S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/28/2018 - 00:47

జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ సెమీ ఫైనల్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ రిచానొక్ ఇంతనాన్‌తో తలపడుతున్న భారత స్టార్ సైనా నెహ్వాల్ (కుడి), ఈ మ్యాచ్‌ని 21-19, 21-19 తేడాతో గెల్చుకున్న ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో సైనా ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. ఫైనల్‌లో ఆమె ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్‌ను ఢీ కొంటుంది.

01/27/2018 - 00:29

మెల్బోర్న్, జనవరి 26: మెల్బోర్న్‌లో ఎండ గురించి, అందరినీ నానా ఇబ్బంది పెడుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మండుతున్న ఎండల కారణంగా అరికాళ్లకు బొబ్బలు వచ్చాయని వాపోయిన దక్షిణ కొరియా యువ ఆటగాడు చుంగ్ హియాన్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు.

01/27/2018 - 00:27

జొహానె్నస్‌బర్గ్, జనవరి 26: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి, మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న జొహానె్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో పిచ్ ప్రమాదకరంగా మారింది. అనూహ్యంగా దూసుకొచ్చే బంతులను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్ నానా ఇబ్బంది పడుతున్నారు.

01/27/2018 - 00:25

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్‌తో
తమియా బబోస్, క్రిస్టినా మ్లాడెనొవిచ్. వీరు శుక్రవారం జరిగిన ఫైనల్‌లో ఎకతరీన మకరొవా, ఎలెనా వెస్నిన్ జోడీని 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టైటిల్ సాధించారు. కాగా, మహిళల సింగిల్స్ ఫైనల్ శనివారం కరోలిన వొజ్నియాకి, సిమోనా హాలెప్ మధ్య జరుగుతుంది.

01/27/2018 - 00:24

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తిమియా బబోస్‌తో కలిసి ఆడుతున్న భారత సీనియర్ ఆటగాడు రోహన్ బొపన్న ఫైనల్ చేరాడు. గత ఏడాది గాబ్రియెల డ్రబోవ్‌స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను బొపన్న కైవసం చేసుకున్నాడు. కాగా, ఇక్కడ సెమీ ఫైనల్‌లో బొపన్న, బబోస్ జోడీ 7-5, 10-6 తేడాతో మరియా జోస్ మార్టినెజ్ సాంచెజ్, మార్సెలో డెమోలినర్ జోడీని ఓడించి ఫైనల్ చేరింది.

01/27/2018 - 00:22

బెంగళూరు, జనవరి 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హడావుడి మళ్లీ మొదలైంది. శని, ఆది వారాల్లో జరిగే ఈ ఏడాది వేలంలో ఎంత మంది క్రికెటర్లకు అవకాశం లభిస్తుందో, ఎంత మందికి నిరాశ తప్పదోనన్న విషయం ఆసక్తిని రేపుతున్నది. 11వ ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవడానికి మొత్తం 1,122 మంది తమ పేర్లను దరఖాస్తు చేసుకున్నారు.

01/27/2018 - 00:21

క్వీన్స్‌టౌన్, జనవరి 26: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 131 పరుగుల తేడాతో చిత్తుచేసి, పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్ పోరును ఖాయం చేసుకుంది. శుభం గిల్ సెంచరీని కొద్దిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ప్రతిభతో ప్రత్యర్థి ముందు భారత్ 266 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

01/27/2018 - 00:19

అడెలైడ్, జనవరి 26: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయినప్పటికీ, శుక్రవారం నాటి నాలుగో మ్యాచ్‌ని మూడు వికెట్ల తేడాతో గెల్చుకొని, క్లీన్‌స్వీప్ ప్రమాదం నుంచి బయటపడిన ఆస్ట్రేలియా పరువు నిలబెట్టుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

01/26/2018 - 01:34

న్యూఢిల్లీ, జనవరి 25: వెస్టిండిస్ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లలో 106 మ్యాచ్‌లలో తన ఆటతీరుతో ఎందరో అభిమానులను సంపాదించుకుని, ఆయా జట్లకు మంచి పేరుప్రతిష్టలు తీసుకువచ్చిన డ్వేన్ బ్రేవో ఇపుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. రానున్న ఐపీఎల్ టోర్నీలలో అతనిని ఏ ఫ్రాంచైజీ చేజిక్కించుకుంటుదన్నది కొద్దిరోజుల్లోనే తేటతెల్లం కానుంది.

01/26/2018 - 02:33

జోహానె్సస్‌బర్గ్, జనవరి 25: న్యూ వాండరర్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసిన భారత్ తమ ప్రత్యర్థి జట్టు బుధవారం ఆట ముగిసే ప్రథమార్థంలోనే ఒక వికెట్ తీసింది. 188 పరుగుల లక్ష్యఛేదనకు రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 65.5 ఓవర్లలో 194 పరుగులు చేసింది.

Pages