S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/26/2018 - 01:30

హామిల్టన్ (న్యూజిలాండ్), జనవరి 25: ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న బెల్జియం హాకీ జట్టును 5-4 ఆధిక్యంతో భారత జట్టు చిత్తు చేసింది. ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల హాకీ టోర్నమెంటు రెండో లీగ్‌లో భారత్ ఈ ఘనతను నమోదు చేసింది. అంతకుముందు మొదటి లీగ్ తుది పోటీలో భారత్‌పై బెల్జియం 1-2 ఆధిక్యంతో గెలిచింది.

01/26/2018 - 01:27

మెల్బోర్న్, జనవరి 25: ప్రపంచ టెన్నిస్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లుగా చెలామణి అవుతున్న రోజర్ ఫెదరర్, రఫీల్ నాదల్ ఆట ఆడేటపుడు మాత్రమే ప్రత్యర్థులు..కానీ కోర్టు బయట మాత్రం వారిద్దరూ మంచి స్నేహితులన్న విషయం చాలామందికి తెలియదు. కుడి కాలికి నొప్పి కారణంగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ ఆటగాడు మారిన్ సిలిస్ చేతిలో నాదల్ అర్థంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే.

01/26/2018 - 01:26

జోహానె్సస్‌బర్గ్, జనవరి 25: దక్షిణాఫ్రికా పేసర్, యువ సంచలన ఆటగాడు లుంగీ ఎంగిడి ఇటీవల కాలంలో చూపిన ప్రతిభా సామర్థ్యాలు ప్రదర్శించినందుకు ఇప్పటికే అన్నివర్గాల ప్రశంసలు అందుకున్నందుకు అరుదైన అవకాశం లభించింది. డర్బన్‌లో ఫిబ్రవరి 1వ తేదీ నుండి భారత్‌తో జరుగబోయే ఆరో వండే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు అవకాశం లభించింది.

01/26/2018 - 01:26

ఆక్లాండ్, జనవరి 25: పాకిస్తాన్‌తో ఇక్కడ జరిగిన టీ-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 202 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ వెనుకబడింది. చివరకు 48 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాక్ జట్టు అన్ని విభాగాల్లో బాగా ఆడిందని, తమ జట్టు పేలవమైన ప్రదర్శనతో ఓటమిపాలైందని న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్ అన్నాడు.

01/26/2018 - 01:25

క్రిస్ట్‌చర్చ్, జనవరి 25: అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ గురువారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో న్యూజిలాండ్ జట్టు ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ ఆరు వికెట్లకు 309 పరుగులు చేసి, 202 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. అఫ్గానిస్తాన్ జట్టులో రహమనుల్లా గుర్బాజ్ 67 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 69 పరుగులతో టాపర్‌గా నిలిచాడు.

01/26/2018 - 01:25

క్వీన్‌స్టన్, జనవరి 25: ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న భారత్ జట్టు శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అండర్-19 ప్రపంచ కప్‌లో మూడుసార్లు చాంపియన్‌షిప్ సాధించిన భారత్ ఇప్పటికే లీగ్ దశలో గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, పపువా న్యూ గునియా, జింబాబ్వేలను ఓడించింది. గ్రూప్-సిలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన బంగ్లాదేశ్ ఇపుడు భారత్‌తో ఆడుతుంది.

01/25/2018 - 01:15

ఆశలు నిలబెట్టని భారత్ బ్యాట్స్‌మెన్ * 187 పరుగులకే ఆలౌట్ * దక్షిణాఫ్రికా 6/1

01/25/2018 - 01:12

న్యూఢిల్లీ, జనవరి 24: షూటింగ్‌లో ఇన్‌డోర్ వరల్డ్ జూనియర్ చాంపియన్ అనీష్ భన్వాలా, ప్రపంచ యూత్ వెట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించిన జెరెమీ లాల్‌రినున్గా సహా మొత్తం 3,298 మంది అథ్లెట్లు ఈసారి ‘ఖేల్ ఇండియా స్కూల్ గేమ్స్’లో పోటీపడుతున్నారు. ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అథ్లెట్లు హాజరవుతారు.

01/25/2018 - 01:11

మెల్‌బోర్న్, జనవరి 24: 14వ ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోగర్ ఫెదరర్ చెలరేగిపోయాడు. సుదీర్ఘకాల ప్రత్యర్థి థామస్ బెర్డిక్‌ను వరుస సెట్లతో మట్టికరిపించాడు, ఫైనల్ దిశగా దూసుకెళ్లాడు. రాడ్ లావెర్ అరీనా కోర్టులో 2గంటల 14 నిమిషాలపాటు అలుపెరుగని పోరాటాన్ని ప్రదర్శించిన ఫెదరర్, సెకెండ్ సీడ్ ఆటగాడైన బెర్డిక్‌పై 7-6 (7/1), 6-3, 6-4 స్కోరుతో విజయం సాధించాడు.

01/25/2018 - 01:10

గాయంతో నిష్క్రమించిన మేటి ఆటగాడు

Pages