S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/18/2018 - 02:13

న్యూఢిల్లీ, మార్చి 17: తన భార్య చేస్తున్న ఆరోపణలతో సతమతమవుతున్న టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీకి ఎట్టకేలకు స్వల్ప ఉరట లభించింది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరపున అడే షమీ ఈ ఏడాది లీగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో షమీ కెరీర్ ఇక ముగిసినట్లే అని అందరూ భావించారు. కానీ ఈ వార్తలను తారుమారు చేస్తూ..షమీ ఐపీఎల్‌లో అడేందుకు పాలకమండలి అనుమతిచ్చింది.

03/18/2018 - 02:10

కోల్‌కతా, మార్చి 17: ఉపఖండంలో క్రికెట్‌కు జీవం పోసిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్ దాల్మియాపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘ఎ ట్రిబ్యూట్ టు జగ్గూ’ శీర్షికతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సమతిపాలా మాట్లాడుతూ దాల్మియాను హీరోగా అభివర్ణించారు.

03/18/2018 - 02:10

కొలంబో, మార్చి 17: నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల తీరుపై శ్రీలంక క్రికెట్ చీఫ్ తిలింగా సుమతిపాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగా అంపైర్ల నిర్ణయం పట్ల బంగ్లా ఆటగాళ్లు వ్యవహరించిన తీరు ఆహ్వానించదగినది కాదని, విచారకరమైన ఘటనగా ఆయన అభివర్ణించాడు.

03/18/2018 - 02:09

బర్మింగ్‌హామ్, మార్చి 17: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది. ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి జపాన్‌కు చెందిన యమగూచి ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో మూడో సీడ్ సింధు 21-19, 19-21, 18-21 తేడాతో ప్రత్యర్థి రెండో సీడ్ యమగూచి చేతిలో ఓటమిపాలైంది.

03/17/2018 - 03:22

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో ఒకటిన్నర దశాబ్దం క్రితం జరిగిన టెస్టులో చారిత్రాత్మక ఇన్నింగ్స్ తనకు జీవితంలో ఎంతో నేర్పిందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ వివరించాడు. ఆ ఇన్నింగ్స్ తనతోపాటు పలువురి జీవితాలనే మార్చివేసిందని, క్లిష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలో నేర్పిందని అన్నాడు. ఒక ఇంటర్యూలో లక్ష్మణ్ పలు అంవాలను స్పృశించాడు.

03/17/2018 - 01:21

బర్మింగ్‌హోమ్, మార్చి 16: ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌కు ప్రవేశించింది. శుక్రవారం హోరా హోరిగా సాగిన మహిళల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.

03/17/2018 - 01:18

న్యూఢిల్లీ, మార్చి 16 : భారతీయ గోల్ఫ్ అభిమానుల్లో శుభాంకర్ శర్మ సరికొత్త ఆశలు నింపుతున్నాడు. గత నవంబర్‌లో ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగుల్లో 521వ స్థానంలో ఉన్న శర్మ తక్కువ కాలంలోనే 64వ స్థానానికి ఎగబాకడం ఇందుకు కారణం. తన ర్యాంకును 50లోపుకు తీసుకెళ్లాలన్నది అతగాడి తక్షణ లక్ష్యం.

03/17/2018 - 01:16

బర్మింగ్‌హామ్, మార్చి 16: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ నుంచి భారత అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఇంటి ముఖం పట్టాడు. గత ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్ నుంచే వెనుదిరుగుతాడని భారత అభిమానులు ఊహించలేదు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌కోసం రేసులో ఉన్న ఆటగాళ్లలో శ్రీకాంత్ ఒకడు.

03/17/2018 - 01:15

బర్మింగ్‌హామ్, మార్చి 16 : సర్వీస్ ఫాల్ట్‌ల పేరుతో తాను మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చిందని ప్రపంచంలో మూడో నెంబరు ఆటగాడు కిడాంబి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో చైనా ఆటగాడు హువాంగ్ యుగ్జియాంగ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సర్వీసులో వరుసగా తన సర్వీసులను అంపైర్ తప్పు పట్టడంపై శ్రీకాంత్ అసహనానికి గురయ్యాడు.

03/17/2018 - 01:15

ఢిల్లీ, మార్చి 16: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా లక్షలాది లీటర్ల నీటిని వృధా చేస్తున్నారని, దానిని అరికట్టాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలైంది. వాణిజ్యపరంగా క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం లక్షల లీటర్ల నుంచి నీరు వృధా చేసే అవకాశాలున్నాయని అందుకే ఐపీఎల్‌ను అడ్డుకోవాలని ఓ వ్యక్తి వేసిన వ్యాజ్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించింది.

Pages