S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/08/2018 - 01:33

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 7: కుడిఎడమైతే పొరపాటు లేదని, ఓడిపోరని అన్నాడో సినీ కవి. కానీ, అలా జరిగితే అది ముమ్మాటికీ పొరపాటే నని, ఓటమి కూడా తప్పదని రుజువు చేశాడో డ్రైవర్. కామనె్వల్త్ గేమ్స్‌లో పోటీపడే వారిని సంబంధిత కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన కీలక బాధ్యతను ఒక డ్రైవర్ సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. దీనితో ఇద్దరు బీచ్ వాలీబాల్ ప్లేయర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

04/08/2018 - 01:32

బీజింగ్, ఏప్రిల్ 7: భారత టెన్నిస్ దిగ్గజం, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించాడు. డేవిస్ కప్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. డేవిస్ కప్‌లో భాగంగా శనివారం రోహన్ బోపన్నతో జోడీ కట్టిన పేస్ చైనా జంట జీ జాంగ్, జిన్ గాంగ్‌పై 5-7, 7-6, 7-6 స్కోరు తేడాతో విజయం సాధించాడు.

04/08/2018 - 01:06

ఐపీఎల్ ఆరంభంలో డ్యాన్సర్ ప్రభుదేవా స్టెప్పులేశాడు. మ్యాచ్‌లు మొదలైతే ఇక అభిమానులూ
ఇలాగే స్టెప్పులేయక తప్పదు. ముంబయ వాంఖడే స్టేడియంలో శనివారం మొదలైన 11వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభోత్సవంలో తన స్టెప్పులతో అలరించిన నటుడు, దర్శకుడు ప్రభుదేవా

04/08/2018 - 01:48

స్పాట్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ శిక్షా కాలాన్ని పూర్తి చేసి, మళ్లీ బరిలోకి దిగడమేగాక, తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఢీకొనడంతో శనివారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మొదలైన 11వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాధాన్యతను సంతరించుకుంది.

04/08/2018 - 00:43

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా), ఏప్రిల్ 7: కామనె్వల్త్ గేమ్స్ వేదికపై తెలుగు తేజం తళుక్కుమంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకట రాహుల్ రాగాల పురుషుల 85 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించి, తెలుగు వారి సత్తాని అంతర్జాతీయ పోటీల్లో చాటాడు. 2013 ఆసియా యూత్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించి, అందరి దృష్టిని ఆకట్టుకున్న అతను 2014 యూత్ ఒలింపిక్స్‌లో 77 కిలోల విభాగంలో పోటీపడి రెండో స్థానంలో నిలిచాడు.

04/07/2018 - 04:46

గోల్డ్ కోస్ట్: టీనేజర్ దీపక్ లాథర్ ఇక్కడ జరుగుతున్న కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించడంతోపాటు కొత్త రికార్డు నెలకొల్పాడు. పురుషుల 69 కిలోల విభాగంలో పోటీకి దిగిన అతను మొత్తం 295 కిలోల బరువునెత్తి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున కామనె్వల్త్‌లో పతకం సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా 18 ఏళ్ల దీపక్ రికార్డు పుటల్లో చోటు దక్కించుకున్నాడు.

04/06/2018 - 23:40

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 6: కామనె్వల్త్ గేమ్స్ మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ హవా కొనసాగుతున్నది. తొలి రోజైన గురువారం సయ్‌ఖోమ్ మీరాబాయ్ చాను 48 కిలోల విభాగంలో కొత్త మీట్ రికార్డు నెలకొల్పి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న సంజిత చాను భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించింది.

04/06/2018 - 23:36

ముంబయి, ఏప్రిల్ 6: ప్రపంచ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్ మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. స్పాట్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకొని మళ్లీ రంగ ప్రవేశం చేయడంతో, పదకొండవ ఐపీఎల్ కొత్త రూపాన్ని సంతరించుకుంది.

04/06/2018 - 23:34

వెన్నుముక గాయంతో బాధపడుతున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబదా ఈసారి ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఇతను ఐపీఎల్‌లో ఆడాల్సి ఉంది.

04/06/2018 - 23:32

ముంబయి, ఏప్రిల్ 6: ఈ ఏడాది ఐపీఎల్ విజేత ఎవరంటే? ఆగండాగండీ. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే విజేత ఎవరో ఎలా తలుస్తుంది అనే కదా మీ సందేహం. మీ అనుమానం నిజమే. కానీ, ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా ఎవరు నిలుస్తారో ఓ జ్యోతిష్కుడు గ్రీన్ స్టోన్ లోబో చెప్పాడు. అనుభవజ్ఞులైన కెప్టెన్లను కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు విజేతగా నిలిచే అవకాశం లేదని చెప్పాడు లోబో..

Pages