S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/02/2018 - 01:01

న్యూఢిల్లీ, మే 1: భారత బాక్సర్ నీరజ్ గోయత్ డబ్ల్యూబీసీ ఆసియా బాక్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. వెల్టర్ వెయిట్ కేటగిరిలో ప్రస్తుతం డబ్ల్యూబీసీ ఆసియా చాంపియన్‌గా అతను కొనసాగుతున్నాడు. 2011 నుంచి బాక్సింగ్ క్రీడలో పాల్గొంటున్న ఆయన రెండు నాకౌట్లతోపాటు తొమ్మిది ఫైట్స్ విభాగాల్లో విజయం సాధించాడు.

05/02/2018 - 00:59

న్యూఢిల్లీ, మే 1: ఐపీఎల్ టీమ్‌లలో ఆఖరి స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐదో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొననుంది. ఢిల్లీ ఇంతవరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం రెండింట్లో విజయం సాధించింది. ఆరు మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొన్న ఈ టీమ్ పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లు కలిగివుంది.

05/02/2018 - 00:57

దుబాయ్, మే 1: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన ఎంఆర్‌ఎఫ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్‌లో నిలిచింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

05/02/2018 - 00:55

న్యూఢిల్లీ, మే 1: భారత పురుషులు, మహిళల హాకీ జట్ల కోచ్‌లలో స్వల్ప మార్పులు జరిగాయి. పురుషుల జట్టు కోచ్‌గా హరేంద్ర సింగ్, మహిళా జట్టు కోచ్‌గా సజార్డ్ మారిజ్నే నియమితులయ్యారు. ఇంతవరకు పురుషుల జట్టు కోచ్‌గా ఉన్న మారిజ్నే ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో ఆశించిన ఫలితాలు సాధించడంలో సమర్థవంతంగా కర్తవ్యాన్ని నిర్వహించలేకపోవడంతో ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తోంది.

05/02/2018 - 01:14

హైదరాబాద్, మే 1: ప్రతిష్టాత్మకమైన ప్రథమ భారత గ్రాండ్ స్లామ్ క్యారమ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల సింగిల్స్‌తో పాటు మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుని హైదరాబాద్ డబుల్ టైటిల్ సాధించింది.

05/02/2018 - 00:51

బెంగళూరు, మే 1: ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో హార్థిక్ పాండ్య మూడు ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు ప్రధాన వికెట్లు తీసుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్‌ను ఎంచుకుంది.

05/02/2018 - 10:51

చిత్రం: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల విజేతలు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నప్పటి దృశ్యం

05/01/2018 - 01:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: అథ్లెట్లకు ప్రోత్సాహకాల మంజూరులో జరుగుతున్న జాప్యం, ఇందుకు కారకులవుతున్న అధికారులపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ధ్వజమెత్తాడు. ఇటీవల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌లో వివిధ పతకాలు సాధించిన క్రీడాకారులకు సోమవారం ఇక్కడ జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

05/01/2018 - 01:47

బెంగళూరు, ఏప్రిల్ 30: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన తమ జట్టు ఇదే తీరున ఫీల్డింగ్ చేస్తే ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడం కష్టమేనని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. బెంగళూరు ఇంతవరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో రెండింట్లో విజయం, మరో ఐదింట్లో ఓటమిని చవిచూసింది.

05/01/2018 - 01:03

బెంగళూరు, ఏప్రిల్ 30: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మనుగడ సాధించేందుకు మంగళవారం జరిగే మ్యాచ్‌పై దృష్టి సారించాయి. మొత్తం ఎనిమిది టీమ్‌లలో పటిష్టమైనవిగా ముద్రపడిన ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమయ్యాయి.

Pages