S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/20/2018 - 02:50

కోల్‌కతా, మార్చి 19: టీమిండియా పేసర్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోణలు చేసి పెను కలవరం రేపింది అతని భార్య హసిన్ జహాన్. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ అదేశాలానుసారం రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు హసీన్‌ను విచారణలో భాగంగా వివిధ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

03/20/2018 - 02:46

న్యూఢిల్లీ, మార్చి 19: టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి పాకిస్తాన్ యువతి ఆలిషబాతో సంబంధమున్నట్లు ఆమె ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అతని భార్య హసీన్ జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దక్షిణాఫ్రికా పర్యటనంతరం షమీ నేరుగా భారత్‌కు రాకుండా దుబాయ్‌లో అలిషబాను కలిసాడని జహాన్ మీడియాకు వివరించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలో కీలకంగా మారిన అలిషబా స్పందిస్తూ ఈ ఆరోపణలను కొట్టిపడేసింది.

03/20/2018 - 02:43

కొలంబో, మార్చి 19: భారత్‌తో ఆదివారం జరిగిన నిదహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీ ఫైనల్ పోరులో తమ జట్టు పరాజయం పాలవడంతో బాధపడాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాకీబ్ అల్ హసన్ అన్నాడు. ఎక్కడ తప్పులు జరిగాయో గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని, భవిష్యత్‌లో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని అన్నాడు.

03/19/2018 - 13:06

కొలంబోః ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ చివర్లో వచ్చిన కార్తీక్ మెరుపులు మెరిపించారు. ఒక దశలో భారత్ గెలుపు దాదాపు అసాధ్యమే అనుకున్నారంతా. కానీ దినేష్ కార్తీక్ కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేశాడు. చివరి బంతికి సిక్స్ మొత్తం మ్యాచ్‌కే హైలైట్. టీమిండియా గెలవాలంటే చివరి బాల్‌కు 5 పరుగులు చేయాల్సి ఉంది. ఫోర్ కొడితే సూపర్ ఓవర్.

03/19/2018 - 00:41

శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన నిదహాస్ ట్రోఫీ టీ-20 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. భారత్-బంగ్లాదేశ్‌తోపాటు పోటీలకు ఆతిథ్యమిచ్చిన శ్రీలంక జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్‌తోపాటు బంగ్లాదేశ్ ఫైనల్ చేరుకున్నాయి.

03/19/2018 - 00:39

టీమిండియా మహిళల క్రికెట్ జట్టుకు స్వదేశంలోనే వైట్ వాష్ తప్పలేదు. మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా పరువు నిలబెడతారనుకున్న అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో గెలుపుతో ఆస్ట్రేలియా సిరీస్‌ను గెల్చుకోగా, ఫైనల్స్‌లోనూ 97 పరుగుల ఆధిక్యంతో భారత జట్టును ఓడించడం ద్వారా ఆ జట్టుదే పైచేయి అయింది.

03/19/2018 - 00:36

ముంబయి, మార్చి 18: ఇజ్రాయిల్‌లోని రిషోన్ లెజియన్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఇజ్రాయిల్ జూనియర్ 2018 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ (అండర్-19)లో భారత డిఫెండింగ్ చాంపియన్ పూర్వ బారే టైటిల్ దక్కించుకుంది.

03/18/2018 - 03:25

లండన్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ క్రికెట్ లీగ్ క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున లాహోర్‌లో ఆడుతున్నాడు.

03/18/2018 - 02:20

కొలంబో, మార్చి 17: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న నిదహాస్ టీ-20 ముక్కోణపు టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో విజయం సాధించి, ఒక దాన్లో ఒటమిని చవిచూసి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

03/18/2018 - 02:17

వడోదర, మార్చి 17: ఐసీసీ మహిళల వనే్డ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మూడు వనే్డలలో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమి చెందడంతో సిరీస్ ప్రత్యర్థి వశమైంది. ఇక ఆదివారం జరిగే మూడోది, ఆఖరిది అయిన మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుకు నామమాత్రమే అయినా భారత్‌కు పరువు నిలిపేదిగా ఉంది.

Pages