-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ప్రతిష్ఠాత్మక ముంబయి మారథాన్ పురుషుల విభాగంలో పతకాలు సాధించిన అథ్లెట్లు (ఎడమ నుంచి కుడికి) షుమెట్ అకల్నా (రజతం), సొలొమన్ డెక్సిసా (స్వర్ణం), జాషువా కిప్కోరిర్ (కాంస్యం). మహిళల విభాగంలో అమానే గొబెనా (స్వర్ణం), బర్నెస్ కిటుర్ (రజతం), షుకో జెనెమో (కాంస్యం) విజేతలుగా నిలిచారు.
ఢాకా, జనవరి 21: మూడు దేశాలు పదోటీపడుతున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ని శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 198 పరుగులకే ఆలౌట్‌కాగా, ఆ లక్ష్యాన్ని శ్రీలంక 44.5 ఓవర్లలోనే, కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
షార్జా, జనవరి 20: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించిన అంధుల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు నిలబెట్టుకుంది. 40 ఓవర్ల ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ శనివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా రెండు పర్యాయాలు ఈ టైటిల్‌ను సాధించిన రెండో జట్టుగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది.
చికాగో, జనవరి 20: తీవ్రమైన మానసిక ఒత్తిడి, అసహనం, ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఒకానొక దశలో తనను ఆత్మహత్యకు పురిగొల్పాయని లెజెండరీ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ అన్నాడు. డిప్రెషన్ అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళుతుందో చెప్పడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అన్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించిన ఫెల్ప్స్ ఆ పోటీలు ముగిసిన వెంటనే తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు చెప్పాడు.
మెల్బోర్న్, జనవరరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి రష్యా బ్యూటీ మరియా షరపోవా నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఏంజెలిక్ కెర్బర్‌ను ఢీకొన్న ఆమె 1-6, 3-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న కెర్బర్ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కనబరచింది. షరపోవాతో పదేపదే పొరపాట్లు చేయించి, విజయాన్ని నమోదు చేసింది.
మెల్బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ దూకుడును కొనసాగిస్తున్నాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రిచర్డ్ గాస్క్వెట్‌ను 6-2, 7-5, 6-4 తేడాతో ఓడించి, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు.
మెల్బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్‌లో శనివారం ప్రపంచ నంబర్ వన్ సిమోనా హాలెప్, లారెన్ డావిస్ మధ్య జరిగిన మారథాన్ మ్యాచ్ ప్రేక్షకులను అలరించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో హాలెప్ అతి కష్టం మీద విజయం సాధించి, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన హాలెప్ రెండో సెట్లో పుంజుకొని ఎదురుదాడి చేసింది.
మెల్బోర్న్: పూరవ్ రాజాతో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. పేస్, రాజా జోడీ హోరాహోరీగా జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో జెమీ ముర్రే, బ్రూనో సొయెర్స్ జోడీని 7-6, 5-7, 7-6 తేడాతో ఓడించింది.
లాస్ ఏంజెలిస్, జనవరి 20: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ 100 మీటర్ల స్ప్రింట్‌లో రజత పతకాన్ని సాధించిన క్రిస్టియన్ కోల్మన్ ఇక్కడ జరుగుతున్న క్లెమ్సన్ ఇన్విటేషనల్ ట్రాక్ మీట్లో కొత్త రికార్డు సృష్టించాడు. 60 మీటర్ల ఇన్డోర్ రేస్‌ను 6.37 సెకన్లలో పూర్తి చేసిన ఈ 21 ఏళ్ల అమెరికా అథ్లెట్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
టౌరంగ, జనవరి 20: ఐసీసీ అండర్-19 ప్రపంచ కార్టర్ ఫైనల్స్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. శనివారం ఇక్కడ జరిగిన సూపర్ లీగ్ కోసం జరిగిన పోటీలోని గ్రూప్-సి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ 282 పరుగులు సాధించింది. గ్రూప్-సిలో తలపడుతున్న జట్లలో ఇంగ్లాండ్, కెనడా మధ్య జరిగే పోటీలో గెలుపొందే జట్టు ఫలితంపై బంగ్లాదేశ్ జట్టు ఫైనల్స్‌లో ఆడేందుకు అర్హత ఉంటుందా?