S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/06/2018 - 00:05

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే ఎన్నో చిత్రాలకు నెలవు. ఎవరూ ఊహించని వారు కొందరు అద్భుతంగా రాణిస్తే, సత్తా చాటుతారనుకున్న ఎంతో మంది విఫలమై అభిమానులను నిరాశపరచడం ఆనవాయతీగా వస్తున్నది. 11వ ఐపీఎల్‌లో ఇంకెన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ నేపథ్యంలో, సరదాగా నెమరేసుకోవడానికి గతంలో నమోదైన కొన్ని రికార్డులు..
బంతులు మింగేసి..

04/05/2018 - 12:14

గోల్డ్‌ కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారు. పోటీలు ప్రారంభమైన తొలిరోజు భారత్‌ తొలి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 48 కిలోల విభాగంలో మీరాబాయ్‌ ఛాను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అటు పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నారు.

04/05/2018 - 00:34

చిత్రం: భారత బృందంలోని మహిళలు మార్చ్ ఫాస్ట్‌లో సంప్రదాయబద్ధంగా చీరలు ధరించేవారు. అయితే, ఆ ఆనవాయితీకి ఈసారి పీసీ సింధు నేతృత్వంలో మార్చ్ ఫాస్ట్‌కు హాజరైన భారత మహిళా అథ్లెట్లు వీడ్కోలు పలికారు. నడవడానికి
అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వారు ట్రౌజర్లు, బ్లేజర్లు వేసుకున్నారు.

04/09/2018 - 12:05

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 4: ‘మినీ ఒలింపిక్స్’గా పిలిచే కామన్వెల్త్ గేమ్స్ బుధవారం ఆస్ట్రేలియాలోని గోల్ కోస్ట్‌లో ప్రారంభమయ్యాయి. తెలుగు తేజం పీవీ సింధు చేతిలో త్రివర్ణ పతకారం రెపరెపలాడుతుండగా, భారత బృందం ఆమె వెనకే మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొంది. ఒకప్పటి బ్రిటిష్ పాలన కింద ఉండి, ఆతర్వాత స్వాతంత్య్రం పొందిన 71 కామనె్వల్త్ దేశాల మధ్య జరిగే ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది.

04/05/2018 - 00:17

గోల్డ్ కోస్ట్: కామనె్వల్త్ గేమ్స్‌కు బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నేతృత్వంలో భారత్ మొత్తం 220 మందితో కూడిన భారీ బృందాన్ని బరిలోకి దింపింది. వీరిలో 115 మంది పురుషులు, 105 మంది మహిళలు.

04/05/2018 - 00:38

భార్య ప్రపంచస్థాయి పోటీలో పాల్గొంటుంటే..్భర్త స్వదేశంలో ప్రతిష్ఠాతక టోర్నీల్లో ఆడనున్నారు. వారే..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ ఎడిషన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా సారధ్యం వహిస్తున్న దినేష్ కార్తీక్ కాగా, అతని భార్య దీపికా పల్లికల్ స్క్వాష్ పోటీల్లో ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామనె్వల్త్ గేమ్స్‌లో పోటీ పడనుంది.

04/05/2018 - 00:13

మెల్‌బోర్న్, ఏప్రిల్ 4: దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ఘటనలో ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ తమపై విధించిన నిషేధంపై ఎలాంటి ఛాలెంజ్‌లు చేయబోమని స్పష్టం చేశారు. వీరిద్దరితోపాటు డేవిడ్ వార్నర్‌పై కూడా నిషేధం ఉండడంతో దీనిపై అపీలు చేసుకోవడానికి వారి ఈనెల 11వ తేదీ వరకు గడువు ఉంది.

04/05/2018 - 00:43

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 4: ఆస్ట్రేలియా బాక్సర్ తైలా రాబర్ట్‌సన్ ఇంకా కామనె్వల్త్ గేమ్స్‌లో రింగ్‌లోకి దిగలేదు. ఫైట్ చేయలేదు. కానీ, పతకాన్ని మాత్రం ఖాయం చేసుకుంది. మహిళల 51 కిలోల విభాగంలో పోటీదారులు తక్కువ మంది ఉండడం ఆమెకు కలిసొచ్చిన అంశం. దీనికితోడు గ్రూప్ దశలో బై లభించడంతో ఆమె రింగ్‌లో అడుగుప్టెకుండానే నేరుగా సెమీ ఫైనల్ చేరింది.

04/04/2018 - 03:39

గోల్డ్ కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో బుధవారం నుంచి 21వ కామనె్వల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంకా అమ్ముడుపోని టికెట్లపై నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. క్రీడా పోటీల నిర్వాహకులతోపాటు క్వీన్‌లాండ్ మినిస్టర్ కటే జాన్స్ తదితరులు ఏర్పాట్లలో ఎంతో బిజీగా ఉన్నారు.

04/04/2018 - 03:10

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 3: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని ముగ్గురు కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన ఒక మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వివాదం ఇపుడు ఇదే దేశంలో బుధవారం ప్రారంభం కానున్న కామనె్వల్త్ గేమ్స్‌పై ప్రభావం చూపవచ్చునని ఇక్కడి విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Pages