S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/10/2018 - 06:07

కోల్‌కతా, మార్చి 9: భారత క్రికెటర్ మహ్మద్ షమీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అతను పచ్చి మోసగాడని, ఎంతోమంది మహిళలతో అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని అతని భార్య హసీన్ జహాన్ మహ్మద్ షమీ ఇక్కడి పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. షమీతోపాటు మరో నలుగురిపై ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

03/10/2018 - 06:07

చెన్నై, మార్చి 9: మాజీ బ్యాటింగ్ దిగ్గజం దిలీప్ వెంగ్‌సర్కార్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవిని కోల్పోవడానికి తాను కారణం కాదని, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ‘‘ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, కేవలం కావాలని సృష్టించినవి’’ అన్నారు.

03/10/2018 - 06:06

న్యూఢిల్లీ, మార్చి 9: అంధుల క్రికెట్ అసోసియేషన్‌ను గుర్తించడం ద్వారా భారత్ అంధుల క్రికెట్‌లో దూసుకుపోయేందుకు వారికి రక్షణ కవచంగా నిలబడాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ, మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఇండస్‌ఇండ్ బ్యాంక్ అంధుల క్రికెట్ సమావేశం-2018ను శుక్రవారం ఏర్పాటు చేసిన సందర్భంగా వారిద్దరూ అందులో పాల్గొన్నారు.

03/10/2018 - 06:06

ముంబయి, మార్చి 9: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ టీ-20 ముంబయి లీగ్ జట్టుకు చీఫ్ మెంటర్‌గా నియమితుడయ్యాడు. ఈ లీగ్ మ్యాచ్ ఈనెల 11 నుండి 21 వరకు జరుగుతుంది. తమ జట్టు చీఫ్ మెంటర్‌గా వెంగ్‌సర్కార్ నియామకాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్, ప్రోబబిలిటీ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పీఎస్‌ఐపీఎల్) ధృవీరిస్తూ అతనిని తమ జట్టుకు కల్నల్‌గా అభివర్ణించాయి.

03/09/2018 - 00:25

కొలంబో, మార్చి 8: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ప్రారంభమైన ముక్కోణపు టీ-20 టోర్నీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో చావుదెబ్బ తిన్న భారత్ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని రెండో మ్యాచ్‌పై పట్టు సాధించింది.

03/09/2018 - 00:21

హైదరాబాద్, మార్చి 8: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు డాక్టర్. జి.వివేకానంద్, కార్యదర్శి టి. శేష్ నారాయణ్‌లను వారు నిర్వహిస్తున్న పదవులకు అనర్హులుగా ప్రకటిస్తూ, హెచ్‌సిఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ నరసింహా రెడ్డి (రిటైర్డ్) గురువారం తీర్పు చెప్పారు. ఈ ఆదేశాలు ఇచ్చిన రోజునుంచే వీరి అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

03/09/2018 - 00:20

డర్బన్, మార్చి 8: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఇటీవల డర్బన్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా స్టేడియం వెలుపల డేవిడ్ వార్నర్, డికాక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

03/09/2018 - 00:19

ముంబయి, మార్చి 8: విరాట్ కోహ్లీని ఎంపిక చేయడంలో జాతీయ సెలక్టర్‌గా తన కెరీర్‌కు ముగింపు పడిందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ అన్నాడు. జాతీయ క్రికెట్‌లో నిరుపమాన రీతిలో రాణిస్తున్న విరాట్ కోహ్లీ వరుస విజయాలతోనూ, రికార్డులతోనూ సంచలనం సృష్టిస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. చాలామంది అప్పట్లో తన నిర్ణయాన్ని ఒక మాస్టర్ స్ట్రోక్‌గానే పరిగణించారని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.

03/09/2018 - 00:16

ఇఫో, మార్చి 8: అజయాంషా కప్ హాకీ టోర్నమెంట్ ఫైనల్‌లో అర్హత సంపాదించేందుకు భారత హాకీ జట్టు ఏ రకమైన మేజిక్ చేయబోతోంది? కోచ్ ఆశించినట్టుగా ఆటగాళ్లు అర్జెంటీనాపై భారీ విజయాన్ని నమోదు చేసుకోగలుగుతారా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలను నిలబెట్టబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

03/09/2018 - 00:16

పాటియాల, మార్చి 8: తమిళనాడుకు చెందిన అథ్లెట్ అయ్యసామి ధరుణ్ 400 మీటర్ల పరుగు పందెంలో రికార్డు సృష్టించాడు. ఇక్కడ జరుగుతున్న 22వ ఫెడరేషన్ కప్ నేషనల్ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ధరుణ్ రికార్డును తిరగరాసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఈ ఘన విజయం ద్వారా త్వరలో జరిగే కామనె్వల్త్ గేమ్స్‌లో చోటు దక్కే అదృష్టానికి చేరువయ్యాడు.

Pages