S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/11/2018 - 01:39

ఢాకా: శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్ శనివారం బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించే క్రమంలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన ఎడమచేతి వాటం బౌలర్‌గా అతను వసీం అక్రం రికార్డును అధిగమించాడు. 89 టెస్టులు (162 ఇన్నింగ్స్) ఆడిన హెరాత్ 24,920 బంతులు బౌల్ చేశాడు. 11,654 పరుగులిచ్చి 415 వికెట్లు పడగొట్టాడు.

02/11/2018 - 01:36

మెల్బోర్న్, ఫిబ్రవరి 10: న్యూజిలాండ్ కూడా ఆడుతున్న ముక్కోణపు టీ-20 ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 137 పరుగులు చేసింది. పేసర్ కేర్ రిచర్డ్‌సన్ 33 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.

02/11/2018 - 01:36

కరాచీ, ఫిబ్రవరి 10: పాకిస్తాన్‌లో 3 టీ-20 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ వచ్చే మార్చి, ఏప్రిల్‌లో అక్కడ పర్యటించనుంది. ఈ విషయాన్ని దుబాయిలో జరిగిన ఐసీసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది.

02/11/2018 - 01:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఫెడ్‌కప్ టెన్నిస్ టోర్నమెంట్ ఆసియా/ ఓషియానియా గూప్ వన్ ప్లే ఆఫ్‌లో శనివారం చైనీస్ తైపీని ఢీకొన్న భారత్ 2-0 తేడాతో గెలిచింది. మొదటి మ్యాచ్‌లో కర్మాన్ కౌర్ థండి 7-6, 6-3 తేడాతో వరుస సెట్లలో లీ పెయ్ చీని ఓడించింది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా 6-4, 5-7, 6-1 ఆధిక్యంతో సూ చెన్ యూపై విజయం సాధించింది.

02/10/2018 - 04:00

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 9: ఎన్నో అనుమానాలు తలెత్తినప్పటికీ, చివరికి వింటర్ ఒలింపిక్స్ ఇక్కడి జాతీయ స్టేడియంలో శుక్రవారం ఘనంగా మొదలయ్యాయి. చలి తీవ్రత కారణంగా ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని కొందరు అనుకుంటే, మార్చ్ఫిస్ట్‌కు చాలా మంది అథ్లెట్లు దూరమవుతారని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా బృందం పాల్గొనడంపైన కూడా భిన్నస్వరాలు వినిపించాయి.

02/10/2018 - 03:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఫెడ్ కప్ టెన్నిస్ ఆసియా/ఓషియానియా గ్రూప్ వన్ లీగ్‌లో భాగంగా శుక్రవారం హాంకాంగ్‌ను ఢీకొన్న భారత్ 0-3 తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో కర్మాన్ కౌర్ 6-3, 6-4 ఆధిక్యంతో ఇడియా చోంగ్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో అంకిత రైనా 6-3, 6-2 ఆధిక్యంతో లింగ్ జాంగ్‌పై గెలిచి, భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది.

02/10/2018 - 03:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ పోరాటానికి క్వార్టర్ ఫైనల్స్‌లోనే తెరపడింది. చైనాను ఎదుర్కొన్న భారత్ 1-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మహిళల బృందం కూడా అదే తేడాతో ఇండోనేషియా చేతిలో ఓడింది. పురుషుల మొదటి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 14-21, 21-16, 21-7 తేడాతో షి యుకీని ఓడించి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు.

02/10/2018 - 03:56

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 9: ఆరు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో ఇప్పటికే మూడు విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా శనివారం జరిగే నాలుగో మ్యాచ్‌లోనూ గెలవడమే లక్ష్యంగా ఎంచుకుంది. తద్వారా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను పదిలంగా నిలబెట్టుకోవడంతోపాటు, దక్షిణాఫ్రికాపై దక్షిణాఫ్రికాలోనే తొలిసారి వనే్డ సిరీస్‌ను గెల్చుకుంటుంది.

02/10/2018 - 03:56

జొహానె్నబర్గ్, ఫిబ్రవరి 9: స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ వేలి గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి రావడం దక్షిణాఫ్రికాకు ఊరటనిస్తున్నది. అతనొక్కడే మ్యాచ్‌ల ఫలితాలను ఒంటిచేత్తో గెలిపిస్తాడా అన్న అనుమానాన్ని పక్కపెడితే, అతని రాకతో జట్టు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఖాయంగా పెరుగుతుంది.

02/09/2018 - 00:40

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్ అన్ని విధాలా సిద్ధమైంది. విపరీతమైన చలి వల్ల సమస్యలు తలెత్తుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ మెగా ఈవెంట్ విజయవంతమవుతుందని నిర్వహణ కమిటీ (ఓసీ) అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి మొదలయ్యే వింటర్ ఒలింపిక్స్ ఈనెల 25న ముగుస్తాయి.

Pages