S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/02/2018 - 01:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: క్రికెట్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టన్ ఇయాన్ చాపెల్ స్పందించాడు. ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడం కఠిన చర్యగా ఆయన అభిప్రాయపడ్డాడు. వివాదం తర్వాత స్మిత్‌పై 12 నెలలు నిషేధం విధించారని తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నత విలువల కోసం స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించింది.

04/02/2018 - 01:04

ఢిల్లీ, ఏప్రిల్ 1: పేసర్ మహ్మద్ షమీని ఐపీఎల్ నుంచి తప్పించాలని అతని భార్య హసీన్ జహాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈవో హేమంత్ దువాను కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం దువాను కలిశారు. ఈ విషయాన్ని హసీన్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘షమీ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి హేమంత్ సార్‌కు వివరించాను. నాకు న్యాయం జరిగేవరకూ అతనిని ఐపీఎల్ నుంచి నిషేధించాల్సింగా కోరాను’ అని ఆమె తెలిపింది.

04/01/2018 - 04:55

ముంబయి: మహిళల టీ-20 ట్రై సిరీస్‌ను అందరూ ముందు ఊహించిన విధంగానే, హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచిన ఆసీస్ 57 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. మెగ్ లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.

04/01/2018 - 00:55

సిడ్నీ, మార్చి 31: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భవిష్యత్తులో తాను ప్రాతినిథ్యం వహించే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదని, అందుకే, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కాంట్రాక్టు నుంచి వైదొలగుతున్నానని బాల్ ట్యాంపరింగ్ దోషి డేవిడ్ వార్నర్ ప్రకటించాడు. తనను క్షమించాలని శనివారం ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన కిక్కిరిసిన విలేఖరుల సమావేశంలో అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

04/01/2018 - 00:36

సిడ్నీ, మార్చి 31: దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి, పరువుతోపాటు కెప్టెన్సీని కూడా పోగొట్టుకొని, ఏడాది సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న స్మిత్ తన నేరాన్ని అంగీకరిస్తూ విలేఖరుల సమావేశంలో పలుమార్లు బిగ్గరగా రోదిస్తే, ఆ సంఘటన సూత్రధారి డేవిడ్ వార్నర్ కూడా అతని మాదిరిగానే ఉద్వేగాన్ని ఆపుకోలేక పదేపదే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

04/01/2018 - 00:35

హైదరాబాద్, మార్చి 31: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌ను తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల సంఘం ఈ ఏడాదికి ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపిక చేసింది. ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు, క్రీడాకారుడిగా కిడాంబి శ్రీకాంత్‌కు అవార్డులను ప్రకటించింది.
బీసీసీఐపై సీఓఏ పట్టు!

04/01/2018 - 00:32

ఢిల్లీ, మార్చి 31: మెగా ఐపీఎల్ టర్నీ ఆడే అవకాశం కోసం ఎందరో క్రికెటర్లు ఆశగా ఎదురుచూస్తారు. కానీ, ఓ ఆటగాడు తన కాళ్ల వద్దకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరనే కదా మీ సందేహం... అతనే శ్రీలంక బ్యాట్స్‌మన్ కుశాల్ పేరీరా... బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో సన్‌రైజర్స్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 12 నెల సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.

04/01/2018 - 01:11

సిడ్నీ, మార్చి 31: భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ బౌలర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. అతను బ్యాట్‌తో కాకుండా బాల్‌తో కనిపించడం టీమిండియా కోసమో లేక ఐపీఎల్ కోసమో అనుకుంటే పొరపాటే. తన భార్య అయేషా కోరడంతో, ధావన్ తనకు అలవాటు లేని బౌలింగ్‌కు దిగాడు. ప్రస్తుతం 3గబ్బర్2 ధావన్ తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి అతను ఇటీవలే ఓ బీచ్‌లో సరదాగా గడిపాడు.

04/03/2018 - 10:37

చెన్నై, మార్చి 31: అర్జున అవార్డు గ్రహీత సౌరవ్ గోశల్, దీపికా పల్లీకల్, కార్తీక్ తదితరులతో కూడిన తొమ్మిది మంది సభ్యులుగల భారత స్క్వాష్ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌కు పయనమైంది. ఈనెల 4నుంచి 15వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం ఈ జట్టు ఇండియన్ స్క్వాష్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకుంది.

04/01/2018 - 00:27

న్యూఢిల్లీ, మార్చి 31: కామనె్వల్త్ గేమ్స్‌లో మొట్టమొదటిసారి పాల్గొనేందుకు సిద్ధమవుతున్న టీనేజర్లు మనూ భాకర్, శ్రీహరి నటరాజ్ ఇక్కడ జరిగిన ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్‌లో సత్తా చాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మనూ 241.1 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించి, స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ విభాగంలో, గత ఏడాది డిసెంబర్‌లో 240.5 పాయింట్లతో తాను నెలకొల్పిన రికార్డును తానే అధిగమించింది.

Pages