S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/05/2016 - 08:13

సైనా, కశ్యప్ దూరం..
దక్షిణాసియా గేమ్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) తెలిపిందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఇద్దరిని మినహాయస్తే, బాడ్మింటన్ విభాగంలో పోటీపడుతున్న పివి సింధు తదితరులంతా శుక్రవారం ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు.

02/05/2016 - 08:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే టీమిండియా ఎంపిక శుక్రవారం జరగనుండగా, ఎవరికి స్థానం దక్కుతుంది? ఎవరిని దురదృష్టం వెక్కిరిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ యువకులకు పెద్దపీట వేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

02/05/2016 - 08:09

బ్లూంఫొంటెన్ (దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి 4: వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడిన తొలి వనే్డ ఇంటర్నేషనల్‌లో దక్షిణాఫ్రికాను ఇంగ్లాండ్ 39 పరుగుల తేడాతో ఓడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు సాధించింది.

02/05/2016 - 08:08

బార్సిలోనా, ఫిబ్రవరి 4: స్టార్ ఆటగాళ్లు లూయిస్ సౌరెజ్, లియోనెల్ మెస్సీ చెలరేగిపోయి, హ్యాట్రిక్స్‌ను నమోదు చేయడంతో కోపా డెల్ రే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ జట్టు 7-0 తేడాతో వలెన్షియాను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ బార్సిలోనా దాడి కొనసాగింది.

02/05/2016 - 08:08

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళనపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేయాలని బిసిసిఐకి సూచించింది. అయితే, లోధా కమిటీ సిఫార్సులను ఉన్నవి ఉన్నట్టుగా అమలు చేయడం సాధ్యం కాదని శశాంకర్ మనోహర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిసిసిఐ కోర్టుకు స్పష్టం చేసింది.

02/04/2016 - 07:29

ముంబయి: బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌తోపాటు స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే టీమిండియాను సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఈనెల 5వ తేదీన ఎంపిక చేస్తుంది. ఢిల్లీలో జరిగే సమావేశంలో సెలక్టర్లు సమావేశమై, ఆటగాళ్లను ఎంపిక చేస్తారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాలు తెలిపాయి.

02/04/2016 - 07:27

లూథియానా: భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అయితే, తాను నిర్దోషినని, ఎలాంటి తప్పు చేయలేదని సర్దార్ స్పష్టం చేశాడు. బ్రిటిష్ మహిళా హాకీ జట్టులో సభ్యురాలిగా ఉన్న భారత సంతతికి చెందిన ఒక క్రీడాకారిణి లూథియానా పోలీస్ స్టేషన్‌లో సర్దార్‌పై ఫిర్యాదు చేసింది. అతను తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించింది.

02/04/2016 - 07:25

ముంబయి: ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలతో రాణించడంతో బెంగాల్‌తో బుధవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మధ్య ప్రదేశ్ (ఎంపి) నాలుగు వికెట్లకు 254 పరుగులు సాధించింది. ఆదిత్య శ్రీవాత్సవ 65 పరుగులు చేయగా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నమన్ ఓఝా 64 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హర్పీత్ సింగ్ భాటియా 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

02/04/2016 - 07:23

ఆక్లాండ్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకు బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వనే్డలో చేదు అనుభవం ఎదురైంది. స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆ జట్టు ఏకంగా 159 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

02/04/2016 - 07:22

ఇటానగర్: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్) క్రీడాజ్యోతి రిలే బుధవారం ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జెపి రాజ్‌కొవ జెండాను ఊపి, రిలేను మొదలుపెట్టాడు. రాజ్ భవన్ హెలిపాడ్ వద్ద క్రీడాజ్యోతి ప్రయాణం ఆరంభంకాగా, సుమారు 2,000 మంది విద్యార్థులు, పలువురు అథ్లెట్లు, అభిమానులు హాజరై వీడ్కోలు పలికారు.

Pages