S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/24/2018 - 00:43

సిడ్నీ, జనవరి 23: కాన్‌బెరాలో వచ్చేనెలలో ఇంగ్లాండ్‌తో జరిగే ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ టీ-20లో ఆడే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్పిన్నర్ నాథన్ లియాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ కంట్రోల్ బోర్డు పేర్కొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెష్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0 తేడాతో విజయం సాధించడంలో లియాన్ ప్రముఖ పాత్ర వహించాడు. ఐదు మ్యాచ్ ఈ సిరీస్‌లో లియాన్ 21 వికెట్లు తీసుకున్నాడు.

01/24/2018 - 00:43

మెల్బోర్న్, జనవరి 23: వచ్చేనెల దక్షిణాఫ్రికాలో జరిగే టి-20 ఇంటర్నేషనల్ ట్రై సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విశ్రాంతినిచ్చారు. ఆతని స్థానంలో డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో ఈ జట్టు తలపడనుంది.

01/24/2018 - 00:42

మెల్బోర్న్, జనవరి 23: వచ్చేనెల 15న దక్షిణాఫ్రికా టూర్‌కు 15 మంది సభ్యులు కలిగిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే, ఈ జట్టులో అనూహ్యంగా స్పిన్నర్ జాన్ హోలాండ్, పేసర్ జేరిచర్డ్సన్‌ను ఎంపిక చేయడం గమనార్హం. ఎడమ చేతివాటం కలిగిన 30 ఏళ్ల హోలండ్ 2016లో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుమ్యాచ్‌లలో ఆడాడు. అయినా, అతనిని ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన యాషెష్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

01/24/2018 - 00:41

మెల్బోర్న్, జనవరి 23: తన పిల్లలకు కూడా ఆటలంటే చాలా ఇష్టమని, అలాగని వారిని కూడా తనలాగే టెన్నిస్‌పైనే దృష్టి సారించాలని కోరుకోవడం లేదని టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అన్నాడు. తన ఆట తీరును భార్య మిర్కాతోపాటు పిల్లలు అదే పనిగా చూడరని అన్నాడు.

01/24/2018 - 00:41

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ ఆటగాడు బొపన్న, హంగేరీ ఆటగాడు థిమియా బబోస్‌తో కలసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన టోర్నీలో ఐదో సీడ్ జంట అయిన బొపన్న, థిమియా జోడీ అమెరికాకు చెందిన జోడి వానియా కింగ్, క్రొయేషియాకు చెందిన ఫ్రాంకో కుగోర్‌పై 6-4, 6-4 తేడాతో విజయం సాధించారు.

01/24/2018 - 00:40

సియోల్, జనవరి 23: వచ్చే నెలలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించేందుకు వీలుగా అనువైన స్థలం ఎంపికతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా ప్రతినిధి బృందం సియోల్ చేరుకుంది. హేన్ సోంగ్ వోల్ నేతృత్వంలోని ఏడుగు సభ్యులు గల బృందం గట్టి భద్రత మధ్య ఇక్కడకు వచ్చింది. ఇక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఆ బృందం నిరాకరించింది.

01/24/2018 - 00:40

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 3 ఆటగాడు గ్రిగర్ డిమిట్రోవ్ ఓటమి చెందాడు. ఇతనితో తలపడిన ఇంగ్లాండ్‌కు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు 23 ఏళ్ల కెయిల్ ఎడ్మండ్ విజయం సాధించి ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌లోకి వెళ్లిన ఆరో బ్రిటీష్ ఆటగాడిగా ఘనత సాధించాడు.

01/24/2018 - 00:37

డబ్ల్యుసి క్వీన్‌స్టన్, జనవరి 23: ఇక్కడ జరుగుతున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన ఈ పోటీలో ఆస్ట్రేలియా స్పిన్నర్ లాయిడ్ పోప్ బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. టోర్నీలో 35 పరుగులిచ్చి 8 వికెట్లు తీసుకోవడం ద్వారా జట్టును సెమీ ఫైనల్‌లో తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.

01/23/2018 - 01:51

ఆస్ట్రేలియా గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సోమవారం మూడు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియాను మాడిసన్ కీస్ ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో 14వ సీడ్‌గా బరిలోకి దిగిన మాజీ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌పై చుంగ్ హియాన్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు.

01/23/2018 - 01:49

జొహానె్నస్‌బర్గ్, జనవరి 22: దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు టెస్టులను కోల్పోయి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రత్యర్థికి సమర్పించుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా చివరిదైన మూడో టెస్టును గెల్చుకుంటుందా లేక దానినీ చేజార్చుకొని వైట్‌వాష్ వేయించుకుంటుందా? అన్న ప్రశ్న అభిమానులను వేధిస్తున్నది. జరిగిన పొరపాట్లను గుర్తించి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారా?

Pages