S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/11/2018 - 01:36

పోర్ట్ ఎలిజెబెత్, మార్చి 10 : దక్షిణాఫ్రికా క్రికెట్‌కు సంబంధించిన ఇద్దరు సీనియర్ అధికార్లు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోనున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వీరు రగ్బీ క్రీడాకారుడైన సోనీ బిల్ విలియమ్స్ మాస్క్‌లు ధరించి ఫోటోలకు ఫోజులివ్వడమే ఇందుకు కారణం. వార్నర్ భార్య కాండిస్, రగ్బీ ఆటగాడైన విలియమ్స్ 2007కు ముందు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.

03/11/2018 - 01:34

కొలంబో, మార్చి 10: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో శనివారం జరిగిన టీ-10 ఇంటర్నేషనల్ ట్రై సిరీస్ మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై గెలిచింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ప్రత్యర్థి టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

03/11/2018 - 01:33

ఇండియన్ వెల్స్ (యూఎస్), మార్చి 10: తన కెరీర్‌లో ఇప్పటివరకు ఐదుసార్లు గ్రాండ్ శ్లామ్ విన్నర్‌గా నిలిచిన ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా తన కోచ్, డచ్‌కు చెందిన స్వెన్ గ్రోయిన్‌వెల్డ్‌ను వదులుకోడానికి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ జరుగుతున్న డబ్ల్యూటీఏ ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌లో మొదటిరౌండ్‌లోనే నిష్క్రమించిన షరపోవా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

03/10/2018 - 11:55

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ గెలుచుకున్నది. అయిదవ వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో కివీస్‌పై నెగ్గింది. దీంతో వన్డే సిరీస్ 3-2 తేడాతో ఇంగ్లండ్ వశమైంది. చివరి వన్డేలోనూ ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో చెలరేగి ఆడాడు.

03/10/2018 - 06:12

హైదరాబాద్, మార్చి 9: ప్రతిష్టాత్మకమైన విజ్జీ ట్రోఫీ యూనివర్సిటీస్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఈనెల 20 నుంచి 23 వరకు భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో నిర్వహిస్తారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న దక్షిణ మండలం జట్టుకు సంబంధించిన శిక్షణ శిబిరం ఈనెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన రఘు ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తారు.

03/10/2018 - 06:10

న్యూఢిల్లీ, మార్చి 9: ప్రపంచ నలుమూలల్లో సాంకేతిక రంగం దూసుకెళున్న ఈ రోజుల్లో ..చదువుకోవాలా, క్రీడల్లో పాల్గొనాలా అన్న ప్రశ్న నేటి మేటి క్రీడాకారుల్లో తరుచూ నెలకొంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలో పాల్గొంటున్న అనేకమంది క్రీడాకారులు సకాలంలో జరిగే పరీక్షల్లో పాల్గొనలేక క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటన్నారు. ఈ క్రమంలో టీనేజ్ సంచలనం అనీష్ భన్వాలాకు ఇలాంటి సంకట పరిస్థితి ఎదురైంది.

03/10/2018 - 06:10

ఇండియన్ వెల్స్ (యూఎస్), మార్చి 9: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సుదీర్ఘ విరామం తర్వాత పాల్గొన్న డబ్ల్యుటీఏ ఇండియన్ వెల్స్ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

03/10/2018 - 06:10

మెక్సికో, మార్చి 9: ఐఎస్‌ఎస్‌ఎఫ్ సీనియర్ ప్రపంచకప్‌లో భారత ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. టోర్నీలో భాగంగా ఆరోరోజు నిర్వహించిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అంజుమ్ మోద్గిల్ 454.2 పాయింట్లు సాధించి రజత పతకాన్ని దక్కించుకుంది.

03/10/2018 - 06:09

కొలంబో, మార్చి 9: నిదహాస్ ట్రోఫీ ముక్కోణపు టీ-20 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత్ గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది.

03/10/2018 - 06:09

ముంబయి, మార్చి 9: క్రికెట్‌లో ‘గ్రేడ్-ఎ’+ కేటగిరి ప్రవేశపెట్టాలన్న ఆలోచన ధోనీ, కోహ్లీలదే అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘గ్రేడ్-ఎ’లో కేవలం ఐదుగురు ప్లేయర్లకు మాత్రమే స్థానం దక్కింది. వీరిలో ఒక్కొక్కరి వార్షిక కాంట్రాక్టురూ.7 కోట్లు. ఇందులో విరాట్ కోహ్లీకి కూడా స్థానం దక్కింది. అయితే ధోనీని ‘ఎ’ కేటగిరీలో ఉంచడం వల్ల అతని వార్షిక కాంట్రాక్టు రూ.5కోట్లు.

Pages