S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/04/2018 - 00:16

వెల్లింగ్టన్, మార్చి 3: ఆల్‌రౌండర్ మోయిన్ అలీ బౌలింగ్‌లో రాణించి, మూడు వికెట్లు పడగొట్టడమేగాక, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో శనివారం ఇక్కడ జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఇంగ్లాండ్ నాలుగు పరుగుల తేడాతో గెల్చుకుంది. చివరి క్షణం వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు స్పిన్నర్లు అండగా నిలవడం విశేషం.

03/04/2018 - 00:14

న్యూఢిల్లీ, మార్చి 3: మన దేశంలో క్రీడా సంస్కృతి మరింత వెల్లివిరియాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. తన జీవితంలో కలగా మిగిలిన ఈ క్రీడా సంస్కృతి దేశమంతా విస్తృతం చేయడమే తన చిరకాల వాంఛ అని ఆయన అన్నాడు.

03/04/2018 - 00:13

దుబాయ్, మార్చి 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ రూ.7.2 కోట్లకు సొంతం చేసుకున్న ఇంగ్లాంల్ అల్‌రౌండర్ జోఫ్రా చొకే ఆర్చర్ గాయాల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదు. కండరాలు బెణికిన కారణంగా విశ్రాంతి తీసుకున్న 22 ఏళ్ల ఆర్చర్ పీఎస్‌ఎల్‌లో పాల్గొంటున్న ఇంగ్లాండ్ జట్టులో స్థానం దక్కింది.

03/04/2018 - 00:12

దర్బన్, మార్చి 3: టెస్టులకు కాలం చెల్లుతున్నదనే వదాన మరోసారి రూజువైంది. ఇక్కడ జరుగుతున్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మొదటి టెస్టును చూసేందుకు ప్రేక్షకులు సంఖ్య చాల తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. 18వేల సిట్టింగ్ కేపాసిటీ ఉన్న పావు వంతు కూడా భర్తీకాకపోవడం దక్షిణాఫ్రికా క్రికెట్ (ఎస్‌ఏసీ) అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నది.

03/04/2018 - 00:12

న్యూఢిల్లీ, మార్చి 3: జాతీయ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ ఆఫ్ స్పిన్నర్ ఆశిష్ కపూర్ ఎంపికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ పదవి నుంచి వెంకటేష్ ప్రసాద్ వైదొలిగిన విషయం తెలిసిందే. అతను త్వరలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కోచ్‌గా వెళాతడాన్న ప్రచారం జరుగుతున్నది. కాగా, ప్రసాద్ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని బర్తీ చేయడానికి భారత క్రికెట్ బోర్డు ఖసరత్తు ప్రారంభించింది.

03/04/2018 - 00:11

ఢాకా, మార్చి 3: బంగ్లాదేష్ టీ-20 జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేతి వేలు గాయంతో బాదపడుతున్నాడు. దీంతో శ్రీలంకలో జరిగే ముక్కోణపు ట్రై సిరీస్‌కు అతను అందుబాటులో ఉండడు. ఇటీవల స్వదేశంలో ట్రై సిరీస్ ఆడుతున్నాపుడు శ్రీలంకోతో జరిగిన మ్యాచ్‌లో అతని వేలికి గాయం అయింది. వైద్య పరీక్షలు జరిపిన అనంతరం అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు.

03/04/2018 - 00:11

బెలో హారిజాంటే (బ్రెజిల్), మార్చి 3: పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్‌జీ)కి భారీ మొత్తానికి ట్రాన్స్‌ఫార్ అయిన బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ కాలి చత్ర చికిత్స విజయవంతం అయింది. ఇటీవల పారిస్‌లో ఒక మ్యాచ్ అడుతున్నాపుడు నేమార్‌కు బలమైన గాయం అయింది. దీంతో అతను ఫ్రాన్స్ నుంచి స్వదేశానికి వచ్చాడు.

03/04/2018 - 00:10

న్యూఢిల్లీ, మార్చి 3: భారత మేటి బాక్సర్ సచిన్ సివాచ్ అద్భుతంగా రాణించిన్నప్పటికి రష్యాలోని ఖాజాన్ (కతార్)లో జరుగుతున్న వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 1-4 తేడాతో రష్యా చేతిలో ఓటమి పాలైంది.

03/03/2018 - 00:55

బిష్కెట్ (కిర్గిస్తాన్), మార్చి 2: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో నవ్‌జోత్ కౌర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ టోర్నీలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన తొలి రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. శుక్రవారం జరిగిన మహిళల 65 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్‌లో ఆమె జపాన్‌కు చెందిన మియా ఇవాయ్‌ని 9-1 పాయింట్ల తేడాతో చిత్తుచేసింది.

03/03/2018 - 00:52

ప్రస్తుతం జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీలో ముగ్గురు, సీనియర్స్ సెలక్షన్ కమిటీలో మరో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వీరందరి కెరీర్‌ను కలిపినా, వెంకటేశ్ ప్రసాద్ కంటే తక్కువగానే ఉండడం గమనార్హం. అతను కెరీర్‌లో 33 టెస్టులు, 161 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు. జూనియర్, సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీల్లో ఉన్న మొత్తం ఆరుగురు ఆడిన మ్యాచ్‌లన్నింటినీ కలిపినా, అవి వెంకటేశ్ ప్రసాద్ మ్యాచ్‌ల కంటే తక్కువే.
*

Pages