S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/23/2018 - 01:48

మెల్బోర్న్, జనవరి 22: మోచేతి గాయం కారణంగా సుమారు ఆరు నెలలు విశ్రాంతి తీసుకొని, తిరిగి అంతర్జాతీయ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టిన ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ పోరాటం ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌తో ముగిసింది. దక్షిణ కొరియాకు చెందిన చుంగ్ హియాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో జొకోవిచ్ 6-7, 5-7, 6-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు.

01/23/2018 - 01:47

జొహానె్నస్‌బర్గ్, జనవరి 22: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మన్ అజింక్య రహానేను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకోకపోవడాన్ని టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ సమర్థించుకున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

01/23/2018 - 01:46

న్యూఢిల్లీ, జనవరి 22: ఈ ఏడాది జరిగే 11వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 7న మొదలవుతుంది. టోర్నీ పాలక మండలి సోమవారం ప్రకటించిన వివరాల ప్రకారం, 11వ ఐపీఎల్ ఏప్రిల్ 7న మొదలై మే 27న ముగుస్తుంది. మన దేశంలోనేగాక, యావత్ ప్రపంచంలోనూ అత్యధిక ఆదాయాన్ని సంపాదించిపెట్టే టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌లో ఈసారి మొదటి మ్యాచ్‌కి ముంబయి ఆతిథ్యమిస్తుంది.

01/23/2018 - 01:45

మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ప్రపంచ 17వ ర్యాంక్ క్రీడాకారిణి మాడిసన్ కీస్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఏంజెలిక్ కెర్బర్‌తో పోరును ఖాయం చేసుకుంది.

01/23/2018 - 01:44

మెల్బోర్న్, జనవరి 22: ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ రేసులో అందరి కంటే ముందున్న ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఆమె నవోమీ ఒసాకాను 6-3, 6-2 తేడాతో చిత్తుచేసింది. ఈ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరడం ఆమెకు ఇది మూడోసారి. ఇంతకు ముందు 2014, 2015 సంవత్సరాల్లోనూ క్వార్టర్స్ చేరింది. అయితే, సెమీస్‌కు వెళ్లలేకపోయింది.

01/23/2018 - 01:43

మెల్బోర్న్, జనవరి 22: కెరీర్‌లో మొత్తం 19 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లతో రికార్డు సృష్టించిన స్విట్జర్లాండ్ వీరుడు, రెండో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అతను మార్టన్ ఫోస్కోవిక్స్‌ను 6-4, 7-6, 6-2 తేడాతో ఓడించాడు.

01/23/2018 - 01:42

జకార్తా, జనవరి 22: ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీపై భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ కనే్నశారు. మంగళవారం నుండి జరిగే ఈ టోర్నీ ద్వారా విజేతలకు 350,000 డాలర్లు దక్కుతాయి. గత సీజన్‌లో ఆడిన వివిధ టోర్నీల్లో మిశ్రమ ఫలితాలు కనబరిచిన ఈ ఇద్దరూ రానున్న సీజన్‌ను కూడా విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

01/23/2018 - 01:03

మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మ్యాచ్‌లో భారత జోడి రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ పరాజయం ఓటమి చెందారు. సోమవారం ఇక్కడ జరిగిన డబుల్స్ మూడో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఎడ్వర్డ్ రోజర్ వాజలిన్‌తో కలసి ఆడిన బొపన్న జోడి ఆస్ట్రియాకు చెందిన వలివర్ మరచ్, క్రొయేషికాకు చెందిన మాట్ పెవిక్ చేతిలో 6-4, 7-6 (7-5), 3-6 తేడాతో పరాజయం చెందారు.

01/23/2018 - 01:02

క్రైస్‌చర్చ్, జనవరి 22: ఐసీసీ అండర్-19 టోర్నీలో కెనడా, జింబాబ్వే జట్లు సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాయి. పపువా న్యూ గునియా, నమీబియాతో సోమవారం జరిగిన వేర్వేరు మ్యాచ్‌లలో ఆ రెండు జట్లు విజయం సాధించాయి. కెనడా ఆల్‌రౌండర్ ఆకాశ్ గిల్ తన అద్భుత సెంచరీతో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లగా, అందుకు ప్రతిగా పపువా న్యూ గునియా కేవలం 80 పరుగులు చేయగలిగింది.

01/23/2018 - 01:02

కోల్‌కతా, జనవరి 22: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పంజాబ్ మూడు వికెట్ల తేడాతో ముంబయిపై విజయం సాధించింది. జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన యువరాజ్ సింగ్ 34 బంతుల్లోనే 40 పరుగులు సాధించి, పంజాబ్ విజయానికి తోడ్పడ్డాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

Pages