S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/19/2016 - 08:27

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 18: ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ వేసిన బంతి ధాటికి హెల్మెట్ ఎగిరి పడినప్పటికీ గాయం కాకుండా తప్పించుకోవడం తన అదృష్టమని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ బ్యాట్స్‌మన్ జార్జి బెయిలీ వ్యాఖ్యానించాడు. అది భయానకమైన బౌన్సరనీ, ఒక ట్రక్కు వేగంగా వచ్చి గుద్దుకున్నట్టు అనిపించిందని ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ చెప్పాడు.

05/19/2016 - 08:25

లండన్, మే 18: రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాను నాలుగు సంవత్సరాలు నిషేధిస్తున్నట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది. ఆమె నిషిద్ధ ద్రవ్యమైన మెల్డోనియంను వాడినట్టు డోపింగ్ పరీక్షలో వెల్లడైన విషయం తెలిసిందే. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) కంటే ముందే ఉత్ప్రేరకం వాడిన విషయాన్ని షరపోవా విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

05/19/2016 - 08:24

కున్హాన్ (చైనా), మే 18: ఉబెర్ కప్ మహిళల టీం చాంపియన్‌షిప్ బాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరగా, పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరుగుతున్న పోరులో భారత్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసి నిష్క్రమించింది. బుధవారం నాటి పోటీల్లో భారత మహిళల జట్టు కూడా ఓటమిపాలైంది. అయితే, అంతకు ముందు వరుసగా రెండు విజయాలను సాధించడంతో క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.

05/19/2016 - 08:23

లండన్, మే 18: డోప్ దోషులకు రియో ఒలింపిక్స్‌లో స్థానం లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 31 మంది డోపింగ్ పరీక్షలో పట్టుబడినట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) చేసిన ప్రకటనపై అతను స్పందిస్తూ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అన్నాడు.

05/19/2016 - 08:22

శ్రీకాకుళం, మే 18: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జాతీయ క్రీడల నిర్వాహణకు శాప్ పాలకమండలి కసరత్తు ప్రారంభించింది. రాష్టమ్రంతటా జిల్లాలవారీగా నిర్వహిస్తున్న పర్యటనలో భాగంగా బుధవారం ఇక్కడ కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ (శాప్) అధ్యక్షుడు పిఆర్ మోహన్ అధ్యక్షతన 7వ పాలకమండలి సమావేశం జరిగింది.

05/19/2016 - 08:21

లీడ్స్, మే 18: ఇంగ్లీష్ కౌండీల్లో మిడిల్‌సెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ స్మిత్‌కు శ్రీలంకతో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టులో ఆడే తుది 11 మంది జాబితాలో స్థానం దక్కింది. ఇప్పటి వరకూ ఒక్క టెస్టు కూడా ఆడని జేమ్ బాల్‌కు అవకాశం లభిస్తుందన్న వార్తలు వినిపించాయి. అయితే, చివరి క్షణాల్లో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకొని, ఫిన్‌ను ఎంపిక చేశారని సమాచారం.

05/18/2016 - 04:49

కతార్‌లోని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రంలో శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరెరాను డోపింగ్ దోషిగా పేర్కోవడం, ఆ తర్వాత పొరపాటు జరిగిందంటూ కేసును ఉపసంహరించుకోవడం క్రికెట్ రంగంలో దుమారం రేపుతోంది. డోపింగ్ కేంద్రం నిర్వాకం కారణంగా కుశాల్ అత్యంత కీలకమైన సమయాన్ని కోల్పోయాడని, అతని ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్నదని శ్రీలంక బోర్డు అంటున్నది.

05/18/2016 - 04:47

కన్హాన్ (చైనా), మే 17: ఉబెర్ కప్ మహిళల టీం చాంపియన్‌షిప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్స్ దిశగా మరో
అడుగు ముందుకే
సింది.

05/18/2016 - 04:45

కరాచీ, మే 17: పాకిస్తాన్‌లో పిచ్‌ల తీరు అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితి కొనసాగితే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను అందించడం కష్టమని మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ అన్నాడు. పాకిస్తాన్ కప్ చాంపియన్‌షిప్ జరుగుతున్న తీరే పిచ్‌ల తీరుకు అద్దం పడుతుందని ఇటీవలే పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్‌గా నియమితుడైన ఇంజీ పేర్కొన్నాడు.

05/18/2016 - 04:44

బెంగళూరు, మే 17: రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లే ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఎడమ చేతికి బలమైన గాయం తగిలింది. చేతి బొటనవేలు, చూపుడు వేలుకు మధ్య ఉన్న భాగం చిట్లడంతో ఏడెనిమిది కుట్లు కూడా వేశారు.

Pages