S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/11/2018 - 01:48

గోల్డ్ కోస్ట్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ షూటింగ్ ఈవెంట్‌లో పతకాలు సాధిస్తారనుకున్న భారత షూటర్లు గగన్ నారంగ్, చైన్ సింగ్ అభిమానులను నిరాశపరిచారు. 2014 గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న నారంగ్ ఈసారి దారుణంగా విఫలమై, ఏడో స్థానంలో నిలిచాడు. కాగా, మొదటిసారి ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడిన చైన్ సింగ్ కొద్దిపాటి మెరుగైన ప్రదర్శనతో నాలుగో స్థానాన్ని సంపాదించాడు.

04/11/2018 - 01:47

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 10: నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఒక సైక్లిస్టు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కామనె్వల్త్ గేమ్స్‌లో పోటీపడే అవకాశాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్‌కు చెందిన మెలిస్సా లోథర్ ఈసారి కామనె్వల్త్ గేమ్స్ ఇండివిజువల్ టైమ్ ట్రయల్‌లో పోటీపడాల్సి ఉండింది. అయితే, బరిలో ఉన్న సైక్లిస్టుల జాబితాలో అధికారులు ఆమె పేరును చేర్చలేదు.

04/11/2018 - 01:44

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 10: కామనె్వల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రతిభ కనబరచడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న చర్చ ఇది. ఒకప్పుడు డోపింగ్ పరీక్షల్లో పట్టుబడిన లిఫ్టర్ల కారణంగా పరువు పోగొట్టుకొని, ఒకానొక దశలో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ఆగ్రహానికి గురైన భారత వెయిట్‌లిఫ్టింగ్ రంగం ఇంత త్వరగా ఎలా కోలుకుంది?

04/11/2018 - 01:41

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 11లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అంజిక్యా రహానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ రాజస్థాన్, బ్యాట్స్‌మెన్‌ల మధ్య ఒక్క బలమైన భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేకపోవడంతోనే తాము ఓడిపోయామని తెలిపాడు.

04/11/2018 - 01:41

జైపూర్, ఏప్రిల్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌లో రెండెళ్ల పాటు నిషేధానికి గురై రీ ఇంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తలపడనుంది. సవాయ్ మాన్‌సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బరిలోకి దిగుతాయి. రాజస్థాన్ ఆటగాళ్లలో ఎక్కువ మందికి ఈ సీజన్ పరీక్షలాంటిదే.

04/11/2018 - 01:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ దుబాయ్‌కి తరలిపోయింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 28వ తేదీ వరకు ఈ టోర్నమెంట్‌ను అబూదబీలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) తీర్మానించింది. వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండింది.

04/11/2018 - 01:39

చెన్నై, ఏప్రిల్ 10: చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఒక బంతి మిగిలి ఉండగా చెన్నై విజయాన్ని నమోదు చేసింది. శామ్ బిల్లింగ్స్, డ్వెయన్ బ్రే బ్యా టింగ్ ప్రతిభ చెన్నైని విజయపథంలో నడిపింది.

04/10/2018 - 13:35

గోల్డ్‌కోస్ట్: కామన్‌వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో ఇండియాకు మరో గోల్డ్ దక్కింది. మహిళల 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో షూటర్ హీనా సిధూ స్వర్ణ పతకం గెలుచుకుంది. దీంతో కామన్‌వెల్త్‌లో భారత్ గెలుచుకున్న బంగారు పతకాల సంఖ్య 11కు చేరుకున్నది. ఈ గేమ్స్‌లో హీనాకు ఇది రెండ‌వ మెడ‌ల్ కావ‌డం విశేషం.

04/10/2018 - 04:47

గోల్డ్ కోస్ట్: వివాదాస్పద లిఫ్టర్‌గా కామనె్వల్త్ గేమ్స్‌లోకి అడుగుపెట్టిన లారెల్ హబార్డ్ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో నిష్క్రమించాల్సి వచ్చింది. ఒకవైపు తీవ్రమైన ఒత్తిళ్లను, అవహేళను ఎదుర్కొంటూనే పోటీకి దిగిన ఆమె ఆదివారం మహిళల +90 విభాగంలో లిఫ్ట్‌కు ప్రయత్నించి విఫలమైంది. మోచేయి ఎముక విరిగిపోవడంతో బాధతో విలవిల్లాడుతూ, న్యూజిలాండ్ బృందం సపోర్టింగ్ స్ట్ఫా సాయంతో స్టేజీ దిగింది.

04/10/2018 - 00:55

హైదరాబాద్, ఏప్రిల్ 9: స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యం లో రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన రాజస్థాన్ రాయల్స్ తిరిగి రంగ ప్రవేశం చేసిన మొదటి మ్యాచ్‌లోనే చిత్తయంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొన్న రాజస్థాన్ ఏ మాత్రం పోటీని ఇవ్వలేకపోయంది. దాదాపుగా ఏకపక్షంగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో, పూర్తి ఆధిపత్యాన్ని కనబరచిన సన్‌రైజర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Pages