S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/31/2018 - 13:59

సిడ్నీ: నా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. నాపై మీ గౌరవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాను’ అని బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో కీలకపాత్ర పోషించిన ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యాడు. జీవితంలో తానెప్పటికీ ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడలేమోనని వార్నర్‌ బాధపడ్డాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

03/31/2018 - 04:13

కీ బిస్కెన్‌: కీ బిస్కెన్‌లో జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో విక్టోరియా అజరెన్కాను 3-6, 6-2, 6-1 తేడాతో ఓడించి, పైనల్‌కు దూసుకెళ్లిన స్లొయెన్ స్టెఫెన్స్ ఆనందం. టైల్ కోసం ఆమె జెలెనా ఒస్టాపెన్కోను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో ఒస్టాపెన్కో 7-6, 6-3 ఆధిక్యంతో డానియెల్ కొలిన్స్‌పై గెలిచింది.

03/31/2018 - 01:05

చిత్రం: ఆస్ట్రేలియాలో జరిగిన షూటింగ్ జూనియర్ వరల్డ్ కప్ మహిళల 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించి, శుక్రవారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న షూటర్ ఎలవెనిల్ వలారివన్. అధికారులు,
అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

03/31/2018 - 01:15

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా), మార్చి 30: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పేరు ఎట్టకేలకు కామనె్వల్త్ గేమ్స్ అధికారిక జాబితాలో కనిపించడంతో, అంత వరకూ నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. తొలుత గేమ్స్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించిన భారత బృందంలో సుశీల్ పేరు కనిపించలేదు. దీనితో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

03/31/2018 - 01:08

న్యూఢిల్లీ, మార్చి 30: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాల్సిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచల్ స్టార్క్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. కుడి కాలి గాయంతో బాధపడుతున్న అతనిని శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో మొదలైన చివరి, నాలుగో టెస్టు నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు విశ్రాంతినిచ్చారు.

03/31/2018 - 00:36

న్యూఢిల్లీ, మార్చి 30: స్పాట్ ఫిక్సింగ్ కేసులో రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొని, తిరిగిన ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కు తాను తిరిగి రావడంపై భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆనందం వ్యక్తం చేశాడు. చెన్నైకు దూరం కావడం తనను ఎంతో బాధించిందని అంటూ అతను ట్వీట్ చేసిన వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

03/31/2018 - 01:07

క్రైస్ట్‌చర్చ్, మార్చి 30: న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో అజేయంగా 97 పరుగులు చేసి, సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో నిలిచాడు. అతని ప్రతిభకు మార్క్ ఉడ్ అర్ధ శతకం కూడా జత కలవడంతో ఇంగ్లాండ్ కోలుకుంది.

03/31/2018 - 00:33

ఒర్లెన్స్ (ఫ్రాన్స్), మార్చి 30: ఫ్రాన్స్‌లోని ఒర్లెన్స్‌లో జరుగుతున్న ఓపెన్ వరల్డ్ సూపర్ 100 బాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్స్ కశ్యప్, సమీర్ వర్మ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఐదో సీడ్ క్రీడాకారుడు కాశ్యప్ గత వారం ఆస్ట్రేలియాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

03/31/2018 - 00:31

ముంబయి, మార్చి 30: మహిళల క్రికెట్ టీ-20 ట్రై సిరీస్ చివరి ఘట్టానికి చేరుకుంది. శనివారం జరిగే ఆఖరి పోరులో సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఢీ కొంటున్న నేపథ్యంలో, టైటిల్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది.

03/31/2018 - 00:30

న్యూఢిల్లీ, మార్చి 30: బంతి ఆకారాన్ని మార్చినందుకు ఏడాది సస్పెన్షన్‌కు గురైన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నుంచి పూర్తి మద్దతు లభించింది. శుక్రవారం పీటీఐతో మాట్లాడిన అతను ప్రజల వైఖరిపై ధ్వజమెత్తాడు. స్మిత్ ఏడిస్తే చూడాలని చాలా మంది అనుకున్నారని, వారి కోరిక తీరిందనీ వ్యాఖ్యానించాడు.

Pages