S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/29/2018 - 01:53

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్ ట్రోఫీలతో తిమియా బబోస్, రోహన్ బొపన్న జోడీ (కుడి)తో విజేత జట్టు గాబ్రియేల డబ్రోవ్‌స్కీ, మేట్ పావిక్. ఫైనల్‌లో డబ్రోవ్‌స్కీ, పావిక్ 2-6, 6-4, 11-9 తేడాతో బొపన్న బబోస్ జోడీని ఓడించారు.

01/29/2018 - 01:51

బెంగళూరు, జనవరి 28: కర్నాటకకు చెందిన గౌతం కృష్ణప్పను మించిన అదృష్టవంతుడు ఉండడేమో. ఈసారి ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అందరి కంటే ఎక్కువగా 12.5 కోట్ల రూపాయలను దక్కించుకోగా, 11.5 కోట్ల రూపాయల ధర పలికిన జైదేవ్ ఉనాద్కత్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరితో పోల్చడానికి వీల్లేకపోయినా, గౌతంకు లభించిన ధర తక్కువేమీ కాదు.

01/29/2018 - 01:50

బెంగళూరు, జనవరి 28: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అడుగుపెట్టిన తొలి నేపాలీ క్రికెటర్‌గా సందీప్ లామిచాన్ సంచలనం సృష్టించాడు. 17 ఏళ్ల ఈ యువ ఆటగాడిని 20 లక్షలు వెచ్చించి ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది. ఈసారి వేలానికి ఉన్న ఆటగాళ్ల జాబితాలో నేపాల్ నుంచి సందీప్ మాత్రమే ఉన్నాడు.

01/29/2018 - 01:48

న్యూఢిల్లీ, జనవరి 28: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ-20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనాకు చోటు దక్కింది. సుమారు ఏడాది తర్వాత అతను తిరిగి జాతీయ జట్టులోకి రావడం విశేషం. దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే.

01/29/2018 - 01:48

పెర్త్, జనవరి 28: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన, చివరి, ఐదో వనే్డ ఇంటర్నేషనల్‌లో ఇంగ్లాండ్ 12 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 4-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రాయ్ (49), జానీ బెయిర్‌స్టో (44), జో రూట్ (62) మెరుగైన స్కోర్లు చేశారు. ఆసీస్ స్పిన్నర్ ఆండ్రూ టై 46 పరుగులకు ఐదు వికెట్లు కూల్చాడు.

01/29/2018 - 01:47

లింకన్, జనవరి 28: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ఆదివారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.2 ఓవర్లలో 216 పరుగులు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ 47.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించి, విజయభేరి మోగించింది.

01/29/2018 - 01:47

న్యూఢిల్లీ, జనవరి 28: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జోడీ 25వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. ఇక్కడి న్యూపోర్ట్ బీచ్‌లో ఆదివారం జరిగిన ఈ టోర్నీలో తన జోడీ జేమ్స్ సెర్రెటానీతో కలసి ప్రత్యర్థి జోడీ డెనిస్ కుడ్లా, ట్రీట్ హుయిలను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ ఇండో-అమెరికన్ జోడీ అమెరికా-్ఫలిప్పీన్స్ జోడీని 6-4, 7-5 తేడాతో ఓడించి 150,000 డాలర్లు దక్కించుకుంది.

01/29/2018 - 01:47

జకార్తా, జనవరి 28: ఇండోనేషియా మాస్టర్స్ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి తాయ్ జు ఇంగ్ కైవసం చేసుకుంది. ఆదివారం టైటిల్ పోరులో ఆమె భారత స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించింది. కేవలం 27 నిమిషాల వ్యవధిలోనే సైనా 9-21, 13-21 తేడాతో సైనా చిత్తయింది.

01/29/2018 - 01:45

వౌంట్ మాంగనుయ్, జనవరి 28: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరి, మూడో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను 18 పరుగుల తేడాతో గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఓపెనర్ ఫకర్ జమాన్ 46 పరుగులు సాధించగా, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 29 పరుగులు చేశాడు.

01/29/2018 - 01:45

హామిల్టన్ (న్యూజిలాండ్), జనవరి 28: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్ ఫైనల్‌లో బెల్జియం జట్టును ఢీకొన్న భారత్ గట్టిపోటీనిచ్చింది. నిర్ణీత సమయం ముగిసే వరకు స్కోర్లు సమం కావడంతో, ఫలితాన్ని తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‌లో బెల్జియం మూడు గోల్స్ చేయగా, భారత్ గోల్స్ చేయలేకపోయింది.

Pages