S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/29/2018 - 01:15

కీ బిస్కేన్‌లో జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చెక్ రిఫబ్లిక్‌కు చెందిన కరోలినా ప్లిస్కోవాను 7-5, 6-3 తేడాతో ఓడించి సెమీస్ చేరిన విక్టోరియా అజరెన్కా. మరో మ్యాచ్‌లో ఏంజెలిక్ కెర్బర్‌పై 6-1, 6-2 ఆధిక్యంతో వరుస సెట్లలో విజయం సాధించిన స్లొయేన్ స్టెఫెన్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-10’లోకి దూసుకెళ్లింది.

03/29/2018 - 01:16

ఈ ఏడాది ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేసిన బీసీసీఐ
స్మిత్, వార్నర్ స్థానాల్లో వేరే ఆటగాళ్లను తీసుకోవడానికి ఆయా ఫ్రాంచైజీలకు అవకాశం ఉంటుంది. అయితే, రీప్లేస్‌మెంట్స్ గురించి అటు రాజస్థాన్‌గానీ, ఇటు సన్‌రైజర్స్‌గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

03/29/2018 - 00:49

జొహానె్నస్‌బర్గ్, మార్చి 28: విజయాలు సాధించేందుకు ఏ మార్గాలను అనుసరించడానికైనా ఆస్ట్రేలియా క్రికెటర్లు సిద్ధమవుతారని బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో మరోసారి స్పష్టమైంది. నిజానికి దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బయలుదేరినప్పుడే, గెలవడమే లక్ష్యమని, అందుకోసం స్లెడ్జింగ్‌కు దిగాలనీ జట్టు సభ్యులకు స్టీవెన్ స్మిత్ బహిరంగంగానే సూచించాడంటే, ఆసీస్ తీరును అర్థం చేసుకోవచ్చు.

03/29/2018 - 00:47

సిడ్నీ, మార్చి 28: భవిష్యత్తులో ఎన్నడూ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలే లేవని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతానికి రూపకల్పన చేసింది అతనేనని మీడియాలో వార్తలు రావడంతో, సీఏ ఈ నిర్ణయానికి వచ్చింది.

03/29/2018 - 00:46

జొహానె్నస్‌బర్గ్, మార్చి 28: బాల్ ట్యాంపరింగ్ కేసులో సూత్రధారి డేవిడ్ వార్నర్‌పై ఆస్ట్రేలియా జట్టులోని అతని సహచరులు మండిపడుతున్నారు. జట్టు పరువు తీశాడన్న కోపం ఒకవైపు, ఒకవైపు విచారణ జరుగుతుంటే, మరోవైపు వార్నర్ హోటల్‌లో తన స్నేహితులతో కలిసి షాంపైన్ పార్టీ చేసుకోవడం మరోవైపు వారిని తీవ్ర అసహనానికి గురి చేసింది.

03/29/2018 - 01:17

ఢాకా, మార్చి 28: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఊరికే అనలేదు. క్రికెట్ బెట్టింగ్‌లో ఓడిపోయి, తనను ఎవరో మర్డర్ చేసినట్టు నకిలీ వీడియో తీయించి, దానికి విపరీతమైన ప్రచారం కల్పించిన ఓ యువకుడి ప్రయత్నం బెడిసికొట్టింది. మర్డర్ ప్లాన్ ఫ్లాప్ కావడంతో అతను ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.

03/29/2018 - 01:19

జొహానె్నస్‌బర్గ్, మార్చి 28: బాల్ ట్యాంపరింగ్ కేసులో దోషులైన స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ స్వదేశానికి బయలుదేరారు. తక్షణమే వెనక్కు తిరిగి రావాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదేశించడంతో, జట్టుతో కలిసి ఉండే అవకాశాన్ని వారు కోల్పోయారు.

03/29/2018 - 00:42

న్యూఢిల్లీ, మార్చి 28: ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో త్వరలో మరో భారత క్రికెటర్‌కు చోటుదక్కనుంది. ఇప్పటికే ఈ మ్యూజియంలో బాలీవుడ్, హాలీవుడ్‌తోపాటు ఎంతోమంది క్రీడాకారులు, రాజకీయ ఉద్ధండులకు చోటు దక్కింది.

03/29/2018 - 00:41

ముంబయి, మార్చి 28: ఇక్కడి బ్రబోర్న్ స్టేడియంలో బుధవారం జరిగిన మహిళల టీ-20 ముక్కోణపు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతోనే ఇంగ్లాండ్‌పై పరాజయాన్ని చవిచూసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇంగ్లాండ్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది.

03/29/2018 - 00:40

సిడ్నీ, మార్చి 28: ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఇప్పటికే ఈ విభాగంలో భారత్ ఐదు కాంస్య, ఎనిమిది రజత పతకాలు చేజిక్కించుకోగా తాజాగా గోల్డ్ మెడల్ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.

Pages