరాబాద్ 18, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ చెరి 16 పాయంట్లతో ప్లే ఆఫ్‌కు చేరాయ. రాజస్తాన్ రాయల్స్ తాజా విజయంతో 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కోసం పోటీపడుతున్నది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరడం ఆదివారం నాటి మ్యాచ్‌ల్లో రాబోయే ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఆ రెండు జట్లూ గెలిస్తే, మొత్తం మూడు జట్లు తలా 14 పాయింట్లతో సమానంగా ఉంటాయి.

05/20/2018 - 04:36

న్యూఢిల్లీ, మే 19: హాకీ ఇండియా (హెచ్‌ఐ) నూతన అధ్యక్షుడిగా రాజీందర్ సింగ్ నియమితుడయ్యాడు. మరియమ్మ కోషీ రాజీనామా చేయడంతో హాకీ ఇండియాలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజీందర్ అధ్యక్షుడిగా శనివారం పదవీ బాధ్యతల చేపట్టాడు. గతంలో అతను హెచ్‌ఐకి కోశాధికారిగా పని చేశాడు.

05/20/2018 - 04:36

రోమ్, మే 19: ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆటగాళ్లు, చిరకాల ప్రత్యర్థులు రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్ మరోసారి ఢీకొనేందుకు సిద్ధమయ్యారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించే మ్యాచ్‌కి సిద్ధమైన వీరిద్దరూ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తలపడడం ఇది 51వసారి. పురుషుల సింగిల్స్ రెండో సెమీ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారుడు కెయ్ నిషికొరీని 2-6, 6-1, 6-3 తేడాతో ఓడించిన నాదల్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.

05/20/2018 - 04:35

కారాచి, మే 19: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై తరచు విమర్శలు చేస్తున్న పాకిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హాఫీజ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ విషయంలో ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై లేని పోని విమర్శలు చేస్తున్నందుకు గాను హాఫీజ్‌కు పీసీబీ ఈ-మెయిల్ ద్వారా హఫీజ్‌కు నోటీసు పంపింది.

05/19/2018 - 02:31

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొదటి నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు ఇప్పటికే ఖాయమయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే సూపర్ ఫోర్‌లో చోటు దక్కించుకున్నాయి. దీనితో మిగతా రెండు స్థానాల కోసం హోరాహోరీ పోరు కొనసాగనుంది.

05/19/2018 - 00:40

న్యూఢిల్లీ, మే 18: ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి నిష్క్రమించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ శుక్రవారం ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యా చ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢీకొని 34 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. ఈ ఫలితం అటు చెన్నైకిగానీ, ఢిల్లీకిగానీ ఎలాంటి లాభం లేకపోవ వడంతో, ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ, ఈ మ్యాచ్ అభిమానులను ఆ కట్టుకోలేకపోయంది.

05/19/2018 - 00:39

పారిస్, మే 18: ఫ్రాన్స్ సాకర్ సూపర్ స్టార్స్‌లో ఒకడైన దిమిత్రీ పాయెట్‌కు వచ్చేనెల రష్యాలో జరగబోయే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య ఎంపిక చేసిన 23 మంది సభ్యులతో కూడిన వరల్డ్ కప్ జట్టులో పాయెట్‌కు చోటు లభించలేదు. ఇటీవల యూరోపియా లీగ్ ఫైనల్‌లో అట్లాటికో మాడ్రిడ్‌తో తలపడిన వెస్ట్ హామ్ యునైటెడ్ తరఫున బరిలోకి దిగిన పాయెట్ గాయపడ్డాడు.

05/19/2018 - 00:37

మనీలా, మే 18: సుమారు ఏడాది విశ్రాంతి తర్వాత మళ్లీ ట్రైనింగ్ సెషన్‌లో చెమటోడుస్తున్న ఫిలిప్పీన్స్ స్టార్ బాక్సర్ మానీ పాక్వియావో జూలై మాసంలో లుకాస్ మాథిస్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నాడు. కెరీర్‌లో అదే తన చివరి ఫైట్ కావచ్చని, అయితే, ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని అతను ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

05/19/2018 - 00:35

క్రికెట్‌లోని అన్ని విభాగాల్లోనూ ప్రజ్ఞా శాలి... ఏ క్రీడాలోనైనా అద్భుతాలు సృష్టించి జట్టును విజయపథంలో నడిపించే సామర్థ్యం అతని సొంతం... అతనే క్రికెట్‌లోనేగాక ఇతర క్రీడల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ అబ్రహం బెంజిమిన్ డివిలియర్స్. ఒంటి చేత్తో మ్యాచ్‌ని మలుపుతిప్పే సామర్థ్యం తనకు ఉందని అతను ఓ అసాధ్యమైన క్యాచ్ ద్వారా నిరూపించాడు.

05/19/2018 - 00:29

రోమ్, మే 18: ఉక్రెయిన్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా ఇక్కడ జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె తన ప్రత్యర్థి, 12వ ర్యాంకర్ ఏంజెలిక్ కెర్బర్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించింది. రెండు సెట్లలోనూ విజయం కోసం కెర్బర్ ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.
నాదల్, సిలిక్ ముందంజ

Pages