S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/03/2018 - 01:08

గుంటూరు, మే 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగిగా తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్‌ను రాష్ట్రప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీకాంత్ విధుల్లో చేరారు.

05/03/2018 - 01:09

న్యూఢిల్లీ, మే 2: ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడం తనలో ఎంతో నమ్మకం, విశ్వాసం పెంచిందని ప్రముఖ జావెలిన్ త్రోయర్ స్టార్ అథ్లెట్, హర్యానాకు చెందిన 20 ఏళ్ల నీరజ్ చోప్రా అన్నాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో ఘన విజయంతో జకార్తాలో ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించే ఆసియా గేమ్స్‌లోనూ మరో గోల్డ్ మెడల్ సాధించే దిశగా తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నాడు.

05/03/2018 - 01:14

దుబాయ్, మే 2: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న భారత్.. వనే్డల్లో మాత్రం రెండోస్థానానికి పడిపోయింది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ సేనను వెనక్కి నెట్టిన ఇంగ్లాండ్ టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకుంది. 2013 సంవత్సరం తర్వాత ఇంగ్లాండ్ జట్టు వనే్డల్లో నంబర్ వన్‌గా నిలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

05/03/2018 - 00:49

కౌలాలంపూర్, మే 2: మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతికి పాల్పడిన ఇద్దరు మలేషియా బాడ్మింటన్ క్రీడాకారులపై ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్య్లూఎఫ్) కనె్నర్ర చేసింది. ఈ ఇద్దరు షట్లర్‌లు 15 నుంచి 20 సంవత్సరాలపాటు బాడ్మింటన్ టోర్నమెంట్‌లలో పాల్గొనకుండా నిషేధం విధించడంతో పాటు జరిమాన విధించింది.

05/03/2018 - 00:48

న్యూఢిల్లీ, మే 2: ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 17.1 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడడంతో చాలాసేపటివరకు ఆటను ప్రారంభించడానికి వీలులేకపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గడంతో ఆటను ప్రారంభించారు.

05/03/2018 - 00:47

న్యూఢిల్లీ, మే 2: భారత షూటర్ షహజార్ రిజ్వీ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) 10 మీటర్ల పిస్టల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి నెంబర్ వన్ ర్యాంక్‌ను చేజిక్కించుకున్నాడు. గత వారం కొరియాలో జరిగిన వరల్డ్‌కప్‌లో రజతం సాధించడంతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు.

05/03/2018 - 01:11

హైదరాబాద్, మే 2: ప్రతిష్టాత్మకమైన ప్రథమ భారత గ్రాండ్ స్లామ్ క్యారమ్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి ఎల్.హరిప్రియ 16-9, 25-5 పాయింట్ల తేడాతో హైదరాబాద్‌కు చెందిన హుస్నా సమీరాపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

05/03/2018 - 00:45

కోల్‌కతా, మే 2: ప్రస్తుత ఐపీఎల్‌లో ఆడుతున్న ఎనిమిది జట్లలో అద్భుతమైన ఆటతీరుతో ప్రథమ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో గెలుపు కోసం సన్నద్ధం అవుతోంది. గురువారం కోల్‌కతా స్టేడియంలో కోల్‌కతా జట్టుతో తలపడనుంది. ఇంతవరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి, మరో రెండింట్లో ఓటమిని చవిచూసి, 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

05/03/2018 - 00:43

కౌలాలంపూర్, మే 2: మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతికి పాల్పడిన ఇద్దరు మలేషియా బాడ్మింటన్ క్రీడాకారులపై ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్య్లూఎఫ్) కనె్నర్ర చేసింది. ఈ ఇద్దరు షట్లర్‌లు 15 నుంచి 20 సంవత్సరాలపాటు బాడ్మింటన్ టోర్నమెంట్‌లలో పాల్గొనకుండా నిషేధం విధించడంతో పాటు జరిమాన విధించింది.

05/02/2018 - 01:32

న్యూఢిల్లీ, మే 1: ప్రముఖ హాకీ గోల్ స్కోరర్ సునీల్ ఛత్రికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం కోసం ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) కేంద్రానికి సిఫారసు చేసింది. ఛత్రి భారత ఫుట్‌బాల్ తరపున వివిధ మ్యాచ్‌లలో ఆడిన సందర్భంగా అత్యధికంగా 56 గోల్స్‌తో ప్రపంచ పుటల్లో మంచి స్ట్రైకింగ్ రేటుతో దూసుకుపోతున్నాడు.

Pages