S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/21/2018 - 01:22

ముంబై, జనవరి 20: ముంబైలో ఆదివారం జరిగే 405,000 డాలర్ల టాటా ముంబై మారథాన్‌లో ఇన్నాళ్లూ ఆధిపత్యం చెలాయస్తున్న ఆఫ్రికన్ దేశాలైన కెన్యా, ఇథియోపియాలతో పోటీ పడుతున్న భారత్ రికార్డు సృష్టించాలని యోచిస్తోంది. పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించే ఈ మారథాన్‌లో పోటీ పడేందుకు భారత్‌కు చెందిన రన్నర్స్ ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు.

01/21/2018 - 01:22

టౌరంగ (న్యూజిలాండ్), జనవరి 20: నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం టౌరంగ బ్లేక్ పార్క్‌లో జరిగిన తుది గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ 3-1 తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్ అన్నివిధాల సంసిద్ధమై కివీస్‌ను ఎదుర్కొని విజయం సాధించి, ఫైనల్ చేరింది. టైటిల్ కోసం బెల్జియంతో ఆదివారం జరిగే తుది పోరాటానికి సన్నాహాలు చేస్తోంది.

01/21/2018 - 01:21

జనీవా, జనవరి 20: దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా అథ్లెట్లు పాల్గొనడం దాదాపు ఖాయమైంది. 22 మంది ఉత్తర కొరియా క్రీడాకారులు రెండు విభాగాల్లో పోటీపడతారని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఒక ప్రకటనలో తెలిపింది. మార్చ్ఫాస్ట్‌లో రెండు దేశాల ప్రతినిధులు ఒకే జట్టుగా పాల్గొంటాయని పేర్కొంది.

01/21/2018 - 01:21

సిడ్నీ, జనవరి 20: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో, ఇంగ్లాండ్‌ను వనే్డ సిరీస్‌లోనూ చిత్తు చేస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ, ఆస్ట్రేలియా జట్టు అందుకు భిన్నంగా పసలేని ఆటతో అందరినీ నిరాశ పరుస్తున్నది. ఇప్పటికే జరిగిన రెండు వనే్డల్లో పరాజయాలను చవిచూసిన నేపథ్యంలో, ఆదివారం జరిగే మూడో వనే్డ ఆ జట్టుకు అత్యంత కీలకంగా మారింది.

01/20/2018 - 02:41

పంచదార బొమ్మ.. గోల్ఫ్ ఆడితే.. అంటూ స్టిక్ పట్టుకొని బాల్‌ను కొడుతూ గోల్ఫ్‌కోర్టులో ప్రేక్షకులను సినీనటి కాజల్ అలరించారు. గోల్కొండలోని
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో క్యాన్సర్ క్రూసేడర్స్ ఆఫ్ క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్విటేషన్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో గోల్ఫ్ ఆడి సందడి చేశారు.

01/19/2018 - 01:11

సెంచూరియన్, జనవరి 18: కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలే భారత క్రికెట్ జట్టును ముంచేశాయా? పొరపాటు నిర్ణయాలకు ఆటగాళ్ల నిర్లక్ష్యం కూడా తోడైన కారణంగానే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమిపాలైందా? మూడుమ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండానే కోల్పోవడానికి గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం కూడా ఒక కారణమా? నిపుణులు, విశే్లషకులు ఔననే అంటున్నారు.

01/19/2018 - 01:09

మెల్బోర్న్, జనవరి 18: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో టెన్నిస్ స్టార్ మరియా షరపోవా గురువారం మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. మెల్బోర్న్‌లో వేసవి ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్షియస్‌కు చేరిప్పటికీ, ఆమె రెండో రౌండ్‌లో అనస్తసిజా సెవస్టోవాను 6-1, 7-6 తేడాతో ఓడించింది. 14వ సీడ్‌గా బరిలోకి దిగిన షరపోవా రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ టోర్నీలో ఆడుతున్నది.

01/19/2018 - 01:07

మెల్బోర్న్, జనవరి 18: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మాజీ నంబర్ వన్, సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్ చేరాడు. రెండు గంటల, 45 నిమిషాలు సాగిన పోరులో అతను గేల్ మోన్ఫిల్స్‌ను 4-6, 6-3, 6-1, 6-3 తేడాతో ఓడించాడు. డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ వంటి స్టార్లు నాలుగో రోజు బరిలో ఉన్నప్పటికీ, జొకోవిచ్ స్టార్ అట్రాక్షన్‌గా మారాడు.

01/19/2018 - 01:06

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్‌లో పురుషుల విభాగంలో భారత్ జంట లియాండర్ పేస్, పురవ్ రాజా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. నికొలజస్ బసిలషివ్లి, ఆండ్రియాస్ హైదర్ వౌరెర్ జంటను 6-2, 6-3 తేడాతో వీరిద్దరూ ఓడించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జంట రెండో రౌండ్‌లో ప్రవేశించారు. ప్రస్తుతం భారత్ టెన్నిస్ ఆటగాళ్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది.

01/19/2018 - 01:05

వౌంట్ మాంగనూయి (న్యూజిలాండ్), జనవరి 18: జింబాబ్వేతో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోనున్నట్టు ఐసీసీ భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌లోకి బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్ జట్టు నాకౌట్ దశలోనే గత చాంపియన్ ఆస్ట్రేలియాతోపాటు, పపువా న్యూ గునియా టీమ్‌లను ఓడించిన విషయం తెలిసిందే.

Pages