S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/29/2018 - 00:46

జైపూర్, ఏప్రిల్ 28: స్వంత గడ్డపై ఈనెల 9వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన అజింక్య రహానే కెప్టెన్సీలోని రాజస్తాన్ రాయల్స్ ఆదివారం సాయంత్రం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గెలుపు సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.

04/29/2018 - 00:27

బెంగళూరు, ఏప్రిల్ 28: బెంగళూరులో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వాలని స్థానిక బెంగళూరు జట్టు సర్వత్రా సన్నద్ధమవుతోంది. ఐపీఎల్‌లోని ఎనిమిది జట్లలో ప్రస్తుతం ఆరో టీమ్‌గా నిలవడంతోపాటు ఇంతవరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండింట్లో విజయం సాధించి, నాలుగింట్లో ఓటమిని ఎదుర్కొన్న బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

04/29/2018 - 00:25

పుణె, ఏప్రిల్ 28: ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించంది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జట్టులో సురేష్ రైనా అత్యధికంగా 75 పరుగులు చేశాడు. తొలుత టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్‌ను ఎంచుకుంది.

04/29/2018 - 00:49

హైదరాబాద్, ఏప్రిల్ 28: ప్రతిష్టాత్మకమైన ప్రథమ భారత గ్రాండ్ గ్రాండ్ స్లామ్ క్యారమ్ టోర్నమెంట్ రెండో రౌండ్‌కు మహారాష్టక్రు చెందిన జాతీయ మాజీ చాంపియన్ మహేంద్ర తంబే, తమిళనాడుకు చెందిన బి.రాధాకృష్ణన్ రెండో రౌండ్‌లో ప్రవేశించారు.

04/29/2018 - 00:47

హైదరాబాద్, ఏప్రిల్ 28: నేమార్ జూనియర్స్ 5-ఏ సైడ్ రెడ్‌బుల్ జాతీయ సాకర్ టోర్నమెంట్‌లో జోగా బొనిటో ముంబయి జట్టు విజేతగా నిలిచింది. దీంతో బ్రెజిల్‌లో జూలైలో జరుగనున్న ప్రంచ ఫైవ్ ఏ సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు తరపున పాల్గొనేందకు ముంబయి జట్టు కు చక్కటి ఆవకాశం లభించింది.

04/28/2018 - 16:24

రాజస్థాన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఐపీఎల్-11 సీజన్‌కు తెలుగువాడైన కార్తీక్ సాగర్ గట్టిపల్లి ఎంపికయ్యాడు. అమెరికా టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన కార్తీక్ అండర్-19 అమెరికా క్రికెట్ జట్టులో ఆడాడు. 17 ఏళ్లలోపే తన సత్తా చాటి అందరి అభినందలు అందుకున్నాడు.

04/28/2018 - 05:23

ఉహాన్ (చైనా): భారత స్టార్ షట్లర్, కామనె్వల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు సైనా నెహ్వాల్ ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకొంది. ఈ మేరకు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిపై గెలుపొంది కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

04/28/2018 - 01:35

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్- 11లో భాగం గా శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదంనలో కోల్‌కతా నైట్‌రైడర్స్-్ఢల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డులు నమోనదయ్యాయి. తొలుత టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డిం గ్ ఎంచుకున్న మ్యాచ్‌లో అరుదైన రికార్డు చోటుచేసుకుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్‌ను పాటించింది.

04/28/2018 - 01:34

ఢిల్లీ, ఏప్రిల్ 27: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-11లో భాగంగా ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 55 పరుగులతేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి జట్టు రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది.

04/28/2018 - 01:32

లండన్, ఏప్రిల్ 27: దేశవాళీ క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న తప్పిదాలు, బాల్ ట్యాంపరింగ్, స్లెడ్జింగ్ తదితర అంశాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టి సారించింది. క్రికెటర్‌లో మ్యాచ్‌ల్లో చేసే తప్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ఐసీసీ నిర్ణయించింది. తప్పులు చేసే క్రీడాకారులకు జరిమానా, చిన్నపాటి శిక్షలతో ఊరుకోవద్దని నిర్ణయించింది.

Pages