S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/08/2016 - 00:29

చిత్రం.. ముంబయలో సోమవారం ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ ‘ప్యూమా’ నిర్వహించిన ఒక కార్య క్రమంలో సందడి చేస్తున్న రెజ్లర్ సాక్షి మాలిక్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

11/07/2016 - 08:18

లాస్ వెగాస్, నవంబర్ 6: ఫిలిప్పీన్స్ బాక్సర్ మానీ పాక్వియావో ప్రపంచ బాక్సింగ్స్ సంస్థ (డబ్ల్యుబివో) టైటిల్‌ను వరుసగా మూడోసారి నిలబెట్టుకొని హ్యాట్రిక్ సాధించాడు. మాజీ చాంపియన్ జెస్సీ వర్గాస్‌తో ఇక్కడ జరిగిన ఫైట్‌లో 39 పాక్వియావో మొదటి నుంచే ఆధిపత్యాన్ని కనబరిచాడు. ప్రత్యర్థిపై లెఫ్ట్, రైట్ కాంబినేషన్ హుక్స్‌తో విరుచుకుపడ్డాడు.

11/07/2016 - 08:15

రాజ్‌కోట్, నవంబర్ 6: ఇంగ్లాండ్‌తో ఈనెల తొమ్మిదిన ఇక్కడ ప్రారంభమయ్యే మొదటి టెస్టు మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యను ఆడించే అవకాశాలు ఉన్నట్టు భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే సూచనప్రాయంగా వెల్లడించాడు. బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ పేరును తోసిపుచ్చలేమని అన్నాడు.

11/07/2016 - 08:14

పారిస్, నవంబర్ 6: నొవాక్ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసిన ఆండీ ముర్రే ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడంతో బ్రిటన్ టెన్నిస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న పారిస్ ఓపెన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో మిలోస్ రోనిక్‌ను ఓడిస్తే ముర్రే నంబర్ వన్‌గా ఎదుగుతాడని మ్యాచ్‌కి ముందే స్పష్టమైంది. అయితే, రోనిక్ గాయం కారణంగా సెమీస్ ఆడలేకపోయాడు.

11/07/2016 - 08:14

న్యూఢిల్లీ, నవంబర్ 6: లోధా కమిటీతో చర్చలకు ఈనెల 9 తర్వాత ఎప్పుడైనా తాను సిద్ధమని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. లోధా సిఫార్సులను బోర్డు చాకాలంగా వ్యతిరేకిస్తుండగా, ఏవైనా అభ్యంతరాలుంటే నేరుగా కమిటీతోనే చర్చించాలని సుప్రీం కోర్టు సూచించింది. దీనిపై ఇంత వరకూ స్పందించని ఠాకూర్ ఆదివారం లోధా కమిటీకి లేఖ రాసినట్టు బోర్డు వర్గాలు పిటిఐతో మాట్లాడుతూ చెప్పాయి.

11/07/2016 - 08:13

పెర్త్, నవంబర్ 6: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. విజయానికి భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడం, ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో, మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడం మినహా ఆసీస్‌కు మరో దారి కనిపించడం లేదు.

11/07/2016 - 08:12

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 6: భారత్, వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల సభ్యులు ఆదివారం విజయవాడ చేరుకున్నారు. కృష్ణా జిల్లా మూలపాడులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ), కెడిసిఎ స్టేడియంలో ఈ నెల 10 నుండి 22 వరకు భారత్, వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మూడు వనే్డలు, మూడు టి-20 మ్యాచ్‌లు జరగనున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం మూలపాడులో జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ టోర్నమెంట్ ఇదే.

11/06/2016 - 01:46

సింగపూర్, నవంబర్ 5: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో విజేతగా నిలిచిన పురుషుల జట్టును చూసి స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తున్న భారత మహిళల జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 2-1 ఆధిక్యంతో చైనాను ఓడించి, మొదటిసారి టైటిల్‌ను అందుకుంది. చివరి వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 13వ నిమిషంలోనే దీప్ గ్రేస్ ఎక్కా ద్వారా భారత్ తొలి గోల్‌ను సంపాదించుకుంది.

11/06/2016 - 01:45

సార్‌బ్రకెన్ (జర్మనీ), నవంబర్ 5: బిట్‌బర్గర్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ‘వర్మ సోదరులు’గా అందరికీ తెలిసిన భారత వీరులు సౌరవ్, సమీర్ సెమీ ఫైనల్స్ చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సౌరవ్ 21-15, 16-21, 21-15 ఆధిక్యంతో స్థానిక ఆటగాడు, ప్రపంచ 13వ ర్యాంకర్ మార్క్ వెబ్లెర్‌పై ఎవరూ ఊహించని విజయాన్ని నమోదు చేశాడు.

11/06/2016 - 01:44

రాజ్‌కోట్: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరూ విడిపోతారని వచ్చిన వార్తలు తప్పని మరోసారి రుజువైంది. ఇటీవల న్యూజిలాండ్‌తో భారత్ సిరీస్‌లు ఆడినప్పుడు కోహ్లీతో అనుష్క కనిపించింది. స్టేడియాల్లో సందడి చేసింది. శనివారం రాజ్‌కోట్‌లోనూ అతని వెన్నంటే ఉన్న ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోహ్లీ వెనకే ఉన్న అనుష్క ఉత్సాహంగా కనిపించింది.

Pages