S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/10/2018 - 00:57

కామనె్వల్త్ టేబుల్ టెన్నిస్ పురుషుల టీం టైటిల్‌ను గెల్చుకున్న భారత జట్టు సభ్యులు శరత్ కమల్ ఆచంట, సథియన్ గుణశేఖరన్, హర్మీత్ దేశాయ్

04/10/2018 - 00:41

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 9: భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ తన అద్వితీయ ప్రతిభాపాటవాలను మరోసారి రుజువు చేసుకున్నాడు. గురి తప్పని అతను ఇక్కడ జరుగుతున్న కామనె్వల్త్ గేమ్స్ పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించడంతోపాటు కొత్త గేమ్స్ రికార్డును నెలకొల్పాడు. అతని సహచరుడు ఓం ప్రకాశ్ మిథర్వాల్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ బెల్ రజత పతకం కైవసం చేసుకున్నాడు.

04/10/2018 - 00:33

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 9: కామనె్వల్త్ గేమ్స్‌లో మొదటిసారి అడుగుపెట్టిన భారత టీనేజ్ షూటర్ మెహులీ ఘోష్ పట్టుదల, ఆమె చూపిన నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది. సింగపూర్ షూటర్ మార్టినా లిండ్సే వెలొసోతో తీవ్రంగా పోటీపడిన ఆమె రజత పతకంతో ఆగిపోయినప్పటికీ, చివరి షాట్‌లో ఆమె ఏకంగా 10.9 పాయింట్లు సంపాదించి, వెలొసోను రెండో స్థానంలోకి నెట్టే ప్రయత్నం చేసింది.

04/10/2018 - 00:32

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 9: కామనె్వల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ టీం ఈవెంట్‌లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మహిళల విభాగంలో మహిళల జట్టు ఇది వరకే స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, సోమవారం నాటి పోరులో పురుషుల జట్టు 3-0 తేడాతో నైజీరియాను చిత్తుచేసింది. టీం ఈవెంట్స్‌లో రెండు టైటిళ్లనూ భారత్ దక్కించుకోవడం విశేషం.

04/10/2018 - 00:29

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 9: భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని తృటిలో కోల్పోయి, రజత పతకాన్ని అందుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో కొత్త గేమ్స్ రికార్డును నెలకొల్పే దిశగా 211 కిలోల బరువునెత్తడానికి ప్రయత్నించిన 23 ఏళ్ల ప్రదీప్ విఫలమయ్యాడు.

04/10/2018 - 00:27

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 9: కామనె్వల్త్ గేమ్స్ బాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. ఈ విభాగంలో భారత్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. మలేసియాతో ఆదివారం జరిగిన ఫైనల్‌లో 3-1 తేడాతో విజయభేరి మోగించిన భారత్ తనకు ఎదురులేదని నిరూపించింది. అంతకు ముందు సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ సింగ్‌పూర్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసిన భారత్ ఉత్సాహంతో మలేసియాను కూడా చిత్తుచేసింది.

04/10/2018 - 00:25

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 9: భారత రేస్ వాకర్ కుష్బీర్ కౌర్ కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ప్రత్యర్థులకు సవాళ్లను విసురుతూ ముందుకు సాగినప్పటికీ, చివరిలో అదే వేగాన్ని కొనసాగిచలేక, నాలుగో స్థానంతో పోటీని పూర్తి చేసింది. కొత్త గేమ్స్ రికార్డును సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్ట్రేలియా రేస్ వాకర్ జెమిమా మాంటెగ్ ఒక గంట, 32.50 నిమిషాల్లో గమ్యాన్ని చేరింది.

04/09/2018 - 12:38

గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్‌ గేమ్స్‌లో సోమవారం పురుషులు స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. పురుషుల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో జీతూరాయ్‌ స్వర్ణం గెలుచుకోగా ఇదే ఈవెంట్‌లో ఓమ్‌ మితర్వాల్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఆసీస్‌ షూటర్‌ కెర్రీ బెల్‌ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మెహులి ఘోష్‌, అపూర్వి చండేలా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

04/09/2018 - 04:22

గోల్డ్ కోస్ట్: ‘మినీ ఒలింపిక్స్’ కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట నిరాటంకంగా కొనసాగుతోంది. నాలుగో రోజు (ఆదివారం) మూడు స్వర్ణాలు, ఒక రజతం సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది. షూటింగ్‌లో మనూ భాకర్, వెయిట్‌లిఫ్టింగ్‌లో పూనమ్ యాదవ్ స్వర్ణాలను అందుకున్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లోనూ భారత్‌కు స్వర్ణం లభించింది.

04/09/2018 - 00:50

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 8: కామనె్వల్త్ గేమ్స్ షూటింగ్‌లో భారత్ పతకాల వెట మొదలైంది. టీనేజ్ సంచలనం మనూ భాకర్ స్వర్ణ పతకాన్ని సాధిస్తే, హీనా సిద్ధు రజత పతకాన్ని అందుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఈ ఇద్దరు భారత షూటర్ల హవా కొనసాగింది. ఒకరితో ఒకరు పోటీపడుతూ ఇద్దరూ అద్వితీయ ప్రతిభ కనబరచారు.

Pages