S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/06/2016 - 08:22

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్‌లో సాకర్ పోరు ఆరంభమైంది. పోటీలకు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్‌తో తొలి మ్యాచ్‌లో పోటీపడిన దక్షిణాఫ్రికా చక్కటి ప్రతిభ కనబరచింది. గోల్స్ చేయడానికి ప్రయత్నించకుండా పూర్తి రక్షణ విధానాన్ని అనుసరించిన ఈ జట్టు బలమైన బ్రెజిల్‌ను నిలువరించి మ్యాచ్‌ని డ్రా చేసుకోగలిగింది.

08/06/2016 - 08:22

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎనిమిది పతకాలు లభిస్తాయని ‘ఒలింపిక్స్, ఎకనామిక్స్ రిపోర్ట్’ నివేదిక అంచనా వేసింది. వీటిలో ఒకటి స్వర్ణమని జోస్యం చెప్పింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జితూ రాయ్, టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సానియా మీర్జా, రోహన్ బొపన్న జోడీ పతకాలు సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.

08/06/2016 - 08:21

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్న మరకానా స్టేడియం స్టార్ అట్రాక్షన్‌గా నిలిచింది. దశాబ్దకాలంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నది. ఈవెంట్ నిర్వాహణ ఎలావున్నా, ప్రారంభం అదిరిపోతే, ఆతర్వాత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది నిర్వాహకుల అభిప్రాయం. రియోలోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది.

08/05/2016 - 01:37

రియో డి జెనీరో, ఆగస్టు 4: బ్రెజిల్‌లోని రియో డి జెనీరో 33వ ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌లో విజయభేరి మోగించి, పతకాలను కొల్లగొట్టడానికి ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డుతారు. అందుకే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను మించిన అతి పెద్ద క్రీడా పండువగా ఒలింపిక్స్ అవతరించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒలింపిక్ క్రీడలు అసలుసిసలైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.

08/05/2016 - 01:32

రియో డి జెనీరో, ఆగస్టు 4: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం చేజారిపోతుందేమోనని ఆందోళనకు గురైన రష్యా అథ్లెట్లకు ఊరట లభించింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నిర్ణయించింది. ఒలింపిక్స్‌కు ఎంపికైన రష్యా బృందంలో ఏకంగా 117 మంది డోప్ పరీక్షలో విఫలం కావడంతో క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే.

08/05/2016 - 01:31

న్యూఢిల్లీ, ఆగస్టు 4: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) శుక్రవారం ఇక్కడ జరిగింది. వచ్చే ఆరు నెలల్లో లోధా సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సులను యథాతథంగా అమలు చేయడం అసాధ్యమని బిసిసిఐ చేసిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

08/05/2016 - 01:29

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు కొత్తరకంగా జడ వేస్తున్న ఆమె సోదరి వీనిస్ విలియమ్స్. వీరిద్దరూ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో పోటీపడతారు. మహిళల డబుల్స్‌లో కలిసి బరిలోకి దిగుతారు. వీరిద్దరు డబుల్స్ విభాగంలో 22 మేజర్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఒకసారి రన్నరప్‌గా నిలిచారు. వీరిద్దరూ రియో చేరుకున్న మరుక్షణం నుంచే మీడియా దృష్టిని ఆకర్శించారు.

08/05/2016 - 01:36

కింగ్‌స్టన్, ఆగస్టు 4: రోస్టన్ చేజ్ వీరోచిత శతకం వెస్టిండీస్‌ను ఓటమి ప్రమాదం నుంచి తప్పించింది. భారత్‌తో జరిగిన రెండో టెస్టును విండీస్ డ్రా చేసుకోవడంలో చేజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 196 పరుగులకు ఆలౌట్‌కాగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లకు 500 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

08/05/2016 - 01:26

రియో డి జెనీరో, ఆగస్టు 4: కెరీర్‌లో అనేకానేక చాంపియన్‌షిప్స్‌తోపాటు ఏడు ఒలింపిక్ పతకాలను సాధించిన బ్రిటిష్ సైక్లిస్ట్ బ్రాడ్లే విగిన్స్ చివరిసారి రియోలో బరిలోకి దిగనున్నాడు. ఒలింపిక్స్‌లో ఇంత వరకూ నాలుగు స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలను సాధించిన అతని ఖాతాలో మూడు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు కూడా ఉన్నాయి.

08/05/2016 - 01:23

రియో డి జెనీరో, ఆగస్టు 4: దక్షిణాఫ్రికా అథ్లెట్ కాస్టర్ సెమెన్యా మళ్లీ తెరపైకి వచ్చింది. పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్న కారణంగా మహిళల విభాగంలో పోటీ చేయడానికి వీల్లేదని అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేయడంతో సెమెన్యా క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ సంపాదించింది.

Pages