S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/01/2018 - 01:46

పుణె, ఏప్రిల్ 30: ఇక్కడి స్టేడియంలో సోమవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భారీ లక్ష్య సాధనకు బరిలో దిగిన ఢిల్లీ ఐదు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి ఓటమిని ఎదుర్కొంది. ఢిల్లీ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంతప్, విజయ్ శంకర్‌ల శ్రమ వృథా అయింది.

05/01/2018 - 00:59

ఇండోర్, ఏప్రిల్ 30: వెస్టిండీస్‌కు ప్రపంచకప్, ప్రస్తుతం భారత్‌లో జరుగతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యామని విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన గేల్ 252 పరుగులు చేసి బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

05/01/2018 - 00:58

సిడ్నీ, ఏప్రిల్ 30: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఖరారు చేసింది. అయితే ఈ ఏడాది భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సీఏ ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచ్ వేదికల తేదీలను సీఏ వెల్లడించింది.

04/30/2018 - 04:23

జైపూర్: రాజస్తాన్ రాయల్స్ తమ సొంత గడ్డపై ఓటమిపాలైంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేయగా, రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ కెప్టెన్ కనే విలియమ్‌సన్ అత్యధికంగా 63 పరుగులు చేశాడు.

04/30/2018 - 04:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: మహిళల షటిల్ బాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి ఎన్.సిక్కిరెడ్డి. పురుషుల డబుల్స్ విభాగంలో షట్లర్ బి.సుమీత్ రెడ్డికి అర్జున అవార్డుల కోసం బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

04/30/2018 - 04:16

బెంగళూరు, ఏప్రిల్ 29: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం ఇక్కడి ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

04/30/2018 - 04:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: యానింగ్‌లో జరిగిన కున్‌మింగ్ ఓపెన్ ఏటీపీ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుడు ప్రజనీష్ గుణ్ణేశ్వరన్ తొలిసారిగా పతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఈజిప్టుకు చెందిన మహ్మన్ సాఫ్‌వాత్‌ను ఓడించి 200 ర్యాంక్‌ను సాధించాడు. అంతకుముందు ఈజిప్టుకు చెందిన మరో క్రీడాకారుడిని 5-7, 6-3, 6-1 తేడాతో ఓడించి 125 పాయింట్లతో 260 ర్యాంక్ సాధించాడు.

04/30/2018 - 04:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: సెర్బియాలో జరిగిన 56వ బెల్‌గ్రేడ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు మొత్తం మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. సుమిత్ సంగ్వాన్ (91 కేజీలు), నిఖ్‌హాత్ జరీన్ (51 కేజీలు), హిమాంశు శర్మ (49 కేజీలు) టోర్నీ ముగింపు సందర్భంగా తమ తమ విభాగాల్లో భారత్‌కు బంగారు పతకాలు అందించారు. మరో ఐదుగురు బాక్సర్లు ఐదు కాంస్య, మరో ఐదుగురు బాక్సర్లు రజత పతకాలతో మెరిశారు.

04/30/2018 - 04:13

పుణె, ఏప్రిల్ 29: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బలమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడనుంది. వాస్తవానికి చెన్నై ఏ విభాగంలో చూసుకున్నా ఢిల్లీకన్నా పటిష్టంగా ఉంది. మొత్తం ఐపీఎల్ టీమ్‌లలో అగ్రస్థానంలో నిలబడడమే కాకుండా ఇంతవరకు ఆడిన ఏడు ఏడు మ్యాచ్‌లలో ఐదింట్లో ఘన విజయం సాధించిన, రెండింట్లో ఓటమి పాలైంది.

04/29/2018 - 03:55

న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీకి ప్రఖ్యాత సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం కోసం కేంద్ర ప్రభుత్వానికి ముగ్గురు సభ్యులు గల బీసీసీఐ ప్రతిపాదించింది. డయానాతోపాటు భారత మహిళా క్రికెట్ మాజీ ఓపెనర్ దివంగత పంకజ్ రాయ్‌కి సైతం ఈ పురస్కారం లభించే అవకాశం ఉంది.

Pages