S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/06/2018 - 00:52

ముంబయి, మార్చి 5: భారత్ మహిళలతో మూడు వనే్డల సిరీస్‌లో పాల్గొందుకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు మంగళవారం భారత మహిళల ‘ఏ’ టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది. వడోదరలో ఈనెల 12నుంచి జరిగే 50 ఓవర్ల పరిమితి గల మూడు వనే్డలలో ఆస్ట్రేలియా భారత్‌తో పోటీపడనుంది. ఇందులో భాగంగా ఇక్కడి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఆస్ట్రేలియా జట్టు పరిశీలించింది.

03/06/2018 - 00:51

ముంబయి, మార్చి 5: మంచి క్రికెటర్‌గానేకాదు.. మంచి భర్తగానూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మార్కులు కొట్టేశాడు. ముంబయి విమానాశ్రంలో దిగిన తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మను అతను ఎదురువెళ్లి సాదరంగా ఆహ్వానించాడు. హత్తుకొని తన ప్రేమను చాటుకున్నాడు. అతనంతరం వారిద్దరూ ఫొటోగ్రాఫర్ల నుంచి తప్పించుకుంటూ తమ నివాసానికి వెళ్లిపోయారు. అనుష్కను రిసీవ్ చేసుకోవడానికి కోహ్లీ స్వయంగా రావడం చర్చనీయాంశమైంది.

03/06/2018 - 00:50

సియోల్, మార్చి 5: భారత మహిళల హాకీ జట్టు 1-0 గోల్స్ తేడాతో కొరియాపై విజయం సాధించి ఇక్కడ ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసింది. ఇందులో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళలు 1-0తో విజయం సాధించారు. చివరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. మ్యాచ్ ఐ నిమిషంలో భారత క్రీడాకారిణి లాల్రేమ్‌షియామి గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది.

03/06/2018 - 00:49

ఇపో (మలేషియా), మార్చి 5: మలేషియాలో జరుగుతున్న అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ ఢీకొంటుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లో ఒక పరాజయాన్ని చవిచూసిన సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీనితో మంగళవారం నాటి మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.

03/05/2018 - 01:25

న్యూఢిల్లీ, మార్చి 4: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత ఏస్ షూటర్ షాజర్ రిజ్వీ కొత్త రికార్డు నెలకొల్పాడు. మొత్తం 242.3 పాయింట్లను సంపాదించిన అతను రికార్డుతోపాటు స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్ క్రిస్టియన్ రీజ్ (జర్మనీ)ని అతను రెండో స్థానానికి నెట్టేయడం విశేషం.

03/05/2018 - 01:23

ఇఫో, మార్చి 4: అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని భారత్ డ్రా చేసుకుంది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి. మొదటి మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాకు గట్టిపోటీనిచ్చినప్పటికీ 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్ రెండో మ్యాచ్‌లో వ్యూహాత్మకంగా ఆడింది. రక్షణ విధానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

03/05/2018 - 01:22

ట్రై సిరీస్‌లో ఆడేందుకు శ్రీలంకకు బయలుదేరే ముందు సహచరులతో కలిసి ఆదివారం ముంబయి విమానాశ్రయంలో సేదతీరుతున్న రోహిత్ శర్మ. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు కెప్టెన్సీ పగ్గాలను అతనికి అప్పగించిన విషయం తెలిసిందే. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా ఈ ట్రై సిరీస్‌లో ఆడుతున్నాయి. ఈనెల 6న తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఢీ కొంటుంది. 8న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.

03/05/2018 - 01:18

మెల్బోర్న్, మార్చి 4: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ సీన్ అబోట్ గుర్తున్నాడా? 2014 నవంబర్‌లో షీఫెల్డ్ షీల్డ్ పోటీల్లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడిన అతను వేసిన షార్ట్ పిచ్ బంతి యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ ప్రాణాలు తీసిన సంఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆ సంఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. అబోట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని హుక్ చేయడంలో హ్యూస్ విఫలమయ్యాడు.

03/05/2018 - 01:16

బర్మింగ్‌హామ్, మార్చి 4: ప్రపంచ ఇన్‌డోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 60 మీటర్ల పరుగులో అమెరికాకు చెందిన క్రిస్టియన్ కోల్‌మన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ రికార్డును ఇప్పటికే తన పేరిట నమోదు చేసుకున్న కోల్‌మన్ ఇన్‌డోర్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యాన్ని 6.34 సెకన్లలో చేరిన అతను 20 ఏళ్ల క్రితం వౌరిస్ గ్రీస్ నెలకొల్పిన రికార్డును 0.03 సెకన్ల తేడాతో బద్దలు కొట్టాడు.

03/05/2018 - 01:14

మాడ్రిడ్, మార్చి 4: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగల్ హీరో క్రిస్టియానో రొనాల్డో ఒక అరుదైన మైలురాయిని చేరాడు. ఈ టోర్నీలో 300 గోల్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గటాఫేతో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 3-1 తేడాతో విజయం సాధించింది. వీటిలో రెండు గోల్స్ రొనాల్డో చేసినవే కావడం విశేషం.

Pages