S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/09/2018 - 00:15

సియోల్, మార్చి 8: దక్షిణ కొరియాలో జరుగుతున్న ఐదు రోజుల మ్యాచ్ సిరీస్‌లో భారత మహిళా హాకీ బృందం తొలి పరాజయాన్ని చవిచూసింది. దక్షిణ కొరియాకు చెందిన సెరుూల్‌కి షియోన్, యూరిన్ లీ అద్భుతంగా ఆడారు. అయితే, భారత జట్టు కూడా చివరిక్షణం వరకు పట్టుదలగానే ఆడింది. 16వ నిమిషంలో ఒక గోల్ చేయగలిగింది. ఇది తొలిఓటమిని చవిచూసినప్పటికీ భారత జట్టు 2-1 లీడ్‌తోనే ఉంది.

03/09/2018 - 00:14

న్యూఢిల్లీ, మార్చి 8: మెక్సికోలోని గౌడాలాజరాలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ పురుషుల 25 మీటర్ల రేపిడ్ ఫైర్ పిస్టల్‌లో భారత్ చెందిన యువ జంట అనీష్ భన్వాలా, నీరజ్ కుమార్ ఫైనల్‌కు చేరారు. వీరిలో 15 ఏళ్ల భన్వాలా 2106 ఒలింపిక్స్‌లో మొదటి క్వాలిఫయింగ్ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచి పతకం సాధించాడు.

03/09/2018 - 00:13

హరారే, మార్చి 8: ఇక్కడి ఓల్డ్ హరారియన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో గురువారం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ 10వ మ్యాచ్‌లో పవువా న్యూగునియా (పీఎన్‌జీ) జట్టుపై వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పీఎన్‌జీ 42.4 ఓవర్లలో 200 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ జట్టులో కెప్టెన్ అస్సాద్ వాలా 89 బంతులు ఎదుర్కొని ఆరు బౌండరీలతో 57 పరుగులు చేశాడు.

03/09/2018 - 00:13

ఇండియన్ వెల్స్, మార్చి 8: గత నెలలో ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా మళ్లీ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన ఖాతాలో మరో టైటిల్‌ను వేసుకున్నాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న ఆరో ఇండియన్ వెల్స్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా తన ఆధిపత్యానికి తిరుగులేదని నిరూపించాడు 36 ఏళ్ల ఈ స్విస్ సంచలనం.

03/08/2018 - 03:42

డునేడిన్, మార్చి 7: ఇక్కడి యూనివర్సిటీ ఓవల్ స్టేడియంలో జరిగిన నాలుగో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుని, ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

03/08/2018 - 03:40

న్యూఢిల్లీ, మార్చి 7: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ సీజన్‌కు సంబంధించి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ గంభీర్‌కు ఇదే జట్టు కెప్టెన్‌గా అవకాశం వచ్చింది.

03/08/2018 - 03:39

న్యూఢిల్లీ, మార్చి 7: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నాయకత్వంలో అఖండ విజయాలు నమోదు అవుతున్న నేపథ్యంలో మళ్లీ మాయాజాలం సృష్టించేందుకు వీలుగా ఆగస్టులో ఇంగ్లాండ్‌లో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌లకు కోహ్లీ సిద్ధంగా ఉండాలని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించాడు.

03/08/2018 - 03:38

న్యూఢిల్లీ, మార్చి 7: భారతీయ పేసర్ మహమ్మద్ షమీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ తాత్కాలికంగా నిలిపేసి షాకిచ్చింది. షమీ భార్య, అతనిపై గృహహింస, ఇతర అమ్మాయిలతో సంబంధాల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద వివాదం రేగింది. దీంతో బీసీసీఐ ఈ చర్య తీసుకుంది. అయితే తన భార్య చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని షమీ అంటున్నాడు.

03/08/2018 - 03:38

న్యూఢిల్లీ, మార్చి 7: పాకిస్తాన్ పురుషుల హాకీజట్టు ప్రధాన కోచ్‌గా మాజీ భారత కోచ్ రొయెలాంట్ ఓల్ట్‌మాస్ నియమితులయ్యాడు. తాను రెండున్నరేళ్ల కాలం కోచ్‌గా కొనసాగనున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. డచ్‌కు చెందిన రొయెలాంట్ గతంలోనాలుగు సంవత్సరాలపాటు భారత హాకీ కోచ్‌గా పనిచేశారు. అయితే పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.

03/08/2018 - 03:36

డునేడిన్, మార్చి 7: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ తొడకు తగిలిన తీవ్ర గాయాన్ని సైతం లెక్కచేయకుండా తన కెరీర్‌లోనే అత్యధిక పరుగులు చేశాడు. ఇతను 147 బంతులు ఎదుర్కొని ఆరు సిక్సర్లు, 17 బౌండరీల సహాయంతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ రెండు జట్లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

Pages