S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/28/2018 - 00:59

బెంగళూరు, జనవరి 27: రెండు రోజుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మొదటి రోజైన శనివారం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అత్యధికంగా 12.5 కోట్ల రూపాయల ధర పలికింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులపై దాడి చేశాడన్న అభియోగంపై విచారణను ఎదుర్కొంటున్న అతనికి రాజస్థాన్ రాయల్స్ అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకుంది.

01/28/2018 - 00:58

బెంగళూరు: ఒకప్పుడు ఐపీఎల్‌లో తిరుగులేని హీరోలుగా వెలిగిపోయిన వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగకు శనివారం నాటి వేలంలో చుక్కెదురైంది. రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్‌తో గేల్, కోటి రూపాయల ధరతో మలింగ వేలానికి వచ్చినప్పుడు, ఫ్రాంచైజీలు ఏవీ వారి పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు. దీనితో ఇద్దరూ అమ్ముడుకాని ఆటగాళ్లుగా మిగిలిపోయారు.

01/28/2018 - 00:56

బెంగళూరు: ఈసారి ఐపీఎల్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సోదరుడు కృణాల్ పాండ్య జాక్‌పాట్ కొట్టాడు. గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన అతను 243 పరుగులు చేశాడు. పది వికెట్లు సాధించాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ చూపే సామర్థ్యం ఉన్న కారణంగా 8.8 కోట్ల రూపాయలు చెల్లించి ముంబయి ఇండియన్స్ తన వద్దే ఉంచుకుంది.

01/28/2018 - 00:55

బెంగళూరు: తమతమ జట్లు రీటైన్ చేసుకోవడంతో, ఈసారి ఐపీఎల్‌కు వెళ్లని ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నారు. కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నది. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని 15 కోట్ల రూపాయల ధరతో రీటైన్ చేసింది.

01/28/2018 - 00:54

మెల్బోర్న్, జనవరి 27: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రపంచమాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి గెల్చుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె సిమోనా హాలెప్‌ను 7-6, 3-6, 6-4 తేడాతో ఓడించింది. ఇంతకు ముందు 43 పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఆడినప్పటికీ, ఒక్కసారి కూడా టైటిల్‌ను సాధించలేకపోయిన వొజ్నియాకి తన 43వ ప్రయత్నంలో విజేతగా నిలిచింది.

01/28/2018 - 00:52

కోల్‌కతా, జనవరి 27: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పూర్తిగా ఒక వ్యాపారంగా మారిందని, హవాలా లావాదేవీలకు అధికారిక వేదికగా ఉపయోగపడుతున్నదని భారత మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ ఆరోపించాడు. ఈ టోర్నమెంట్ కోవసం జరుగుతున్న వేలంలో భారీ మొత్తాలు చేతులు మారుతున్న విషయాన్ని అతను గుర్తుచేస్తూ, హవాలా వ్యాపారం జోరుసా సాగుతున్నదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

01/28/2018 - 00:50

న్యూఢిల్లీ, జనవరి 27: మొట్టమొదటి ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీల్లో పురుషుల విభాగంలో 143 (42 మంది భారతీయులు), మహిళల విభాగంలో 80 (32 మంది భారతీయులు) మంది తలపడతారు. క్యూబా, కజకిస్థాన్‌సహా మొత్తం 21 దేశాల బాక్సర్లు పోటీపడే ఈ టోర్నమెంట్ విశేష ఆదరణ ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

01/28/2018 - 00:49

హామిల్టన్ (న్యూజిలాండ్), జనవరి 27: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. శనివారం జరిగిన రెండో దశ మ్యాచ్‌లో జపాన్‌ను 4-2 తేడాతో ఓడించి, ఫైనల్‌లో ప్రపంచ మూడో ర్యాంక్ జట్టు బెల్జియంతో పోరును ఖాయం చేసుకుంది. భారత్ తరఫున వివేక్ సాకర్ ప్రసాద్ (12వ నిమిషం), వరుణ్ కుమార్ (30వ నిమిషం), మన్‌దీప్ సింగ్ (58వ నిమిషం), రమణ్‌దీప్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించారు.

01/28/2018 - 00:49

జొహానె్నస్‌బర్గ్, జనవరి 27: దక్షిణాఫ్రికాతో శనివారం ముగిసిన చివరి, మూడో టెస్టును భారత జట్టు 63 పరుగుల తేడాతో గెల్చుకుంది. అయితే, మొదటి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూడడంతో, సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. ప్రమాదకరంగా మారిన వాండరర్స్ పిచ్‌పై ప్రతి పరుగుకూ బ్యాట్స్‌మెన్ తంటాలు పడిన నేపథ్యంలో, 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది.

01/28/2018 - 00:48

ఢాకాలో జరిగిన ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌ను గెల్చుకున్న శ్రీలంక జట్టు. శనివారం నాటి ఫైనల్‌లో ఆ జట్టు బంగ్లాదేశ్‌ను 79 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంక 50 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది.

Pages