S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/17/2018 - 01:15

కొలంబో, మార్చి 16: ప్రతిష్టాత్మకమైన నిదస్ ట్రోఫీ ముక్కోణపు టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. నిదహాస్ ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక టీ-20లో బంగ్లాదేశ్ జట్టు ఆతిథ్య శ్రీలంకపై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

03/17/2018 - 00:23

కొలంబో, మార్చి 16: ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా టీ-20 కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 61 బంతుల్లో 5 బౌండరీలు, 5 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును అతను బద్దలుగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఐదు సిక్సర్లు బాదిన రోహిత్ టీ-20ల్లో తన సిక్సర్లను 75కి పెంచుకున్నాడు.

03/17/2018 - 00:23

న్యూఢిల్లీ, మార్చి 16: దిగ్గజ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ కోచ్ షేన్‌వార్న్ జట్టు నుంచి అత్యత్తుమ ప్రదర్శిన వెలికితీస్తాడని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తొలి ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్‌ను విజేతగా నిలిపిన వార్న్ సారథ్యంలో కైఫ్ ఆడిన సంగతి తెలిసిందే. షేన్‌వార్న్‌కు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఆటగాడిలో ఎలాంటి సత్తా ఉందో వెంటనే గుర్తిస్తాడు.

03/17/2018 - 01:23

కోల్‌కతా, మార్చి 16: టీమిండియా ఏసర్ మహ్మద్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ గత వారం కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నంతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద షమితో పాటు మరో నలుగురిపై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కాపీని బీసీసీఐకి పంపిన్నట్లు ఆమె తరపు న్యాయవాది జాకీర్ హుస్సేన్ తెలిపారు.

03/17/2018 - 00:22

న్యూఢిల్లీ: టీం ఇండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇతర అమ్మాయిలతో ఆక్రమ సంబంధాలు ఉన్నట్లు, తనపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం చేసినట్లు షమి భార్య హసీన్ జహాన్ ఆరోపించడంతో షమిని కాంట్రాక్ట్ క్రికెటర్ల జాబితాలోంచి బీసీసీఐ తొలగించింది. తాజాగా షమి ఐపీఎల్ భవిష్యత్తుపై కూడా ఈ కేసు ప్రభావం కనిపించే అవకాశం ఉంది.

03/16/2018 - 02:54

బర్మింగ్‌హామ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ రెండోరోజు తెలుగు తేజం, బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దూసుకెళ్తోంది. గురువారం జరిగిన పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన నిట్సాన్ జిందాపోల్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. సింధూ 21-13, 13-21, 21-18 సెట్ల వ్యత్యాసంతో జిందాపోల్‌పై విజయం సాధించింది.

03/16/2018 - 01:26

వడోదర, మార్చి 15: దక్షిణాఫ్రికాపై విజయాలతో జోరుమీదున్న భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న ఐసీసీ చాంపియన్‌షిప్‌లో వనే్డ సిరీస్‌ను చేజార్చుకుంది. తొలి ఓటమిని చవిచూసిన టీమిండియా గురువారం జరిగిన రెండో వనే్డలోనూ ఏమాత్రం ప్రతిఘటించకలేక చతికిలపడింది.

03/16/2018 - 01:21

నాగ్‌పూర్, మార్చి 15: ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పరుగుల రికార్డు బద్దలైంది. విదర్భలో గురువారం విదర్భ, రెస్ట్ఫా ఇండియా జట్ల మధ్య జరిగిన పోరులోని తొలి ఇన్నింగ్స్ మొదటిరోజున 113 పరుగులు, రెండోరోజు జరిగిన మ్యాచ్‌లో 172 పరుగులతో వడోదర జట్టుకు నాయకత్వం వహిస్తున్న 40 ఏళ్ల వసీం జాఫర్ మొత్తం వ్యక్తిగత స్కోరు 285 పరుగులు చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

03/16/2018 - 01:19

కొలంబో, మార్చి 15: నిదహాస్ టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భాగంగా ఆతిధ్య జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు (సెమీ ఫైనల్) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం భారత్‌తో జరిగే టైటిల్ పోరులో తలపడుతుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు చెరో మ్యాచ్‌లో విజయంతో ఉన్నాయి. ఫైనల్‌కు వెళ్లాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

03/16/2018 - 01:19

కొలంబో, మార్చి 15: బంగ్లాదేశ్‌తో బుధవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన నిదహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీలో తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని మూడు ప్రధాన వికెట్లు పడగొట్టిన 18 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌పై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో సుందర్ 22 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లను పడగొట్టి ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు.

Pages