S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/25/2018 - 01:10

న్యూయార్క్, జనవరి 24: గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సత్తా చాటుకున్నాక మరే ఇతర పోటీల్లోనూ కనిపించని ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వచ్చే నెలలో జరిగే ఫెడ్ కప్ టోర్నీకి హాజరవుతోంది. ఈ విషయాన్ని అమెరికా టెన్నిస్ సంఘం ప్రకటించింది. గత ఏడాది జనవరిలో మెల్బోర్న్‌లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచినపుడు ఆమె గర్భవతి.

01/25/2018 - 01:09

ముంబయి, జనవరి 24: దక్షిణాఫ్రికా టూర్ కోసం తాను ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నానని, ఆ రోజు ఇపుడు రానే వచ్చిందని భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైన జమీమా రోడ్రిగ్స్ ఆనందం వ్యక్తం చేసింది. ముంబయికి చెందిన ఈ 17 ఏళ్ల జమీమా ఇక్కడ నుండి టీమ్ సభ్యులతో కలసి వెళ్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడింది. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్తుండడం ఇదే తనకు మొదటిసారని ఆమె పేర్కొంది.

01/25/2018 - 01:08

అలొర్ సెటర్ (మలేషియా), జనవరి 24: థామస్, ఉబర్ కప్ ఫైనల్స్‌లో ఆడేందుకు భారత మహిళా షట్లర్లకు గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఆడాలంటే ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో షట్లర్లు అద్భుత ప్రతిభ కనబరచాలి. అయితే, ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా క్రీడాకారులు పాల్గొన్న మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ, పురుష షట్టర్లు సునాయాసంగానే గెలుపు సాధించారు.

01/25/2018 - 01:08

టాటాస్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీ

01/25/2018 - 01:07

ముంబై, జనవరి 24: ఇప్పటికే పలువురు క్రీడాకారులు, అధికారుల మన్ననలు అందుకున్న ప్రో కబడ్డీ పోటీలు మళ్లీ ఈ ఏడాది అక్టోబర్ 19 నుండి జరుగనున్నాయి. 13 వారాల పాటు పోటీల ఆరో సీజన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించే విషయంతో పాటు వచ్చే ఏడాది నిర్వహించే ఏడో సీజన్ విషయాన్ని మాషల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వెల్లడించింది.

01/24/2018 - 00:49

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో అన్‌సీడెడ్‌గా దిగిన మెర్టెన్స్ రూట్స్ మంగళవారం జరిగిన పోటీలో ప్రపంచ నాలుగో నంబర్ క్రీడాకారిణి ఎలినా సిటొలినాను ఓడించి ఏకంగా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బెల్జియంకు చెందిన 22 ఏళ్ల మెర్టెన్ ఇప్పటివరకు ప్రపంచ 37వ ర్యాంకర్‌గా ఉంది. ఒక గంట 13 నిమిషాలపాటు జరిగిన పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన ఎలినాను ఆమె 6-4, 6-0 తేడాతో మట్టికరిపించింది.

01/24/2018 - 00:48

జోహానె్సస్‌బర్గ్, జనవరి 23: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఘోర పరాజయం పాలైన భారత్ క్రికెట్ జట్టు బుధవారం వాండరర్స్‌లో జరిగే మూడో మ్యాచ్‌లోనైనా మన దేశ పరువు నిలబెడుతుందా? లేదా? అన్న సందేహాలు అభిమానుల్లో వెల్లువెత్తుతున్నాయి.

01/24/2018 - 00:46

ముంబయి, జనవరి 23: దక్షిణాఫ్రికా టూర్‌కు ముందుగా వెళ్లడం వల్ల అక్కడి వాతావరణానికి అలవాటుపడి జట్టు రాణించే అవకాశం ఉంటుందని భారత మహిళా క్రికెట్ స్కిప్పర్ మిథాలీ రాజ్ అన్నారు. ఫిబ్రవరి 5నుంచి కింబర్లీలో జరగనున్న మూడు వనే్డ మ్యాచ్‌ల సిరీస్ కోసం మిథాలీ సారథ్యంలోని మహిళా జట్టు దక్షిణాఫ్రికా టూర్‌కు బుధవారం బయలుదేరుతోంది. ఈ టూర్‌లోనే ఫిబ్రవరి 13నుంచి పోచెఫ్‌స్ట్రూమ్‌లో టి-20 సిరీస్ కూడా జట్టు ఆడనుంది.

01/24/2018 - 00:44

జోహానె్నస్‌బర్గ్, జనవరి 23: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని దక్షిణాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్ గ్రీమీ స్మిత్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుమ్యాచ్‌లలో భారత్ ఓటమి చెంది, ఈనెల 24న మూడో మ్యాచ్‌కు తయారవుతున్న వేళ స్మిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

01/24/2018 - 00:44

న్యూఢిల్లీ, జనవరి 23: దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్ ఘోర వైఫల్యంపై విశే్లషణ, సమీక్షకు రంగం సిద్ధమైంది. భారత్ ఇంత ఘోరంగా పరాజయం పాలుకావడానికి కారణం ఏమిటన్న దానిపై బీసీసీఐ నిర్వహించే అడ్మినిస్ట్రేటర్ల కమిటీ దృష్టి సారించబోతోంది. కేప్‌టౌన్, సెంటూరియన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిన భారత్, సరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే.

Pages