S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/04/2018 - 03:00

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కామనె్వల్త్ క్రీడా గ్రామంలో తన తండ్రి హర్వీర్ సింగ్‌ను అనుమతించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటానని ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ హెచ్చరించింది. ఈ మేరకు ఆమె భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతాకు లేఖ రాసింది. తన తండ్రికి అక్రిడేషన్ కల్పించాలని సైనా ఆ లేఖలో కోరారు. ఈ లేఖకు స్పందించిన ఐఓఏ సైనా తండ్రిని కామనె్వల్త్ క్రీడలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.

04/04/2018 - 02:57

జోహానె్నస్‌బర్గ్, ఏప్రిల్ 3: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వివాదం ఆ దేశ జట్టును ఇంకా వేధిస్తూనే ఉంది.

04/04/2018 - 02:57

చెన్నై, ఏప్రిల్ 3: రెండేళ్లపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లకు దూరమైన చెన్నైవాసులు ఈ ఏడాది 11వ సీజన్ పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ఇక్కడి చెపాక్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈనెల 7వ తేదీన ముంబై వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి.

04/04/2018 - 02:55

కోల్‌కతా, ఏప్రిల్ 3: ఈనెల 7వ తేదీ నుండి జరుగనున్న ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ దోనీ, విరాట్ కోహ్లీ వికెట్లు తీయడమే తన లక్ష్యమని అంటున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువ బౌలర్. ఇంతకీ అతడెవరో తెలుసా.. భారత మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్ యాదవ్. టీమిండియా తరపున ఒకే జట్టులో ఆడిన కుల్‌దీప్‌కు ఐపీఎల్ ద్వారానే కదా ధోనీ, కోహ్లీ వికెట్లు తీసే అవకాశం వస్తుంది.

04/04/2018 - 02:54

ముంబయి, ఏప్రిల్ 3: త్వరలో ఆరంభం కానున్న ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్.. స్మిత్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌ను తీసుకుంది. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్మిత్, వార్నర్‌పై 12 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆ జట్టు సారథ్య బాధ్యతను తొలుత అజింక్య రహానేకు అప్పగించిన సంగతి విదితమే.

04/04/2018 - 04:16

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత్‌పై విషం చిమ్మాడు. కాశ్మీర్‌పై భారత్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోయాడు. కాశ్మీర్‌లో అమాయక పౌరులు భారత తూటాలకు బలవుతున్నా, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

04/03/2018 - 02:44

గోల్డ్ కోస్ట్: స్థానిక మహిళా వెయిట్‌లిఫ్టర్ల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమైనప్పటికీ, కామనె్వల్త్ గేమ్స్‌లో లారెల్ హబార్డ్‌ను నిర్వాహకులు మహిళల విభాగంలో పోటీకి అనుమతించారు. 3ట్రాన్స్ జెండర్2గా తనను తాను ప్రకటించుకున్న హబార్డ్‌ను మహిళగానే గుర్తిస్తున్నామని కామనె్వల్త్ గేమ్స్ నిర్వాహణ కమిటీ (ఓసీ) చీఫ్ ఎగ్జిక్యూవ్ డేవిడ్ గ్రెవెంబర్గ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు.

04/03/2018 - 00:38

న్యూఢిల్లీలో సోమవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. రాష్టప్రతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అతను మిలటరీ దుస్తులతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ అవార్డు స్వీకరించిన రెండవ భారత క్రికెటర్‌గా ధోనీ చరిత్రపటంలో నిలిచాడు. ఇంతకుముందు కపిల్‌దేవ్ ఈ అవార్డును తీసుకున్నాడు.

04/03/2018 - 00:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌పై చాలా భారం పడనుంది.

04/03/2018 - 00:43

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 2: ఒక బాక్సర్‌కు కాదు.. ఒక దేశం మొత్తంలోనే రెండే రెండు బాక్సింగ్ గ్లోవ్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీపమైన కిరిబాటీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. బాక్సింగ్ పట్ల యువతీయువకులు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ, వారికి శిక్షణ ఇచ్చేందుకు అక్కడ బాక్సింగ్ రింగ్ లేదు.

Pages